నథింగ్ ఫోన్ 4బి లో 6.7 ఇంచుల పెద్ద అమోలెడ్ డిస్ప్లేను ఇవ్వబోతున్నారు. స్మూత్ పర్ఫార్మెన్స్, బెటర్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఇందులో 120హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ ఉండనుంది.
Photo Credit: Nothing Phone 4b
Nothing Phone 4b
Nothing Phone 4b : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన డిఫరెంట్ డిజైన్లతో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన నథింగ్ కంపెనీ, ఇప్పుడు సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ 'బి' సిరీస్‌ను పరిచయం చేయడానికి రెడీ అయింది. ఈ సిరీస్ లో భాగంగా వస్తున్న మొట్టమొదటి ఫోన్ నథింగ్ ఫోన్ 4బి వచ్చే నెల జూలై 7వ తేదీన అధికారికంగా లాంచ్ కాబోతోంది. ఇప్పటికే కంపెనీ ఈ ఫోన్ డిజైన్‌ను, ఒక సరికొత్త బ్లూ కలర్ వేరియంట్‌ను టీజ్ చేస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. అయితే, ఫోన్ లాంచ్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ, ప్రముఖ టెక్ టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ ఈ అప్కమింగ్ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్లను ఎక్స్ వేదికగా లీక్ చేశారు.
లీకైన సమాచారం ప్రకారం.. నథింగ్ ఫోన్ 4బి లో 6.7 ఇంచుల పెద్ద అమోలెడ్ డిస్ప్లేను ఇవ్వబోతున్నారు. స్మూత్ పర్ఫార్మెన్స్, బెటర్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఇందులో 120హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ ఉండనుంది. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే, క్వాల్కమ్ కంపెనీకి చెందిన సరికొత్త స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్‌సెట్‌తో ఈ ఫోన్ రన్ కాబోతోంది. ఇటీవల ప్రముఖ బెంచ్‌మార్కింగ్ సైట్ గీక్‌బెంచ్‌లో కూడా ఇదే చిప్‌సెట్, మోడల్ నంబర్ A005 తో ఈ ఫోన్ స్పాట్ అయింది. ఈ ఫోన్ సింగిల్ కోర్ టెస్టులో 1,088 స్కోరు, మల్టీ కోర్ టెస్టులో 3,155 స్కోరు సాధించి తన పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌ను నిరూపించుకుంది.
గీక్‌బెంచ్ లిస్టింగ్ ప్రకారం ఈ నథింగ్ ఫోన్ 4బి అవుట్-ఆఫ్-ది-బాక్స్ సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆధారిత నథింగ్ ఓఎస్‌తో పనిచేయనుంది. లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకునే వారికి ఇది ఒక మంచి గుడ్ న్యూస్. మార్కెట్లోకి ఈ ఫోన్ రెండు రకాల మెమొరీ ఆప్షన్లతో రాబోతోంది. ఇందులో బేస్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్‌తో రాగా, హై-ఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ఆప్షన్‌తో లభించనుంది.
iPhone 18 : యాపిల్ ఐఫోన్ లవర్స్‌కు బిగ్ అలర్ట్.. ఐఫోన్ 18 లాంచ్ స్ట్రాటజీలో భారీ మార్పులు
ఫొటోగ్రఫీ కోసం నథింగ్ ఫోన్ 4బి వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను ఇస్తున్నట్లు కంపెనీ ఇప్పటికే అధికారికంగా కన్ఫర్మ్ చేసింది. టిప్‌స్టర్ లీక్ ప్రకారం.. ఇందులో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో రాబోతోంది. సెకండరీ కెమెరా వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే, నథింగ్ ఫోన్లలోనే అత్యంత భారీ బ్యాటరీ అయిన 5,400ఎమ్‌ఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని ఈ ఫోన్‌లో అమర్చబోతున్నారు. దీనివల్ల ఒక్కసారి ఛార్జ్ చేస్తే హ్యాపీగా రెండు రోజుల పాటు బ్యాటరీ లైఫ్ వస్తుందని టెక్ వర్గాలు అంటున్నాయి.
నథింగ్ ఫోన్లకు ఉండే ప్రత్యేకమైన గుర్తింపు వెనుక ఉండే గ్లిఫ్ లైట్లు. అయితే ఈ నథింగ్ ఫోన్ 4బి లో మునుపటి లాగా పెద్ద పెద్ద గ్లిఫ్ లైట్లు ఉండవు. కెమెరా ఐలాండ్ కింద భాగంలో కేవలం ఒక చిన్న హారిజాంటల్ గ్లిఫ్ బార్‌ను మాత్రమే డిజైన్ చేశారు. ఈ చిన్న లైటింగ్ ఎలిమెంట్ ఫోన్ నోటిఫికేషన్లు వచ్చినప్పుడు, ఛార్జింగ్ అవుతున్నప్పుడు, కొన్ని ప్రత్యేకమైన యాప్స్ అలర్ట్స్ కోసం బ్లింక్ అవుతూ యూజర్లకు విజువల్ ఇండికేషన్లను అందిస్తుంది. ఈ ఫోన్ ధర, మిగిలిన ఫీచర్లు తెలియాలంటే జూలై 7న జరగబోయే అఫీషియల్ లాంచ్ ఈవెంట్ వరకు ఆగాల్సిందే.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,909
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Flipkart Products Get Buy Button in Google Gemini and AI Mode Test: Report