షావోమి సంస్థ ఈ సరికొత్త వైర్‌లెస్ మౌస్‌ను ప్రస్తుతానికి చైనా మార్కెట్లో విడుదల చేసింది. అక్కడ దీని ధరను 199 యువాన్లుగా నిర్ణయించారు.
Photo Credit: xiaomi-miui
Xiaomi Wireless Mouse 4 Pro
Xiaomi : ప్రముఖ టెక్ దిగ్గజం షావోమి వినియోగదారుల కోసం సరికొత్త కంప్యూటర్ యాక్ససరీని మార్కెట్లోకి తీసుకొచ్చింది. షావోమి వైర్‌లెస్ మౌస్ 4 ప్రో పేరుతో ఈ సరికొత్త వైర్‌లెస్ మౌస్‌ను లాంచ్ చేసింది. దీని పేరుకు తగ్గట్టుగానే ఇది వైర్‌లెస్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఆఫీస్ పనులు చేసుకునే వారికి, గేమర్స్‌కు కంఫర్ట్‌గా ఉండేలా దీనిని డిజైన్ చేశారు. ఈ మౌస్ ప్రత్యేకత ఏంటంటే, ఇందులో సైలెంట్ క్లిక్ ఫీచర్‌ను అందించారు. దీనివల్ల బటన్స్ క్లిక్ చేసినప్పుడు ఎలాంటి శబ్దం రాదు. సైజ్ పరంగా కూడా ఇది చాలా కాంపాక్ట్‌గా ఉంటూ, చేతిలో సులభంగా ఇమిడిపోతుంది.
షావోమి సంస్థ ఈ సరికొత్త వైర్‌లెస్ మౌస్‌ను ప్రస్తుతానికి చైనా మార్కెట్లో విడుదల చేసింది. అక్కడ దీని ధరను 199 యువాన్లుగా నిర్ణయించారు. మన భారతీయ కరెన్సీలో దీని విలువ సుమారు 2,800 రూపాయలుగా ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్/కంప్యూటర్ యాక్ససరీ జూలై 7వ తేదీ నుంచి అధికారికంగా విక్రయానికి రానుంది. కస్టమర్లు దీనిని షావోమి అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ సైట్ JD.com ద్వారా కొనుగోలు చేయవచ్చు. త్వరలోనే ఇది భారత మార్కెట్లోకి కూడా వచ్చే అవకాశం ఉందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ మౌస్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే, ఇది మీడియం లేదా చిన్న సైజు అరచేయి ఉన్న వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా తయారు చేయబడింది. ఈ మౌస్ కొలతలు 115.5x62x36.5 మిమీగా ఉన్నాయి. దీని బరువు కేవలం 66 గ్రాములు మాత్రమే (బ్యాటరీ లేకుండా). ఈ మౌస్ పైభాగంలో బ్లాక్ అండ్ వైట్ ప్లాస్టిక్‌తో కూడిన ఆకర్షణీయమైన మ్యాగ్నెటిక్ టాప్ కవర్ అమర్చారు. ఈ కవర్ లోపల బ్యాటరీ పెట్టుకోవడానికి, అలాగే 2.4GHz యూఎస్‌బీ రిసీవర్‌ను సురక్షితంగా దాచుకోవడానికి ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. అలాగే మౌస్ కింద భాగంలో స్మూత్‌గా మూవ్ అవ్వడానికి PTFE ఫీట్‌ను ఉపయోగించారు.
ఈ మౌస్ మెయిన్ లెఫ్ట్, రైట్ క్లిక్ బటన్స్ కోసం షావోమి కంపెనీ TTC సైలెంట్ స్విచ్ టెక్నాలజీని ఉపయోగించింది. దీనివల్ల ఎక్కువ మంది కలిసి పనిచేసే షేర్డ్ ఆఫీస్ స్పేస్‌లు, ప్రశాంతంగా ఉండే లైబ్రరీలు లేదా అర్ధరాత్రి వేళల్లో ఇంట్లో పని చేసుకునేటప్పుడు ఇతరులకు ఎలాంటి క్లిక్ సౌండ్ డిస్టర్బెన్స్ కలగదు. దీని సైడ్ బటన్స్‌కు మెటాలిక్ కోటింగ్ ఇచ్చారు. మౌస్ పైన ఒక చిన్న ఎల్‌ఈడీ ఇండికేటర్ ఉంటుంది, ఇది బ్యాటరీ లైఫ్, DPI సెట్టింగ్స్‌ను చూపిస్తుంది. స్క్రోల్ వీల్ కోసం ఇందులో డైనమిక్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ మెకానిజంను వాడారు.
MG Motors : భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎంజీ మోటార్ కొత్త రికార్డు.. జూన్ నెలలో ఊహించని రేంజ్‌లో సేల్స్
ఈ మౌస్‌లోని మరో అద్భుతమైన ఫీచర్ ఏంటంటే.. ఇందులో షావోమికి చెందిన ప్రత్యేకమైన TOG (Track-On-Glass) సెన్సార్‌ను అమర్చారు. కనీసం 4 మిమీ మందం ఉన్న ఎలాంటి క్లియర్ గ్లాస్ ఉపరితలం పైన అయినా ఇది చాలా ఖచ్చితత్వంతో ట్రాక్ చేయగలదు. అంటే ఒకవేళ మీరు ఆఫీస్ లేదా ఇంట్లో గ్లాస్ డెస్క్‌పై కూర్చుని పనిచేస్తుంటే, మీకు విడిగా ఎలాంటి మౌస్ ప్యాడ్ అవసరం ఉండదు. నేరుగా అద్దం పైనే ఈ మౌస్‌ను రన్ చేసుకోవచ్చు.
కనెక్టివిటీ పరంగా ఇది ఒకేసారి మూడు డివైజ్‌లకు కనెక్ట్ అయ్యే సపోర్ట్‌ను ఇస్తుంది. ఒక డివైజ్‌కు 2.4GHz USB రిసీవర్ ద్వారా, మరో రెండు డివైజ్‌లకు బ్లూటూత్ 5.0 ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. మనం వాడుతున్న కంప్యూటర్, లాప్‌టాప్ లేదా టాబ్లెట్ మధ్య సులభంగా మారడానికి మౌస్ పైనే ఒక ప్రత్యేకమైన బటన్‌ను కూడా ఇచ్చారు.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,909
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Nothing Deals Revealed for Phone 4 Series, CMF Buds Lineup, More Ahead of Flipkart's Big Billion Days Sale