8849 ట్యాంక్ 5 స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ ఏకంగా 18GB ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఒకే ఒక సింగిల్ ప్రీమియం వేరియంట్‌లో విడుదల చేసింది.
Photo Credit: 8849 Tank 5
8849 Tank 5
8849 Tank 5 : స్మార్ట్‌ఫోన్ రంగంలో సరికొత్త ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే చైనా మొబైల్ తయారీ సంస్థ 8849, టెక్ ప్రపంచం ముక్కున వేలేసుకునేలా ఒక వినూత్న డివైజ్‌ను పరిచయం చేసింది. 8849 ట్యాంక్ 5 పేరుతో ఒక పవర్‌ఫుల్ రగ్గడ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. సాధారణ ఫోన్లకు భిన్నంగా దీని లోపలే ఒక అడ్వాన్స్‌డ్ ప్రొజెక్టర్‌ను అమర్చడం ఈ ఫోన్ ప్రధాన హైలైట్. అడ్వెంచర్లు చేసేవారికి, గృహ వినియోగదారులకు ఒకే చోట ఫోన్, హోమ్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేలా దీనిని రూపొందించారు.
ఫీచర్ల పరంగానే కాకుండా మెమరీ పరంగా కూడా ఈ ఫోన్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. 8849 ట్యాంక్ 5 స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ ఏకంగా 18GB ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఒకే ఒక సింగిల్ ప్రీమియం వేరియంట్‌లో విడుదల చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో దీని ధరను $899.99 (మన కరెన్సీలో దాదాపు రూ.84,791) గా నిర్ణయించారు. ఈ వింతైన రగ్గడ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారు 8849 బ్రాండ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు.
ఈ ఫోన్‌లో అమర్చిన ప్రొజెక్టర్ 220-ల్యూమెన్స్ బ్రైట్‌నెస్, 2048×1080 హై-రెజల్యూషన్ (2K) సపోర్ట్‌తో వస్తుంది. ఇది కేవలం పూర్తిగా చీకటిగా ఉన్న రూమ్‌లోనే కాకుండా, పగటిపూట ఇంట్లోకి వచ్చే వెలుతురులో లేదా బయట నీడ ఉన్న ప్రదేశాలలో కూడా అత్యంత స్పష్టమైన చిత్రాలను స్క్రీన్ పై ప్రదర్శిస్తుంది. ఈ ప్రొజెక్టర్ హై-బ్రైట్‌నెస్ మోడ్‌లో వరుసగా 5 గంటలు, నైట్ మోడ్‌లో అయితే ఏకంగా 6 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. దీనివల్ల లాంగ్ మూవీస్ లేదా ఆఫీస్ ప్రెజెంటేషన్లను సులభంగా చూసుకోవచ్చు. ఇందులో ఉన్న 97dB స్మార్ట్ పీఏ స్పీకర్ ఔట్‌డోర్ సినిమాలకు థియేటర్ లాంటి లౌడ్ సౌండ్‌ను అందిస్తుంది.
ఈ రగ్గడ్ ఫోన్ లో 6.73-ఇంచుల బ్రహ్మాండమైన 3K అమోలెడ్ అల్ట్రా బ్రైట్ స్క్రీన్‌ను ఇచ్చారు. ఇది 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్, ఎండలో కూడా స్పష్టంగా కనిపించేలా 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ లో ఫ్లాగ్‌షిప్ 4nm ఆర్కిటెక్చర్‌పై తయారైన ఆక్టా-కోర్ 'మీడియాటెక్ డైమెన్సిటీ 9400e చిప్‌సెట్‌ను వాడారు. దీనిలోని ప్రొజెక్టర్‌కు 4 మీటర్ల లేజర్ ఆటోఫోకస్, కీస్టోన్ కరెక్షన్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్ల అప్‌గ్రేడ్‌ను కూడా జోడించారు.
సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, ఈ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. వినియోగదారుల భద్రత కోసం కంపెనీ ఈ ఫోన్‌కు ఏకంగా 5 సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని ప్రామిస్ చేసింది. ఇందులో 18GB ఫిజికల్ ర్యామ్‌తో పాటు అదనంగా మరో 18GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉంది. అంటే మొత్తంగా 36GB వరకు ర్యామ్ పవర్‌ను ఇది కలిగి ఉంటుంది. దీనిలోని 512GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా ఏకంగా 2TB వరకు పెంచుకోవచ్చు.
Google Pixel 10 : అమెజాన్‌లో గూగుల్ పిక్సెల్ 10పై భారీ డిస్కౌంట్.. కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్
ఫోటోగ్రఫీ కోసం 8849 ట్యాంక్ 5 వెనుక భాగంలో మూడు పవర్‌ఫుల్ కెమెరాలను అమర్చారు. అందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాతో పాటు చీకట్లో కూడా అద్భుతమైన ఫోటోలు తీయగల 50-మెగాపిక్సెల్ నైట్ విజన్ కెమెరాను కూడా అందించారు. ఇక సెల్ఫీలు, హై-క్వాలిటీ వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 32-మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కేటాయించారు.
ప్రొజెక్టర్ రన్ అవ్వడానికి, ఫోన్ ఎక్కువ రోజులు పనిచేయడానికి ఇందులో ఏకంగా 17600mAh సామర్థ్యం గల రాక్షస బ్యాటరీని ప్యాక్ చేశారు. ఈ భారీ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయడం కోసం 120W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను ఇచ్చారు. దీనివల్ల ఈ భారీ బ్యాటరీ కేవలం 90 నిమిషాల వ్యవధిలోనే (0 to 100%) ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఇక కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్ లో డ్యూయల్ సిమ్, డ్యూయల్-ఫ్రీక్వెన్సీ జీపీఎస్, వై-ఫై 7 సపోర్ట్, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ వంటి అన్ని రకాల అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,805
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Lenovo ThinkBook 14x Launched in India With Intel Core Ultra Series 2 Processors: Price, Specifications