Ai+ నోవా 2 నియో 5G బేస్ వేరియంట్ (4GB+128GB) ధర రూ.12,999 కాగా, 6GB+128GB మోడల్ ధర రూ.13,999గా ఉంది.
Photo Credit: Ai Plus Nova 2
Ai Plus Nova 2
Ai+ Nova : దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో బడ్జెట్ 5G విభాగంలో సరికొత్త పోటీ మొదలైంది. ప్రముఖ మొబైల్ బ్రాండ్ Ai+ స్మార్ట్‌ఫోన్ భారతీయ కస్టమర్లను ఆకట్టుకోవడానికి తమ నోవా సిరీస్‌లో రెండు సరికొత్త మోడళ్లను పరిచయం చేసింది. Ai+ నోవా 2 నియో 5G, Ai+ నోవా 2 ప్రో 5G పేర్లతో ఈ ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చారు. తక్కువ బడ్జెట్‌లోనే పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్లు, భారీ బ్యాటరీ లైఫ్, అదిరిపోయే కెమెరా ఫీచర్లను ఈ ఫోన్లలో జోడించారు. ధరల విషయానికి వస్తే.. Ai+ నోవా 2 నియో 5G బేస్ వేరియంట్ (4GB+128GB) ధర రూ.12,999 కాగా, 6GB+128GB మోడల్ ధర రూ.13,999గా ఉంది. అలాగే ప్రీమియం మోడల్ అయిన Ai+ నోవా 2 ప్రో 5G లో 6GB+128GB వేరియంట్ ధర రూ. 15,999, 8GB+128GB టాప్ వేరియంట్ ధర రూ.17,999 గా నిర్ణయించారు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు జూన్ 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి రానున్నాయి. లాంచ్ ఆఫర్ కింద అన్ని బ్యాంక్ కార్డ్‌లపై కస్టమర్లకు రూ.1,000 తక్షణ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
Ai+ నోవా 2 నియో 5G స్పెసిఫికేషన్స్
ఈ సిరీస్‌లోని మొదటి మోడల్ నోవా 2 నియో 5G లో 6.74 ఇంచుల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. ఇది స్మూత్ పెర్ఫార్మెన్స్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత NxtQuantum OS పై రన్ అవుతుంది. ఇందులో భద్రత కోసం NxtPrivacy డాష్‌బోర్డ్, AI సపోర్ట్ కలవు. ఈ మొబైల్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5G ప్రాసెసర్‌ను అమర్చారు. అంతేకాకుండా, ఇందులో 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 6000mAh భారీ బ్యాటరీ, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
నోవా 2 నియో 5G కెమెరా, ఇతర ఫీచర్లు
ఫొటోగ్రఫీ కోసం ఈ ఫోన్ వెనుక భాగంలో 48 మెగాపిక్సెల్ సామర్థ్యం గల పవర్‌ఫుల్ సోనీ IMX582 AI ప్రైమరీ కెమెరాను అమర్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈ ఫోన్ మెమరీని మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా ఏకంగా 2TB వరకు పెంచుకోవచ్చు. ధూళి, నీటి చుక్కల నుంచి రక్షణ కోసం దీనికి IP65 రేటింగ్ ఇచ్చారు. ఈ ఫోన్ థిక్‌నెస్ కేవలం 8.5 మిమీ మాత్రమే. కనెక్టివిటీ పరంగా ఇందులో డ్యూయల్ సిమ్ 5G, వై-ఫై 5, బ్లూటూత్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Coolpad : మార్కెట్లోకి కూల్‌ప్యాడ్ కొత్త బడ్జెట్ ఫోన్.. ఐఫోన్ లాంటి అదిరిపోయే డిజైన్‌తో కూల్ 80 లాంచ్
Ai+ నోవా 2 ప్రో 5G ఫీచర్లు
ఇక ఈ సిరీస్‌లో టాప్ మోడల్ అయిన నోవా 2 ప్రో 5G లో 6.9 ఇంచుల పెద్ద ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు. ఇది ఫుల్ హెచ్‌డీ ప్లస్ రెజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. గేమింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఇందులో మల్టీ లేయర్ కూలింగ్ సిస్టమ్‌ను అమర్చారు. ఈ ఫోన్ కూడా ఆండ్రాయిడ్ 16 బేస్డ్ NxtQuantum OS పై పనిచేస్తుంది. ఇందులో మరింత అడ్వాన్స్‌డ్ AI ఫీచర్లు ఉన్నాయి. ఈ ప్రో మోడల్‌లో పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇందులో 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న 6000mAh బ్యాటరీని అందించారు. దీని స్టోరేజ్‌ను 1TB వరకు పెంచుకోవచ్చు.
ప్రో మోడల్ కెమెరా, ప్రీమియం లుక్
నోవా 2 ప్రో 5G కెమెరా విషయానికి వస్తే.. వెనుక భాగంలో 48MP సోనీ IMX582 మెయిన్ కెమెరాతో పాటు అదనంగా 8 మెగాపిక్సెల్ ఆల్ట్రా వైడ్ కెమెరాను కూడా అందించారు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈ ఫోన్ వెనుక భాగంలో ప్రీమియం 2.5D గ్లాస్ ఫినిషింగ్ ఇచ్చారు. అంతేకాకుండా కాల్స్, మెసేజ్‌లు, నోటిఫికేషన్లు వచ్చినప్పుడు వెలిగేలా బ్యాక్ ప్యానెల్‌పై కస్టమైజబుల్ లైట్స్ ఇవ్వడం దీని ప్రత్యేకత. మెరుగైన ఆడియో కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, డ్యూయల్ మైక్రోఫోన్లు, నీటి రక్షణ కోసం IP65 రేటింగ్‌ను ఇందులో చేర్చారు.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,909
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999