కూల్‌ప్యాడ్ కూల్ 80 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ చైనాలో లాంచ్ అయింది. ఐఫోన్ లాంటి డిజైన్, 90Hz డిస్‌ప్లే, హెలియో G99 ప్రాసెసర్, దీని ధరల పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Photo Credit: Coolpad Cool 80
Coolpad Cool 80
Coolpad : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ కూల్‌ప్యాడ్ మార్కెట్లో తన పట్టును మరింత బలోపేతం చేసుకోవడానికి సరికొత్త బడ్జెట్ మొబైల్‌ను పరిచయం చేసింది. చైనాలో జరిగిన ఒక ప్రత్యేక ఈవెంట్‌లో కూల్‌ప్యాడ్ కూల్ 80 స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ అధికారికంగా లాంచ్ చేసింది. పూర్తిగా ఎంట్రీ-లెవెల్, బడ్జెట్ సెగ్మెంట్ కస్టమర్లను టార్గెట్ చేస్తూ ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చారు. తక్కువ ధరలోనే నమ్మకమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చేలా దీనిని రూపొందించారు.
కూల్‌ప్యాడ్ కంపెనీ ఈ సరికొత్త కూల్ 80 స్మార్ట్‌ఫోన్‌ను కేవలం ఒకే ఒక్క సింగిల్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ మోడల్ ధరను చైనాలో 819 యువాన్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.11,500)గా నిర్ణయించారు. ఈ ఫోన్ రాక్ శాండ్ బ్లాక్, డ్యూన్ ఆరెంజ్, గాజ్ వైట్ వంటి మూడు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ప్రస్తుతం చైనాలో సేల్స్ ప్రారంభం కాగా, గ్లోబల్ మార్కెట్ లేదా ఇండియా లాంచ్ పై కంపెనీ ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
ఈ ఫోన్ రియర్ ప్యానెల్ డిజైన్ ప్రీమియం ఐఫోన్ మోడళ్లను పోలి ఉండటం విశేషం. కెమెరా లేఅవుట్ అమరిక కాస్త భిన్నంగా ఉన్నప్పటికీ, దూరం నుంచి చూసేటప్పుడు ఇది ఒక లగ్జరీ లుక్‌ను అందిస్తుంది. డిస్‌ప్లే విషయానికి వస్తే ఇందులో 6.7 ఇంచుల భారీ ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు. ఇది హెచ్‌డీ ప్లస్ రెజల్యూషన్‌తో పాటు స్మూత్ స్క్రోలింగ్ కోసం 90Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్ పైభాగంలో మోడ్రన్ లుక్ ఇచ్చే పంచ్-హోల్ డిజైన్ కెమెరా కటౌట్ కలదు. ఈ ఫోన్ థిక్‌నెస్ కేవలం 8.2mm మాత్రమే ఉంటుంది.
WhatsApp : భారతీయుడి చేతికి వాట్సాప్ పగ్గాలు.. సరికొత్త గ్లోబల్ సీఈఓగా క్రెడ్ ఫౌండర్ కునాల్ షా
బడ్జెట్ ధరలోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ అందించడం కోసం కూల్‌ప్యాడ్ కూల్ 80 లో మీడియాటెక్ హెలియో జీ99 ప్రాసెసర్‌ను అమర్చారు. దీనివల్ల రోజువారీ టాస్క్‌లతో పాటు నార్మల్ గేమింగ్‌ను కూడా ఈజీగా రన్ చేయవచ్చు. ఈ ఫోన్‌లో 6GB ఫిజికల్ ర్యామ్‌తో పాటు అదనంగా 8GB వరకు వర్చువల్ ర్యామ్ విస్తరణ సపోర్ట్ కలదు. అంటే టోటల్‌గా దీనిని 14GB ర్యామ్ వరకు ఉపయోగించుకోవచ్చు. అలాగే 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డ్ సహాయంతో మరికొంత పెంచుకునే వీలుంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ (5MP) ఫ్రంట్ కెమెరా కలదు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే అంతర్జాతీయ టెక్ వెబ్‌సైట్ గిజ్మోచైనా ప్రకారం.. జేడీ డాట్ కామ్ (JD.com) లిస్టింగ్‌లో ఈ ఫోన్ 4,000mAh బ్యాటరీ, 10W ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న మార్కెట్ ట్రెండ్ ప్రకారం 4000mAh అనేది కాస్త తక్కువ సామర్థ్యమే కాబట్టి, దీని బ్యాటరీ వివరాలపై కంపెనీ నుంచి పూర్తి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,909
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999