ఈ సేల్‌లో కొనుగోలు చేసే HDFC బ్యాంక్ కార్డ్‌హోల్డర్లకు 10 శాతం వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
Photo Credit: Xiaomi
Amazon Great Freedom Sale
Amazon Great Freedom Sale: ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్‌లో గ్రేట్ ఫ్రీడమ్ సేల్ సందడి మొదలైంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల వంటి అనేక ప్రొడక్ట్ కేటగిరీలపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తున్నారు. ప్రత్యేకం ఏంటంటే.. కస్టమర్ల కోసం ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్లు, అదనపు క్యాష్‌బ్యాక్, నో-కాస్ట్ ఈఎమ్‌ఐ వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. మీరు ప్రీమియం కేటగిరీలో సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఈ సేల్ ఒక మంచి అవకాశం.
బ్యాంక్ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలు
ఈ సేల్‌లో కొనుగోలు చేసే HDFC బ్యాంక్ కార్డ్‌హోల్డర్లకు 10 శాతం వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీనితో పాటు Amazon Pay ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి షాపింగ్ చేసే కస్టమర్లకు ఏకంగా 5 శాతం అదనపు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ఆఫర్ల వల్ల లగ్జరీ స్మార్ట్‌ఫోన్ల ఎఫెక్టివ్ ధర మరింత గణనీయంగా తగ్గుతుంది. గతంలో గేమింగ్ ల్యాప్‌టాప్‌లు, ప్రముఖ బ్రాండ్ల ట్యాబ్లెట్లపై ఆఫర్లను ప్రకటించిన అమెజాన్, ఇప్పుడు మోస్ట్ పాపులర్ ప్రీమియం ఫోన్లను అందుబాటు ధరలోకి తెచ్చింది.
షావోమి 17T, శామ్‌సంగ్ గెలాక్సీ S25 5G లపై భారీ డిస్కౌంట్
ఈ సేల్‌లో ప్రత్యేకంగా Xiaomi 17T స్మార్ట్‌ఫోన్ అసలు లిస్టెడ్ ధర రూ. 84,990 కాగా, ఆఫర్‌లో భాగంగా రూ. 64,999కే లభిస్తోంది. ఇటీవల భారత మార్కెట్లో లాంచ్ అయిన ఈ ఫోన్‌లో 6.59-ఇంచుల 1.5K OLED డిస్‌ప్లే, భారీ 6500mAh బ్యాటరీ వంటి హై-ఎండ్ ఫీచర్లు ఉన్నాయి. అలాగే Samsung Galaxy S25 5G అసలు ధర రూ. 80,999 కాగా, సేల్‌లో కేవలం రూ. 59,999 కే లభిస్తోంది. ఈ ఫోన్‌లో 6.2-ఇంచుల ఫుల్ HD+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 4000mAh బ్యాటరీ సపోర్ట్ ఉన్నాయి.
Amazon Great Freedom Sale: ఫ్రీడమ్ సేల్ ధమాకా.. శాంసంగ్ గెలాక్సీ S26 ఆల్ట్రా 5G పై రూ. 23,000 తగ్గింపు
ఇతర టాప్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల తగ్గింపు ధరల వివరాలు
అమెజాన్ సేల్‌లో OnePlus 15R స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 61,999 కాగా సేల్‌లో రూ. 56,999 కే దక్కుతోంది. iQOO 15R అసలు ధర రూ. 56,999 కాగా సవరించిన సేల్ ధర రూ. 49,999 గా ఉంది. Google Pixel 10 స్మార్ట్‌ఫోన్ MRP ధర రూ. 79,999 కాగా సేల్‌లో రూ. 66,800 కే కొనుగోలు చేయవచ్చు. Oppo Reno 16 5G అసలు ధర రూ. 89,999 కాగా భారీ తగ్గింపుతో రూ. 60,999 కే అందుబాటులో ఉంది. Motorola Edge 70 Max 5G MRP ధర రూ. 94,999 కాగా సేల్‌లో రూ. 58,996 కి లభిస్తోంది. అలాగే Vivo V70 5G అసలు ధర రూ. 65,999 కాగా సేల్‌లో రూ. 59,999 కే సొంతం చేసుకోవచ్చు.
| Model | Original Price | Sale Price | Product Link |
|---|---|---|---|
| OnePlus 15R | Rs. 61,999 | Rs. 56,999 | Buy Now |
| iQOO 15R | Rs. 56,999 | Rs. 49,999 | Buy Now |
| Xiaomi 17T | Rs. 84,990 | Rs. 64,999 | Buy Now |
| Google Pixel 10 | 79,999 | Rs. 66,800 | Buy Now |
| Oppo Reno 16 5G | Rs. 89,999 | Rs. 60,999 | Buy Now |
| Samsung Galaxy S25 5G | Rs. 80,999 | Rs. 59,999 | Buy Now |
| Motorola Edge 70 Max 5G | 94,999 | Rs. 58,996 | Buy Now |
| Vivo V70 5G | Rs. 65,999 | Rs. 59,999 | Buy Now |
ప్రకటన
ప్రకటన
Vivo X300 FE Price in India Hiked Again Amid Rising Memory Costs
Googlebook Laptops From Asus and Lenovo Leak in Renders Ahead of Official Launch