శాంసంగ్ గెలాక్సీ S26 ఆల్ట్రా 5G (12GB RAM + 256GB స్టోరేజ్) వేరియంట్ ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ. 1,39,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది.
Photo Credit: Samsung
Samsung Galaxy S26 Ultra 5G
Amazon Great Freedom Sale: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ నిర్వహిస్తున్న గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, గాడ్జెట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో మార్కెట్లోకి విడుదలైన శాంసంగ్ మోస్ట్ పాపులర్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy S26 Ultra 5G ని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అత్యంత లాభదాయకమైన సమయం. ఈ సేల్‌లో భాగంగా ఈ ఫోన్ పై నేరుగా ధర తగ్గింపుతో పాటు అదనపు బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ధర, బ్యాంక్ ఆఫర్ వివరాలు
శాంసంగ్ గెలాక్సీ S26 ఆల్ట్రా 5G (12GB RAM + 256GB స్టోరేజ్) వేరియంట్ ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ. 1,39,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. కాగా, ప్రస్తుతం అమెజాన్ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 1,19,900 కి లిస్ట్ చేయబడింది. దీనికి తోడు Amazon Pay ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ. 3,597 ఇన్ స్టంట్ తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్లతో కలిపి ఫోన్ ఎఫెక్టివ్ ధర రూ. 1,16,303కి తగ్గుతుంది. అంటే లాంచ్ ధరతో పోలిస్తే కస్టమర్లకు ఏకంగా రూ. 23,000 వరకు ఆదా అవుతుంది.
Amazon Great Freedom Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ధమాకా.. రూ. 20 వేల లోపే వన్‌ప్లస్ కొత్త స్మార్ట్‌ఫోన్
డిస్‌ప్లే, ప్రాసెసర్ సామర్థ్యం
Samsung Galaxy S26 Ultra 5G స్మార్ట్‌ఫోన్ 6.9-ఇంచుల డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 3120×1440 పిక్సెల్స్ రెజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ అత్యంత ఫాస్ట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలీట్ జెన్ 5 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే, ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత One UI 8.5 పై రన్ అవుతుంది.
200MP ఆల్ట్రా కెమెరా, పవర్ ఫుల్ బ్యాటరీ
కెమెరా సెటప్ పరంగా ఈ ఫోన్ అద్భుతంగా ఉంటుంది. దీని రియర్ సైడ్ f/1.4 అపార్చర్, OIS సపోర్ట్‌తో కూడిన 200MP వైడ్ యాంగిల్ ప్రైమరీ కెమెరా, 50MP పేరిస్కోప్ టెలిఫోటో (5x ఆప్టికల్ జూమ్), 50MP ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 10MP టెలిఫోటో (3x ఆప్టికల్ జూమ్) కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం f/2.2 అపార్చర్‌తో కూడిన 12MP ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ ఫోన్‌లో 60W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ ఉంది. కనెక్టివిటీ కోసం 5G, వై-ఫై 7, బ్లూటూత్ 5.4, ఎన్‌ఎఫ్‌సీ, టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్ బరువు 214 గ్రాములు, 7.9 మిమీ మందం కలిగి ఉంటుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,909
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999