Amazon : బ్యాంక్ కార్డు ఉంటే అదనపు డిస్కౌంట్.. ఈ సేల్‌లో అస్సలు మిస్ అవ్వకూడని టాప్ డీల్స్ ఇవే

టాప్ టెన్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్లపై కంపెనీ ఏకంగా 70 శాతం వరకు తగ్గింపును ప్రకటించింది. ఇందులో శామ్‌సంగ్, వన్‌ప్లస్, ఐకూ, వీవో వంటి దిగ్గజ బ్రాండ్ల ఫోన్లు ఉన్నాయి.

Amazon : బ్యాంక్ కార్డు ఉంటే అదనపు డిస్కౌంట్.. ఈ సేల్‌లో అస్సలు మిస్ అవ్వకూడని టాప్ డీల్స్ ఇవే

Photo Credit: Vivo

Amazon Mega Deal Days

ముఖ్యాంశాలు
  • అమెజాన్ మెగా డీల్ డేస్ సేల్ షురూ
  • స్మార్ట్‌ఫోన్లపై ఊహించని రేంజ్‌లో ఆఫర్స్
  • టాప్ బ్రాండెడ్ మొబైల్స్‌పై ఏకంగా 70 శాతం వరకు డిస్కౌంట్
ప్రకటన

Amazon :ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సరికొత్త సేల్‌తో ముందుకొచ్చింది. మార్కెట్లో ప్రస్తుతం అమెజాన్ మెగా డీల్ డేస్ సేల్ అత్యంత వైభవంగా నడుస్తోంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లతో పాటు ఎలక్ట్రానిక్స్ వస్తువులపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రత్యేకమైన సేల్ జూన్ 9వ తేదీ వరకు లైవ్‌లో ఉంటుంది. ముఖ్యంగా టాప్ టెన్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్లపై కంపెనీ ఏకంగా 70 శాతం వరకు తగ్గింపును ప్రకటించింది. ఇందులో శామ్‌సంగ్, వన్‌ప్లస్, ఐకూ, వీవో వంటి దిగ్గజ బ్రాండ్ల ఫోన్లు ఉన్నాయి. ఈ సేల్‌లో లభిస్తున్న అత్యుత్తమ మొబైల్ డీల్స్ ఏంటో వివరంగా చూద్దాం.

వీవో X300 FE పై ఏకంగా రూ.40,000 తగ్గింపు
ఈ సేల్‌లోనే అత్యంత క్రేజీ, బిగ్గెస్ట్ డీల్ ఏంటంటే అది వీవో X300 FE స్మార్ట్‌ఫోన్ అనే చెప్పాలి. కంపెనీ ఈ ప్రీమియం ఫోన్‌ను మొదట రూ.1,19,999 భారీ ధరతో లాంచ్ చేసింది. కానీ ప్రస్తుత అమెజాన్ సేల్‌లో దీనిని ఏకంగా రూ.79,999కే లిస్ట్ చేశారు. అంటే నేరుగా రూ.40,000 తక్కువకే ఈ ఫోన్ లభిస్తోంది. దీనికి తోడు అదనపు బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే మరో రూ.8,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఒకవేళ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే ఏకంగా రూ.12,000 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. ప్రీమియం ఫోన్ కోరుకునే వారికి ఇది సువర్ణావకాశం.

భారీ బ్యాటరీతో ఐకూ 15R  
గేమింగ్ మరియు పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇష్టపడే వారి కోసం ఐకూ 15R ఫోన్ అద్భుతమైన ఆఫర్ ధరలో లభిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర (MRP) రూ.53,990 కాగా, అమెజాన్ సేల్‌లో దీనిపై ఫ్లాట్ రూ.6,000 డిస్కౌంట్ ఇస్తూ రూ.46,998కే అందిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో అత్యంత శక్తివంతమైన లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5   చిప్‌సెట్‌ను ఉపయోగించారు. అంతేకాకుండా, ఇందులో ఏకంగా 7600mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చారు. కొన్ని సెలెక్టెడ్ బ్యాంక్ కార్డులను ఉపయోగించి కొంటే మరో రూ.2,000 అదనపు డిస్కౌంట్ వస్తుంది. అంటే మొత్తంగా రూ.8,000 లాభంతో ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.

 

Xiaomi Pad 8 : టాబ్లెట్ కొనాలనుకునే వారికి షాక్.. గుట్టుచప్పుడు కాకుండా ధరలు పెంచేసిన షావోమి

వన్‌ప్లస్ నోర్డ్ CE6 5G పై సూపర్ ఆఫర్
మరోవైపు మిడ్-రేంజ్ బడ్జెట్‌లో మంచి క్రేజ్ ఉన్న వన్‌ప్లస్ నోర్డ్ CE6 5G ఫోన్ కూడా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ మార్కెట్ రిటైల్ ధర రూ.40,999 కాగా, ఈ సేల్‌లో ఫ్లాట్ రూ.6,000 డిస్కౌంట్ తర్వాత కేవలం రూ.34,998 ధరకే లిస్ట్ చేశారు. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే ఇంకో రూ.1,000 అదనంగా ఆదా అవుతుంది. ఫీచర్ల పరంగా ఇందులో స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్, 144Hz రిఫ్రెష్ రేట్ గల 1.5K AMOLED డిస్‌ప్లే, ఏకంగా 8000mAh బ్యాటరీని అందించడం విశేషం.

తక్కువ బడ్జెట్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ M56 5G
విశ్వసనీయమైన బ్రాండ్ నుంచి మంచి ఫోన్ కావాలనుకునే వారి కోసం శామ్‌సంగ్ గెలాక్సీ M56 5G ఒక బెస్ట్ ఆప్షన్‌గా నిలిచింది. ఈ ఫోన్ అసలు ధర రూ.33,999 ఉండగా, అమెజాన్ డీల్‌లో భాగంగా దీనిని కేవలం రూ.23,498 కే సొంతం చేసుకోవచ్చు. రూ.10,000కి పైగా తగ్గిన ఈ ఫోన్‌లో స్ట్రాంగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్  ప్రొటెక్షన్, 50 మెగాపిక్సెల్ పవర్‌ఫుల్ మెయిన్ కెమెరా ఉన్నాయి. ఒకవేళ మీరు బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీల ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా మరో రూ.1,300 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.  

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. EV Sales : మార్కెట్‌లో ఈవీ సునామీ.. రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ టూవీలర్లు, కార్ల అమ్మకాలు
  2. Redmi Note 17 : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సునామీ.. 8,000mAh బ్యాటరీతో వస్తున్న రెడ్‌మీ నోట్ 17
  3. Oppo A7 Pro Max : పవర్ బ్యాంక్‌లకు శాశ్వతంగా గుడ్ బై.. ఒప్పో కొత్త ఫోన్ చూస్తే షాక్ అవ్వడం ఖాయం
  4. Digital India : దేశమంతటా డిజిటల్ జోరు.. 99.9 శాతం జిల్లాల్లో అందుబాటులోకి 5G సేవలు
  5. Vivo T5e vs Realme C100x vs Samsung Galaxy F70e 5G: రూ.15 వేల లోపు బెస్ట్ ఫోన్ ఏది?
  6. Samsung Galaxy S25 Ultra 5G : శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాపై భారీ ఆఫర్.. ఏకంగా రూ.47,000 తగ్గింది
  7. Voter List : ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా.. ఈసీఐ డ్రాఫ్ట్ లిస్ట్ విడుదల.. ఎలా చెక్ చేసుకోవాలంటే ?
  8. Google Pixel 11 Series Price Hike : గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ లవర్లకు షాక్.. భారీగా పెరగనున్న ధరలు
  9. Amazon Great Freedom Sale vs Flipkart Freedom Sale : ఆఫర్లే ఆఫర్లు.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల ఫ్రీడమ్ సేల్స్‌ వచ్చేస్తున్నాయ్
  10. Smartphone Price Hike : భారీగా పెరిగిన షియోమి, రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »