Xiaomi Pad 8 Price Hiked: షావోమి దెబ్బ.. Xiaomi Pad 8 ధర రూ.2000 పెంచేసిన కంపెనీ

Xiaomi Pad 8 Price hiked to Rs 2000: ధరల పెంపు తర్వాత షావోమి ప్యాడ్ 8 బేస్ వేరియంట్ అయిన 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ఇప్పుడు రూ.35,999 ధరకు అందుబాటులోకి వచ్చింది. దీని లాంచ్ ధర రూ.33,999 గా ఉండేది.

Xiaomi Pad 8 Price Hiked: షావోమి దెబ్బ.. Xiaomi Pad 8 ధర రూ.2000 పెంచేసిన కంపెనీ

Photo Credit: Xiaomi

Xiaomi Pad 8 has a 11.2-inch 3.2K display with up to 144Hz refresh rate

ముఖ్యాంశాలు
  • షావోమి ప్యాడ్ 8 పై రూ. 2,000 భారం
  • వన్‌ప్లస్, పోకో బాటలోనే నడుస్తున్న షావోమి
  • స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రొసెసర్, 9200mAh బ్యాటరీ
ప్రకటన

Xiaomi Pad 8 Price hiked to Rs 2000: ప్రముఖ చైనా గ్యాడ్జెట్ దిగ్గజం షావోమి భారతీయ కస్టమర్లకు ఊహించని షాక్ ఇచ్చింది. ఈ ఏడాది మార్చి నెలలో ఎంతో గ్రాండ్‌గా లాంచ్ చేసిన  షావోమి ప్యాడ్ 8 టాబ్లెట్ ధరలను దేశంలో పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, సైలెంట్‌గా అన్ని ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లపై ఒకేసారి రూ.2,000 మేర ధరను పెంచేసింది. ఈ సరికొత్త టాబ్లెట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రొసెసర్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన డిస్‌ప్లే వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో వస్తుంది.

అన్ని వేరియంట్ల కొత్త ధరల వివరాలు
ధరల పెంపు తర్వాత షావోమి ప్యాడ్ 8 బేస్ వేరియంట్ అయిన 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ఇప్పుడు రూ.35,999 ధరకు అందుబాటులోకి వచ్చింది. దీని లాంచ్ ధర రూ.33,999 గా ఉండేది. అలాగే దీని టాప్-ఎండ్ మోడల్ అయిన 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.36,999 నుంచి రూ.38,999కి పెరిగింది. ఒకవేళ ఈ టాప్ మోడల్‌ను షావోమి ఫోకస్ పెన్ ప్రో స్టైలస్‌తో కలిపి బండిల్ ఆఫర్‌గా కొనాలనుకుంటే.. మునుపటి ధర రూ.41,999కి బదులుగా ఇప్పుడు రూ.43,999 చెల్లించాల్సి ఉంటుంది.

నానో టెక్స్చర్ డిస్‌ప్లే మోడల్ ధర కూడా అప్
యాంటీ-గ్లేర్ ఫీచర్‌తో వచ్చే నానో టెక్స్చర్ డిస్‌ప్లే కలిగిన షావోమి ప్యాడ్ 8 (12GB + 256GB) వేరియంట్ ధరను కూడా కంపెనీ సవరించింది. దీని ధరను రూ.38,999 నుంచి రూ.40,999కి పెంచింది. ఈ ప్రత్యేకమైన నానో టెక్స్చర్ మోడల్‌ను షావోమి ఫోకస్ పెన్ ప్రో స్టైలస్‌తో కలిపి సొంతం చేసుకోవాలంటే కస్టమర్లు ఇప్పుడు రూ.45,999 ఖర్చు చేయాల్సి ఉంటుంది. గతంలో దీని కాంబో ధర రూ.43,999గా మాత్రమే ఉండేది.

Electric Taxi : ఓలా, ఉబర్‌లకు గట్టి పోటీ.. కేవలం విన్‌ఫాస్ట్ ఈవీ కార్లతోనే సరికొత్త క్యాబ్ సర్వీస్ ప్రారంభం

ధరల పెంపునకు అసలు కారణాలు
ఈ పెరిగిన సరికొత్త ధరలు ప్రస్తుతం షావోమి ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో లైవ్‌లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో టెక్నాలజీ విడిభాగాల ఖర్చులు విపరీతంగా పెరగడం, గ్లోబల్ లెవెల్‌లో ప్రాసెసర్ చిప్‌ల కొరత ఏర్పడటమే ఈ ధరల పెంపునకు ప్రధాన కారణాలుగా టెక్ నిపుణులు భావిస్తున్నారు. నిజానికి గత నెలలోనే వన్‌ప్లస్, పోకో, లావా వంటి కంపెనీలు కూడా భారత మార్కెట్లో తమ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ల ధరలను పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో షావోమి కూడా చేరింది.

షావోమి ప్యాడ్ 8 అదిరిపోయే ఫీచర్లు
ఫీచర్ల విషయానికి వస్తే.. షావోమి ప్యాడ్ 8 టాబ్లెట్ సరికొత్త షావోమి హైపర్‌ఓఎస్ 3 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇందులో 11.2 ఇంచుల 3.2K స్క్రీన్‌ను అందించారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. సాధారణ మోడల్స్ గ్లోసీ స్క్రీన్‌తో వస్తే, నానో టెక్స్చర్ వెర్షన్ మాత్రం కళ్లపై ఒత్తిడి పడకుండా ఉండేలా యాంటీ-రిఫ్లెక్టివ్ ఫీచర్‌తో వస్తుంది.

పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, లాంగ్ బ్యాటరీ
ఈ టాబ్లెట్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్, అడ్రినో 825 జీపీయూ గ్రాఫిక్స్ కార్డ్‌ను ఉపయోగించారు. ఇందులో గరిష్టంగా 12GB LPDDR5T ర్యామ్, 256GB UFS 4.1 స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. ఫోటోల కోసం వెనుక వైపు 13 మెగాపిక్సెల్ కెమెరా, సెల్ఫీల కోసం ముందు వైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అమర్చారు. ఆడియో పరంగా డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో వచ్చే క్వాడ్ (నాలుగు) స్పీకర్ల సెటప్ ఉంది. ఈ డివైజ్‌లో 9,200mAh భారీ బ్యాటరీ ఉంది, ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ప్యాడ్‌ను కీబోర్డ్, 16,000 కంటే ఎక్కువ ప్రెజర్ సెన్సిటివిటీ ఉన్న ఫోకస్ పెన్ ప్రో స్టైలస్‌తో కనెక్ట్ చేసుకుని ల్యాప్‌టాప్‌లా వాడుకోవచ్చు.

సంబంధిత వార్తలు

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »