మార్కెట్లో అన్ని కేటగిరీల వినియోగదారులను ఆకట్టుకునేలా అన్ని రకాల బెస్ట్ ఫీచర్లతో రూపుదిద్దుకున్న నథింగ్ ఫోన్ 3 ని ఒక పవర్‌ఫుల్ ఆల్ రౌండర్ ఫోన్‌గా పిలుస్తారు.
Nothing Phone 3
Amazon Prime Day Sale : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తనదైన స్టైలిష్ డిజైన్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్రాండ్ నథింగ్. ఈ కంపెనీ విడుదల చేసిన ప్రీమియం ఫ్లాగ్‌షిప్ మొబైల్ Nothing Phone 3 లాంచింగ్ సమయంలో చాలా ఖరీదైనదిగా ఉన్నప్పటికీ, ప్రస్తుత సేల్‌లో దీని ధర భారీగా పడిపోయింది. ప్రస్తుతం ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో నడుస్తున్న అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో ఈ ఫోన్‌పై కస్టమర్లకు ఊహించని రేంజ్‌లో డిస్కౌంట్ లభిస్తోంది. ఈ అద్భుతమైన ప్రైమ్ డే సేల్‌కు ఈరోజే ఆఖరి రోజు. దీనితో పాటు నథింగ్ ఫోన్ 3 ని ఏకంగా 38,000 రూపాయల భారీ తగ్గింపుతో కొనుగోలు చేసేందుకు కూడా ఇదే చివరి అవకాశం కావడంతో టెక్ ప్రియులు ఈ డీల్ వైపు మొగ్గు చూపుతున్నారు.
అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో ఊహించని ట్విస్ట్
మార్కెట్లో అన్ని కేటగిరీల వినియోగదారులను ఆకట్టుకునేలా అన్ని రకాల బెస్ట్ ఫీచర్లతో రూపుదిద్దుకున్న నథింగ్ ఫోన్ 3 ని ఒక పవర్‌ఫుల్ ఆల్ రౌండర్ ఫోన్‌గా పిలుస్తారు. ఒకవేళ మీరు రూ.40,000 బడ్జెట్ పరిధిలో ఒక ప్రీమియం, బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్ కోసం ఎదురుచూస్తుంటే, ఈ ఆఫర్ మీకు ఒక సువర్ణావకాశం అని చెప్పవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ మొదట రూ.79,999 భారీ ధరతో మార్కెట్లోకి లాంచ్ చేసింది. కానీ ప్రస్తుత అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో దీని బ్లాక్ కలర్ వేరియంట్‌ను ఏకంగా రూ.41,999లకే లిస్ట్ చేశారు. ఈ ఫోన్ లాంచైన తర్వాత ఈ స్థాయిలో ధర తగ్గడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
బ్యాంక్ కార్డు ఆఫర్లతో మరింత చౌకగా
ప్రస్తుతం సేల్‌లో ఉన్న రూ.41,999 ధర అనేది ఈ ఫోన్ బేస్ వేరియంట్ అయిన 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌కు వర్తిస్తుంది. ఒకవేళ కస్టమర్లు అమెజాన్ అందించే వివిధ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఆఫర్లను గనుక ఉపయోగిస్తే, ఈ డీల్ మరింత చౌకగా, అంటే రూ.40 వేల లోపు ధరకే లభించే అవకాశం ఉంది. దీనితో పాటు, ఈ బేస్ ధర కంటే మరో రూ.10,000 లు అదనంగా ఖర్చు చేస్తే, ఏకంగా 16GB ర్యామ్, 512GB భారీ స్టోరేజ్ ఉన్న టాప్ ఎండ్ వేరియంట్‌ను సొంతం చేసుకోవచ్చు. ఎక్కువ డేటా దాచుకోవాలనుకునే వారికి, లాంగ్ లైఫ్ పర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఇది ఒక అదిరిపోయే డీల్ అవుతుంది.
Vivo : వివో నుంచి ట్విన్ స్మార్ట్‌ఫోన్లు.. మార్కెట్లోకి ఒకేసారి Vivo G5i, Vivo G5z విడుదల
పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్
నథింగ్ ఫోన్ 3 స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే.. ఇందులో 1260x2800 పిక్సెల్స్ రిజల్యూషన్ సపోర్ట్ చేసే 6.67 ఇంచుల 1.5K AMOLED డిస్‌ప్లేను అందించారు. స్క్రీన్ రన్నింగ్ చాలా స్మూత్‌గా ఉండేందుకు 120Hz అడాప్టివ్ రీఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండేందుకు క్వాల్కమ్ కంపెనీకి చెందిన అత్యంత వేగవంతమైన స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. సాఫ్ట్‌వేర్ పరంగా ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత నథింగ్ ఓఎస్ 3.5 పై రన్ అవుతుంది. బ్యాటరీ విషయానికి వస్తే, ఇందులో 5,500mAh పవర్‌ఫుల్ బ్యాటరీతో పాటు 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను ఇచ్చారు.
కెమెరా విభాగంలో సరికొత్త సంచలనం
ఫోటోగ్రఫీని అమితంగా ఇష్టపడే వారి కోసం నథింగ్ ఈసారి కెమెరా విభాగంలో ఎలాంటి రాజీ పడలేదు. ఈ ఫోన్ వెనుక భాగంలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో జూమ్ కెమెరా మరియు 50 మెగాపిక్సెల్ ఆల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాల భారీ ట్రిపుల్ సెటప్‌ను అందించారు. అలాగే సెల్ఫీలు, క్లియర్ వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందు భాగంలో కూడా 50 మెగాపిక్సెల్ హై-రెజల్యూషన్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ కేవలం 8.99mm మందం, 218 గ్రాముల బరువుతో చేతిలో పట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఆఫర్ ఈ అర్ధరాత్రితో ముగిసిపోనుంది కాబట్టి ఆసక్తి గలవారు వెంటనే అమెజాన్ వెబ్‌సైట్‌ను విజిట్ చేయవచ్చు.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999