వివో కంపెనీ ఈ రెండు స్మార్ట్‌ఫోన్లను ప్రస్తుతం చైనా మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది.
Photo Credit: Vivo
Vivo
Vivo : ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో గ్లోబల్ మార్కెట్లో సరికొత్త వ్యూహంతో ముందుకొచ్చింది. ఒకే రకమైన హార్డ్‌వేర్, ఒకే విధమైన డిజైన్‌తో కూడిన రెండు వేర్వేరు స్మార్ట్‌ఫోన్లను కంపెనీ ఒకేసారి మార్కెట్లోకి విడుదల చేసింది. అవే Vivo G5i, Vivo G5z. ఈ రెండు మొబైల్స్ చూడటానికి పూర్తిగా ఒకేలా ఉండటమే కాకుండా, వీటిలో అందించిన ఫీచర్లు కూడా అక్షరాలా ఒక్కటే కావడం విశేషం. ఈ రెండు ఫోన్ల మధ్య ఉన్న ఏకైక తేడా కేవలం వాటి బ్రాండింగ్ మాత్రమేనని కంపెనీ స్పష్టం చేసింది. సరికొత్త లుక్, అదిరిపోయే పవర్ బ్యాకప్‌తో ఈ జంట ఫోన్లను వివో కస్టమర్ల ముందుకు తెచ్చింది.
వివో G5i, వివో G5z ధరలు ఎలా ఉన్నాయంటే?
వివో కంపెనీ ఈ రెండు స్మార్ట్‌ఫోన్లను ప్రస్తుతం చైనా మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా ఇవి రెండు వేరియంట్లలో లభిస్తున్నాయి. ఇందులో 6 GB ర్యామ్, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న బేస్ వేరియంట్ ధరను CNY 2,199గా నిర్ణయించారు. అంటే మన భారతీయ కరెన్సీలో దీని విలువ సుమారు రూ.30,900 వరకు ఉంటుంది. అలాగే 8 GB ర్యామ్, 256 GB స్టోరేజ్ కలిగిన టాప్ ఎండ్ వేరియంట్ ధర CNY 2,899 గా ఉంది. దీని భారతీయ ధర సుమారు రూ. 40,700 గా ఉండనుంది. ఈ రెండు ఫోన్లను ఎంతో క్లాసీగా కనిపించే అబ్సిడియన్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం చైనాలోని వివో అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా వీటి విక్రయాలు జరుగుతున్నాయి.
స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 పవర్‌ఫుల్ ప్రాసెసర్
ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల స్పెసిఫికేషన్లను గమనిస్తే.. ఇవి 1,570 x 720 పిక్సెల్స్ రెజల్యూషన్ కలిగిన 6.75 ఇంచుల ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. స్క్రీన్ రన్నింగ్ ఎంతో స్మూత్‌గా, వేగంగా ఉండేందుకు ఇందులో 120 Hz రీఫ్రెష్ రేట్, 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఫీచర్లు ఇచ్చారు. దీనితో పాటు ఈ స్క్రీన్ 256 ppi పిక్సెల్ డెన్సిటీని, 83 శాతం కలర్ గ్యాముట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఫోన్ స్పీడ్, పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉండేలా క్వాల్కమ్ కంపెనీకి చెందిన పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌ను అమర్చారు. దీనికి అదనంగా గ్రాఫిక్స్ కోసం అడ్రినో 613 జీపీయూ సపోర్ట్ కూడా ఉంది. ఈ మొబైల్స్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 సాఫ్ట్‌వేర్‌పై రన్ అవుతాయి.
10x డిజిటల్ జూమ్‌తో 50MP సింగిల్ రేర్ కెమెరా
సాధారణంగా ఈ బడ్జెట్ ఫోన్లలో డ్యూయల్ లేదా ట్రిపుల్ కెమెరాలను చూస్తుంటాం, కానీ వివో ఈ ఫోన్లలో వెనుక వైపు కేవలం ఒకే ఒక్క కెమెరాను అందించింది. ఈ ఫోన్ల వెనుక భాగంలో ఆటోఫోకస్, ఏకంగా 10x డిజిటల్ జూమ్ సపోర్ట్ కలిగిన 50 మెగాపిక్సెల్ సింగిల్ ప్రైమరీ కెమెరాను ఇచ్చారు. అలాగే సెల్ఫీలు, క్లియర్ వీడియో కాల్స్ మాట్లాడుకోవడానికి ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ల ఫ్రంట్, బ్యాక్ కెమెరాల ద్వారా వినియోగదారులు 1,080p క్వాలిటీతో హై-రెజల్యూషన్ వీడియోలను చాలా సులభంగా రికార్డ్ చేసుకోవచ్చు.
Vivo X300e : స్మార్ట్‌ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. త్వరలోనే మార్కెట్లోకి సరికొత్త Vivo X300e
స్మార్ట్‌ఫోన్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ పవర్ బ్యాకప్
ఈ వివో G5i, G5z స్మార్ట్‌ఫోన్లలో ఉన్న అన్నిటికంటే పెద్ద హైలైట్ ఫీచర్ ఏంటంటే.. ఇందులో ఇచ్చిన భారీ బ్యాటరీ కెపాసిటీ. మొబైల్‌ను విపరీతంగా వాడే గేమర్స్ మరియు ఇతర యూజర్ల కోసం ఇందులో ఏకంగా 7,200 mAh సామర్థ్యం గల అతిపెద్ద బ్యాటరీని అమర్చారు. దీనికి తోడు ఫోన్ చాలా వేగంగా ఛార్జ్ అవ్వడానికి 44W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా వివో అందించింది. అంతేకాదు, అత్యవసర సమయాల్లో ఈ ఫోన్ నుంచి వేరే ఫోన్లను ఛార్జ్ చేసుకునేలా ఇందులో OTG రివర్స్ ఛార్జింగ్ సదుపాయాన్ని కూడా కల్పించడం విశేషం.
కనెక్టివిటీ విషయానికి వస్తే, ఈ ఫోన్లు సూపర్ ఫాస్ట్ 5G నెట్‌వర్క్‌తో పాటు వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ వంటి అన్ని రకాల లేటెస్ట్ ఆప్షన్లను సపోర్ట్ చేస్తాయి. మంచి సౌండ్ ఎఫెక్ట్స్ కోసం ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్లను అందించారు. ఫోన్ సెక్యూరిటీ కోసం పక్కభాగంలో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. ఈ స్మార్ట్‌ఫోన్లు 166.64 x 78.43 x 8.39 mm సైజుతో, దాదాపు 219 గ్రాముల బరువుతో చేతిలో పట్టుకోవడానికి చాలా స్టైలిష్‌గా ఉంటాయి.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999