నార్జో 80, నార్జో 90, లేటెస్ట్ నార్జో 100 లైనప్‌లలోని బెస్ట్ హ్యాండ్‌సెట్లు ఈ సేల్‌లో అత్యంత తక్కువ ధరలకే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి.
Photo Credit: Amazon/ Realme
Realme Narzo 100 Lite 5G features a 6.8-inch display
Amazon Realme : కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వేదికగా సరికొత్త రియల్‌మి నార్జో డేస్ సేల్‌ను అధికారికంగా ప్రారంభించింది. ఈ పరిమిత కాలపు ప్రత్యేక సేల్‌లో భాగంగా రియల్‌మి తన పాపులర్ నార్జో సిరీస్ స్మార్ట్‌ఫోన్లపై నేరుగా భారీగా ధరలను తగ్గించింది. నార్జో 80, నార్జో 90, లేటెస్ట్ నార్జో 100 లైనప్‌లలోని బెస్ట్ హ్యాండ్‌సెట్లు ఈ సేల్‌లో అత్యంత తక్కువ ధరలకే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి.
జూన్ 16 తో ముగియనున్న ఆఫర్లు
ప్రస్తుతం అమెజాన్‌లో లైవ్‌లో ఉన్న ఈ రియల్‌మి నార్జో డేస్ సేల్ కేవలం జూన్ 16 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే కస్టమర్లకు నచ్చిన ఫోన్‌ను తక్కువ ధరకే సొంతం చేసుకోవడానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ సేల్‌లో ప్రధానంగా ఐదు మోడల్స్‌ను భారీ డిస్కౌంట్లతో లిస్ట్ చేశారు. దీనితో పాటు వినియోగదారులు బ్యాంక్ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్లు, ప్రత్యేక క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ఉపయోగించుకుని తమ సేవింగ్స్‌ను మరింత పెంచుకోవచ్చని కంపెనీ తెలిపింది.
నార్జో 100 లైట్ 5జీపై సగం ధరకే ఆఫర్
ఈ సేల్‌లో ఇటీవల మార్కెట్లోకి విడుదలైన సరికొత్త మోడల్ రియల్‌మి నార్జో 100 లైట్ 5జీ పై ఊహించని డీల్ లభిస్తోంది. మార్కెట్లో ఈ ఫోన్ అసలు ధర రూ.27,999 కాగా, ప్రస్తుతం అమెజాన్ సేల్‌లో దీనిని ఏకంగా రూ.15,249కే కొనుగోలు చేయవచ్చు. బేస్ వేరియంట్ అయిన 4GB రామ్ + 128GB స్టోరేజ్ కలిగిన ఈ మొబైల్‌లో 144Hz రీఫ్రెష్ రేట్ గల ఫ్లాట్ డిస్‌ప్లేతో పాటు ఏకంగా 7,000mAh భారీ బ్యాటరీని అందించడం ఈ ఫోన్ ప్రత్యేకత.
బిగ్గెస్ట్ బ్యాటరీ ఫోన్ నార్జో పవర్ 5జీ పై భారీ డిస్కౌంట్
నార్జో సిరీస్ చరిత్రలోనే అత్యంత భారీ బ్యాటరీ సామర్థ్యంతో వచ్చిన రియల్‌మి నార్జో పవర్ 5జీ పై కంపెనీ ఏకంగా రూ.8,000 ఫ్లాట్ డిస్కౌంట్‌ను ప్రకటింది. 10,001 mAh సామర్థ్యం గల కొండలాంటి బ్యాటరీతో రన్ అయ్యే ఈ ప్రీమియం బడ్జెట్ ఫోన్ సాధారణ ధర రూ.35,999 కాగా.. ఈ సేల్‌లో భాగంగా కస్టమర్లు దీనిని కేవలం రూ.27,999కే దక్కించుకోవచ్చు. ఒకసారి చార్జ్ చేస్తే రోజుల తరబడి బ్యాకప్ ఇచ్చే ఫోన్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
FIFA World Cup 2026 : భారత్‌లో ‘ఫిఫా వరల్డ్ కప్ 2026' హంగామా.. ఉచితంగా చూసే ఛాన్స్ ఎక్కడంటే?
నార్జో 90ఎక్స్ 5జీపై ఏకంగా రూ.16,000 తగ్గింపు
ఈ సేల్‌లోనే అత్యంత భారీ ప్రైస్ కట్ చూసిన మొబైల్‌గా రియల్‌మి నార్జో 90ఎక్స్ 5జీ నిలిచింది. ఈ ఫోన్‌పై ఏకంగా రూ.16,000 వరకు రేటు తగ్గింది. సాధారణ రోజుల్లో రూ. 33,999 పలుకుతున్న ఈ స్మార్ట్‌ఫోన్.. నార్జో డేస్ సేల్ పుణ్యమా అని కేవలం రూ.17,999కే వినియోగదారుల ముందుకు వచ్చింది. మిడ్-రేంజ్ బడ్జెట్‌లో 5జీ ఫీచర్లతో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చే ఫోన్ కోసం చూసేవారికి ఇదొక మైండ్ బ్లోయింగ్ డీల్ అని చెప్పాలి.
నార్జో 80 సిరీస్‌పైనా అదిరిపోయే డీల్స్
వీటితో పాటు బడ్జెట్ విభాగానికి చెందిన నార్జో 80 సిరీస్ ఫోన్లపై కూడా తాత్కాలిక ధరల తగ్గింపును ప్రకటించారు. మార్కెట్లో రూ.16,999 ధర ఉన్న రియల్‌మి Naro 80 లైట్ ఫోన్‌ను ఇప్పుడు కేవలం రూ.11,499కే సొంతం చేసుకోవచ్చు. అలాగే ప్రీమియం ఫీచర్లతో అలరించే రియల్‌మి నార్జో 80 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.25,999కి బదులుగా రూ.23,999కే అమెజాన్ సేల్‌లో విక్రయిస్తున్నారు. జూన్ 16 లోపు ఈ ఆఫర్లను ఉపయోగించుకుని నచ్చిన స్మార్ట్‌ఫోన్‌ను బడ్జెట్ ధరలోనే కొనుగోలు చేయాల్సిందిగా టెక్ నిపుణులు సూచిస్తున్నారు.
ప్రకటన
ప్రకటన