FIFA World Cup 2026 : భారత్‌లో ‘ఫిఫా వరల్డ్ కప్ 2026’ హంగామా.. ఉచితంగా చూసే ఛాన్స్ ఎక్కడంటే?

చరిత్రలో మొదటిసారిగా ఏకంగా 48 దేశాలు ఈ ప్రతిష్టాత్మక కప్‌ కోసం పోటీ పడుతున్నాయి. మూడు దేశాలలోని 15 అధునాతన స్టేడియంలలో మొత్తం 104 హై-వోల్టేజ్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

FIFA World Cup 2026 : భారత్‌లో ‘ఫిఫా వరల్డ్ కప్ 2026’ హంగామా.. ఉచితంగా చూసే ఛాన్స్ ఎక్కడంటే?

FIFA World Cup 2026

ముఖ్యాంశాలు
  • అమెరికా, కెనడా, మెక్సికో వేదికలుగా సాకర్ సమరం
  • భారత్‌లో ఫిఫా లైవ్ టెలికాస్ట్ హక్కులు సొంతం చేసుకున్న జీ
  • డీడీ స్పోర్ట్స్‌లోనూ ఫిఫా మ్యాచ్‌లు
ప్రకటన

FIFA World Cup 2026 : ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ ఆటపై ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులందరి కళ్లు ఫిఫా వరల్డ్ కప్ 2026 పైనే ఉన్నాయి. జూన్ 12 నుంచి ప్రారంభమైన ఈ మెగా టోర్నమెంట్‌ను మూడు పెద్ద దేశాలైన అమెరికా, కెనడా , మెక్సికోలు ఉమ్మడిగా నిర్వహిస్తున్నాయి. ఈసారి టోర్నమెంట్ పరిధిని భారీగా పెంచారు. చరిత్రలో మొదటిసారిగా ఏకంగా 48 దేశాలు ఈ ప్రతిష్టాత్మక కప్‌ కోసం పోటీ పడుతున్నాయి. మూడు దేశాలలోని 15 అధునాతన స్టేడియంలలో మొత్తం 104 హై-వోల్టేజ్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

భారత్‌లోనూ సాకర్ క్రేజ్.. కానీ టీమిండియా ఎక్కడ?
మధ్య ప్రాచ్యంలో నడుస్తున్న రాజకీయ సంక్షోభాల నీడ ఈ మెగా టోర్నీపై కొంతవరకు పడినప్పటికీ, క్రీడాభిమానుల ఉత్సాహం మాత్రం అణుమాత్రం కూడా తగ్గలేదు. మన భారతదేశంలో కూడా ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌కు విపరీతమైన ఆదరణ ఉంది. అయితే, జనాభా పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద శక్తులలో ఒకటిగా ఉన్న మన భారతదేశ ఫుట్‌బాల్ జట్టుకు.. ఈ మెగా టోర్నమెంట్‌లో ఎంట్రీ దక్కడం అనేది ప్రస్తుతానికి చాలా దూరపు ముచ్చటగానే మిగిలిపోయింది. అయినప్పటికీ మెస్సి, రొనాల్డో, నెయ్మార్ వంటి అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్ల ఆటను చూడటానికి భారతీయ ఫ్యాన్స్ సిద్ధమయ్యారు.

భారత్‌లో టీవీ లైవ్ టెలికాస్ట్ వివరాలు
భారతదేశంలో ఉన్న ఫుట్‌బాల్ అభిమానుల కోసం ప్రముఖ టెలివిజన్ నెట్‌వర్క్ జీ ఒక సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది ఫిఫా వరల్డ్ కప్ అధికారిక బ్రాడ్‌కాస్టింగ్ హక్కులను జీ గ్రూప్ సొంతం చేసుకుంది. కేవలం వరల్డ్ కప్ మాత్రమే కాకుండా, రాబోయే రోజుల్లో జరిగే మరో 39 అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఈవెంట్ల ప్రత్యక్ష ప్రసారం కోసం జీ సంస్థ ఫిఫాతో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లోని బుల్లితెర వీక్షకులు ఈ మ్యాచ్‌లను యునైట్8 స్పోర్ట్స్ టెలివిజన్ ఛానళ్లలో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

ఉచితంగా చూసే సువర్ణావకాశం
ప్రభుత్వ అధికారిక ఛానల్ అయిన డీడీ స్పోర్ట్స్ లో కూడా సాధారణ కస్టమర్ల కోసం ఉచిత ప్రసారాలను అందుబాటులోకి తెచ్చారు. జూన్ 12న మెక్సికో, సౌతాఫ్రికా దేశాల మధ్య జరిగిన ఈ టోర్నమెంట్ మొదటి మ్యాచ్‌తో పాటు.. టోర్నీలో అత్యంత కీలకమైన క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్,  జూలై 20న జరిగే గ్రాండ్ ఫైనల్ మ్యాచ్‌లను డీడీ స్పోర్ట్స్ ఛానల్ ద్వారా ఉచితంగా వీక్షించే సదుపాయాన్ని కల్పించారు. దీనివల్ల ఎలాంటి కేబుల్ కనెక్షన్ లేని వారు కూడా ఉచితంగా సాకర్ పండగను ఆస్వాదించవచ్చు.

OnePlus N6 : భారత్‌లోకి వన్‌ప్లస్ సరికొత్త బడ్జెట్ ఫోన్.. వన్‌ప్లస్ N6 లాంచ్ అప్‌డేట్

మొబైల్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఎలా చూడాలి?
మీరు ఒకవేళ ప్రయాణంలో ఉంటూ మొబైల్ లేదా లాప్‌టాప్‌లో మ్యాచ్‌లు చూడాలనుకుంటే..  జీ5 యాప్, వెబ్‌సైట్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్  చూడవచ్చు. ఫిఫా వరల్డ్ కప్ వీక్షకుల కోసం జీ5 సంస్థ ప్రత్యేకమైన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లను కొనుగోలు చేయడం ద్వారా కేవలం ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లు మాత్రమే కాకుండా.. భవిష్యత్తులో జీ5 లో ప్రసారమయ్యే అనేక ఇతర అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లను కూడా ఉచితంగా యాక్సెస్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు.

మ్యాచ్‌ల షెడ్యూల్, వేదికల వివరాలు
ఈ ఏడాది జరిగే మొత్తం 104 మ్యాచ్‌లలో సింహభాగం మ్యాచ్‌లు అమెరికాలోనే జరగనున్నాయి. అమెరికా గడ్డపై ఏకంగా 78 మ్యాచ్‌లు జరగనుండగా.. మిగిలిన మ్యాచ్‌లను కెనడా, మెక్సికో దేశాలలో నిర్వహిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం జూన్ 11 అర్ధరాత్రి దాటిన తర్వాత (జూన్ 12 తెల్లవారుజామున) 12:30 గంటలకు మెక్సికో, సౌతాఫ్రికాల మధ్య తొలి మ్యాచ్‌తో ఈ టోర్నీ గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఇక లీగ్ మ్యాచ్‌ల అనంతరం జూలై 15, 16 తేదీలలో సెమీఫైనల్ మ్యాచ్‌లు జరగనుండగా.. ప్రపంచ ఫుట్‌బాల్ విజేత ఎవరో తేల్చే మోస్ట్ అవైటెడ్ ఫైనల్ మ్యాచ్ జూలై 20న అత్యంత వైభవంగా జరగనుంది.

సంబంధిత వార్తలు

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »