Google : ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ బంపర్ గిఫ్ట్.. ఇకపై ఫేక్ కాల్స్ వస్తే ముందే అలర్ట్

స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను ఎంతగానో వేధిస్తున్న ఫేక్ కాల్స్, సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు టెక్ దిగ్గజం గూగుల్ ఒక అద్భుతమైన ఫీచర్‌ను తీసుకొచ్చింది.

Google : ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ బంపర్ గిఫ్ట్.. ఇకపై ఫేక్ కాల్స్ వస్తే ముందే అలర్ట్

Photo Credit: Pexels

Android's fake call detection uses confirmation signals

ముఖ్యాంశాలు
  • సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు టెక్ దిగ్గజం గూగుల్ ఒక అద్భుతమైన ఫీచర్‌
  • ఆండ్రాయిడ్ 12, ఆపై వెర్షన్లలో పనిచేసే అన్ని ఫోన్లలో రోల్ అవుట్
  • కస్టమర్ల ప్రైవసీకి ఎలాంటి భంగం కలగదు.
ప్రకటన

Google : స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను ఎంతగానో వేధిస్తున్న ఫేక్ కాల్స్, సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు టెక్ దిగ్గజం గూగుల్ ఒక అద్భుతమైన ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో వాయిస్ క్లోనింగ్ చేసి బంధువుల్లా నటించడం, బ్యాంక్ అధికారులమని చెప్పి అకౌంట్లు ఖాళీ చేయడం వంటి స్కామ్‌లను అడ్డుకోవడానికి ఫేక్ కాల్ డిటెక్షన్ అనే సెక్యూరిటీ ఫీచర్‌ను గూగుల్ అధికారికంగా అందుబాటులోకి తెచ్చింది. ఈ సరికొత్త ఫీచర్ ఆండ్రాయిడ్ 12, ఆపై వెర్షన్లలో పనిచేసే అన్ని ఫోన్లలో గ్లోబల్ వ్యాప్తంగా రోల్ అవుట్ అవుతోంది.

డిజిటల్ హ్యాండ్‌షేక్ టెక్నాలజీతో పనిచేసే విధానం
ఈ కొత్త సెక్యూరిటీ ఫీచర్ గూగుల్ అఫీషియల్ ఫోన్ బై గూగుల్ యాప్‌లో డిఫాల్ట్‌గా ఎనేబుల్ అయి ఉంటుంది. ఇది కాల్స్ నిజాయితీని పరీక్షించడానికి ఒక సరికొత్త విధానాన్ని ఉపయోగిస్తుంది. మనకు ఏదైనా ఫోన్ కాల్ వచ్చినప్పుడు, అవతలి వ్యక్తి ఫోన్ నుంచి మన ఫోన్‌కు ఒక కన్ఫర్మేషన్ సిగ్నల్ అందుతుంది. ఇది రెండు ఫోన్ల మధ్య ఒక  డిజిటల్ హ్యాండ్‌షేక్ లాగా పనిచేస్తుంది. దీని కోసం రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల కాల్స్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడి ఉంటాయి. అంటే కస్టమర్ల ప్రైవసీకి ఎలాంటి భంగం కలగదు.

తక్షణమే హెచ్చరించే స్మార్ట్ సిస్టమ్
ఒకవేళ మీ ఆండ్రాయిడ్ ఫోన్ ఏదైనా కాల్‌ను ఫేక్ కాల్ లేదా అనుమానాస్పద కాల్‌గా గుర్తిస్తే.. సిస్టమ్ వెంటనే అవతలి ఫోన్‌ను వెరిఫికేషన్ కోసం పింగ్ చేస్తుంది. ఒకవేళ అవతలి వైపు ఉన్న ఒరిజినల్ యూజర్ “నేను ఇప్పుడు ఎలాంటి కాల్ చేయడం లేదు” అని నిర్ధారిస్తే.. వెంటనే గూగుల్ యాప్ మన మొబైల్ స్క్రీన్‌పై ఒక బలమైన హెచ్చరికను చూపిస్తుంది. అంతేకాదు “వెంటనే ఈ ఫోన్ కాల్ కట్ చేయండి” అని మనల్ని అలర్ట్ చేస్తుంది. దీనివల్ల యూజర్లు ఎలాంటి స్పూఫింగ్ లేదా ఫేక్ కాల్ మోసాల బారిన పడకుండా సురక్షితంగా తప్పించుకోవచ్చు. ఒకవేళ ఈ ఫీచర్ వద్దనుకుంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి సులభంగా డిసేబుల్ కూడా చేసుకోవచ్చు.
 

google android fake call detection inline Android Fake Call Detection

Instagram : ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా హెచ్చరిక.. మీ అకౌంట్ హ్యాక్ అయిందో లేదో ఇలా చెక్ చేసుకోండి


ప్రపంచవ్యాప్తంగా లక్షల కోట్ల నష్టం
ఇటీవలే ఇంటర్‌పోల్ విడుదల చేసిన గ్లోబల్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ త్రెట్ అసెస్‌మెంట్ రిపోర్టును గూగుల్ ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఈ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఇంపర్సనేషన్ (వేరొకరిలా నటించి మోసం చేయడం) ఫ్రాడ్స్ కారణంగా ఏకంగా 400 బిలియన్ డాలర్ల (సుమారు రూ.38,28,300 కోట్లు) ఆర్థిక నష్టం వాటిల్లింది. అమెరికాకు చెందిన ఎఫ్‌టీసీకి నమోదవుతున్న ఫిర్యాదుల్లో కూడా ఇలాంటి నకిలీ కాల్స్ మోసాలే ఎక్కువగా ఉన్నాయని గూగుల్ తెలిపింది. ఈ నేపథ్యంలో గూగుల్ తెచ్చిన ఈ కొత్త అప్‌డేట్ సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా సాధారణ ప్రజలకు ఒక పెద్ద రక్షణ కవచంలా మారనుంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »