తమ అకౌంట్లు హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లినట్లు గుర్తించిన వినియోగదారులను కంపెనీ అప్రమత్తం చేస్తోంది.
Photo Credit: Pexels/ Solen Feyissa
Some users were reportedly locked out of their profiles during the attack
Instagram : ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వాడుతున్న ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పెద్ద భద్రతా లోపం బయటపడింది. ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున ఇన్‌స్టా అకౌంట్లు హ్యాకింగ్‌కు గురికావడంతో మూల సంస్థ అయిన మెటా రంగంలోకి దిగింది. తమ అకౌంట్లు హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లినట్లు గుర్తించిన వినియోగదారులను కంపెనీ అప్రమత్తం చేస్తోంది. విచిత్రం ఏమిటంటే, ఈ హ్యాకింగ్ అంతా మెటా సంస్థ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మెటా ఏఐ చాట్‌బాట్ వల్లే జరగడం ఇప్పుడు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ అకౌంట్ టేకోవర్ దాడుల వెనుక ఉన్న అసలు కథ ఏమిటంటే.. మెటా సంస్థకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ సిస్టమ్‌లోని ఒక లూప్‌హోల్‌ను హ్యాకర్లు కనిపెట్టారు. సాధారణంగా అకౌంట్ రికవరీ లేదా సపోర్ట్ కోసం వాడే ఈ చాట్‌బాట్‌తో హ్యాకర్లు చాలా సింపుల్‌గా చాట్ చేసి మోసగించారు. తాము టార్గెట్ చేసిన ఇన్‌స్టా అకౌంట్ తమదేనని, దానికి వేరే ఈమెయిల్ ఐడీని లింక్ చేయాలని ఆ ఏఐ చాట్‌బాట్‌ను కోరారు. ఆ ఏఐ సిస్టమ్ ఎలాంటి పక్కా వెరిఫికేషన్ లేకుండానే, హ్యాకర్లు ఇచ్చిన ఈమెయిల్ ఐడీలను ఆయా అకౌంట్లకు లింక్ చేసేసింది. దీనిని ఉపయోగించుకుని హ్యాకర్లు పాస్‌వర్డ్‌లను రీసెట్ చేసి, ఒరిజినల్ యూజర్లను అకౌంట్ల నుంచి పూర్తిగా లాకౌట్ చేసేశారు.
ఈ హ్యాకింగ్ క్యాంపెయిన్‌లో హ్యాకర్లు ముఖ్యంగా డిమాండ్ ఉన్న చిన్న యూజర్‌నేమ్స్ గల అకౌంట్లను, అలాగే మంచి పాపులారిటీ ఉన్న పలువురు హై-ప్రొఫైల్ సెలబ్రిటీల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను టార్గెట్ చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. అకౌంట్ యాక్సెస్ కోల్పోయిన చాలా మంది యూజర్లు తమ ప్రొఫైల్స్ పూర్తిగా హ్యాకర్ల నియంత్రణలోకి వెళ్లిపోయాయని సోషల్ మీడియా వేదికగా వాపోయారు.
Lava Bold N2 5G : భారత మార్కెట్లోకి లావా కొత్త సంచలనం.. జూన్ 9న అమెజాన్‌లో సేల్ షురూ
ఈ భద్రతా లోపంపై మెటా అధికారిక ప్రతినిధి ఆండీ స్టోన్ స్పందిస్తూ.. ఏఐ చాట్‌బాట్‌లోని సదరు లోపాన్ని ఇప్పటికే పూర్తిగా సరిచేశామని ప్రకటించారు. అయితే, కంపెనీ ఈ ఫిక్స్‌ను అనౌన్స్ చేసిన తర్వాత కూడా మరికొంత మంది యూజర్ల అకౌంట్లు హ్యాక్ అయినట్లు రిపోర్టులు రావడం టెక్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఆ తర్వాత ఆండీ స్టోన్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ, హ్యాకింగ్ బారిన పడే అవకాశం ఉన్న అకౌంట్లను తాము సురక్షితం చేస్తున్నామని, అందువల్ల కొంతమంది యూజర్లకు లాగిన్ అయ్యేటప్పుడు పాస్‌వర్డ్ రీసెట్ నోటిఫికేషన్లు లేదా సెక్యూరిటీ ప్రశ్నలు ఎదురవుతాయని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఎఫెక్ట్ అయిన అకౌంట్లను రక్షించే పనిలో పడ్డ ఇన్‌స్టాగ్రామ్.. బాధితులకు అధికారికంగా సెక్యూరిటీ వార్నింగ్ ఈమెయిళ్లను పంపుతోంది. మీ ఖాతాలో అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తించామని, మీ అకౌంట్ హ్యాక్ అయి ఉండవచ్చని ఆ మెయిల్‌లో పేర్కొంటోంది. భద్రతా కారణాల దృష్ట్యా అకౌంట్‌ను లాక్ చేశామని, వెంటనే లింక్ క్లిక్ చేసి కొత్త పాస్‌వర్డ్ సెట్ చేసుకోవాలని వినియోగదారులకు సూచిస్తోంది. అయితే ఈ ప్రమాదంలో అసలు ఎంతమంది యూజర్ల అకౌంట్లు హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లాయనే ఖచ్చితమైన సంఖ్యను మాత్రం మెటా ఇప్పటివరకు వెల్లడించలేదు.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,909
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Vivo X Fold 6 Global Launch Nears as European Listing Reveals Price and Specifications