భారతీయ ఫిన్‌టెక్ స్టార్టప్ క్రెడ్ ఫౌండర్ కునాల్ షా వాట్సాప్ కొత్త గ్లోబల్ సీఈఓగా నియమితులయ్యారు. విల్ క్యాత్‌కార్ట్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.
Photo Credit: WhatsApp CEO
WhatsApp CEO
WhatsApp : ప్రపంచ టెక్ విఫణిలో భారతీయ మేధావుల హవా రోజురోజుకూ సరికొత్త శిఖరాలను తాకుతోంది. ఇప్పటికే సుందర్ పిచాయ్ (గూగుల్), సత్యా నాదెళ్ల (మైక్రోసాఫ్ట్) వంటి దిగ్గజాలు గ్లోబల్ కంపెనీలను నడిపిస్తుండగా.. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో ప్రముఖ భారతీయుడు చేరారు. ప్రముఖ దేశీయ ఫిన్‌టెక్ స్టార్టప్ కంపెనీ క్రెడ్ వ్యవస్థాపకుడు కునాల్ షా ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన వాట్సాప్‌కు కొత్త గ్లోబల్ సీఈఓగా ఎంపికయ్యారు. ఈ మేరకు మెటా మాతృసంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
పదవి నుంచి తప్పుకున్న విల్ క్యాత్‌కార్ట్
గత 7 సంవత్సరాలుగా వాట్సాప్ హెడ్‌గా, సీఈఓగా విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తించిన విల్ క్యాత్‌కార్ట్ ఈ పదవి నుంచి తప్పుకోబోతున్నట్లు ప్రకటించారు. ఆయన హయాంలోనే వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 కోట్ల (3 బిలియన్) వినియోగదారుల మైలురాయిని అందుకుంది. అయితే విల్ క్యాత్‌కార్ట్ మెటా లీడర్‌షిప్ టీమ్‌లోనే కొనసాగుతారని, ఆయన స్థానంలో కునాల్ షా వాట్సాప్ గ్లోబల్ హెడ్‌గా కొత్త బాధ్యతలను స్వీకరిస్తారని కంపెనీ స్పష్టం చేసింది.
మార్క్ జుకర్‌బర్గ్ ప్రశంసల జల్లు
ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు, మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్‌బర్గ్ ఈ నియామకంపై స్పందిస్తూ కునాల్ షాపై ప్రశంసల జల్లు కురిపించారు. కునాల్ షా భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, విజయవంతమైన టెక్నాలజీ కంపెనీలలో ఒకటైన క్రెడ్‌ను అద్భుతంగా నిర్మించారని కొనియాడారు. ఆయనకు ఉన్న గ్లోబల్ విజన్, వ్యాపార దార్శనికత ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్ యాప్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లడానికి ఎంతగానో ఉపయోగపడతాయని జుకర్‌బర్గ్ విశ్వాసం వ్యక్తం చేశారు. కునాల్‌తో కలిసి వాట్సాప్‌ను బిలియన్ల కొద్దీ ప్రజలకు, లక్షలాది వ్యాపారాలకు మరింత మెరుగ్గా మార్చడానికి తాను ఎంతో ఉత్సాహంగా ఉన్నానని చెప్పారు.
Dopamine Shopping: షాపింగ్ ఫ్రీ భయ్యా.. కానీ ఒక్క వస్తువు కూడా ఇంటికి రాదు.. సౌత్ కొరియాలో కొత్త ట్రెండ్
మెటా నుండి క్రెడ్‌లో భారీ పెట్టుబడులు
ఈ మెగా టెక్ డీల్‌లో భాగంగా కునాల్ షా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ లింక్డ్‌ఇన్ ద్వారా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వాట్సాప్ సీఈఓగా కొత్త బాధ్యతలు స్వీకరించినప్పటికీ, క్రెడ్ కంపెనీలో తాను వాటాదారుడిగా కొనసాగుతానని స్పష్టం చేశారు. అలాగే మెటా సంస్థ క్రెడ్ కంపెనీలో ఏకంగా 900 మిలియన్ డాలర్ల (సుమారు రూ.7,500 కోట్లు) భారీ పెట్టుబడి పెట్టినట్లు ఆయన వెల్లడించారు. ఈ పెట్టుబడి ద్వారా మెటా కంపెనీ క్రెడ్‌లో మైనారిటీ ఇన్వెస్టర్‌గా భాగస్వామ్యం పొందుతుందని, అయితే క్రెడ్ వినియోగదారుల డేటా యాక్సెస్ మెటాకు ఉండదని కస్టమర్ల ప్రైవసీపై స్పష్టతనిచ్చారు.
క్రెడ్‌కు కొత్త మేనేజ్‌మెంట్.. కునాల్ షా హర్షం
కునాల్ షా వాట్సాప్ వైపు వెళ్తుండటంతో క్రెడ్ సంస్థ తన తదుపరి దశ ప్రయాణానికి సిద్ధమైంది. కునాల్ షా తన క్రెడ్ సీఈఓ పదవి నుంచి తప్పుకుంటుండగా, ఆయన స్థానంలో మితేన్ సంపత్ తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా కునాల్ షా మాట్లాడుతుండూ.. "వాట్సాప్ నేడు గ్లోబల్ గా ఎంతో ఎత్తుకు ఎదిగింది. వాట్సాప్ ప్రయాణంలోని తదుపరి అద్భుతమైన ఘట్టం కోసం మార్క్ జుకర్‌బర్గ్, క్రిస్, మెటా లీడర్‌షిప్ టీమ్‌తో కలిసి పనిచేయడానికి నేను ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ప్రపంచం మొత్తం ఎంతో నమ్మే ఒక అద్భుతమైన ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించినందుకు, ఈ మార్పును సులభతరం చేసినందుకు విల్ క్యాత్‌కార్ట్‌కు ధన్యవాదాలు" అని పేర్కొన్నారు.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,909
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999