Boltt Evo 4G : ఐఫోన్ కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు బోల్ట్ ఫోన్ రెడీ.. ఫస్ట్ ఫోన్ లాంచ్ డేట్ ఫిక్స్

ఈ నూతన స్మార్ట్‌ఫోన్ క్లీన్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్‌తో రాబోతున్నట్లు ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్‌లో కంపెనీ పేర్కొంది.

Boltt Evo 4G  : ఐఫోన్ కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు బోల్ట్ ఫోన్ రెడీ..  ఫస్ట్ ఫోన్ లాంచ్ డేట్ ఫిక్స్

Photo Credit: Boltt

Boltt Evo 4G

ముఖ్యాంశాలు
  • స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ఫైర్-బోల్ట్ ధమాకా ఎంట్రీ
  • ఐఫోన్ కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు బోల్ట్ ఫోన్ రెడీ
  • రూ. 20 వేల లోపే ఫైర్-బోల్ట్ ఫస్ట్ స్మార్ట్‌ఫోన్
ప్రకటన

Boltt Evo 4G  : భారతీయ వేరబుల్స్, స్మార్ట్‌వాచ్‌ల మార్కెట్‌లో అగ్రగామిగా ఉన్న ఫైర్-బోల్ట్ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ల రంగంలోకి అడుగుపెట్టేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. కంపెనీ తన మొదటి స్మార్ట్‌ఫోన్‌ను బోల్ట్ బ్రాండ్ పేరుతో భారత మార్కెట్లో పరిచయం చేయనుంది. ఈ మేరకు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‎లో బోల్ట్ స్మార్ట్‌ఫోన్ కోసం ప్రత్యేక మైక్రోసైట్ కూడా లైవ్ అయింది. ఈ ఫోన్‌ను రాబోయే ఆగస్టు 25, 2026న అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు మైక్రోసైట్ ద్వారా స్పష్టమవుతోంది.

డిజైన్, ఫ్లిప్‌కార్ట్ టీజర్ వివరాలు 
ఈ నూతన స్మార్ట్‌ఫోన్ క్లీన్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్‌తో రాబోతున్నట్లు ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్‌లో కంపెనీ పేర్కొంది. ఇందులో ఎలాంటి అవాంఛిత బ్లోట్‌వేర్ ఉండబోదని స్పష్టమవుతోంది. ఫోన్ ఫ్రంట్ డిజైన్ పరంగా.. డిస్‌ప్లే పైభాగంలో సెల్ఫీ కెమెరా కోసం హోల్-పాంచ్ కటౌట్ ఉంది. స్క్రీన్ చుట్టూ సైడ్ బెజెల్స్ సన్నగా ఉన్నప్పటికీ, కింది భాగం కాస్త మందంగా ఉంది. ఫోన్ కుడి వైపున పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ అమర్చబడి ఫ్లాట్-ఫ్రేమ్ డిజైన్‌ను కలిగి ఉంది.

EV Sales : ఈవీ మార్కెట్లో సరికొత్త రికార్డులు.. జులైలో ఏకంగా 81.6 శాతం పెరిగిన కార్ల విక్రయాలు

రూ. 20 వేల బడ్జెట్ విభాగంలో గట్టి పోటీ 
ఫైర్-బోల్ట్ సంస్థ తన స్మార్ట్‌ఫోన్ల లైన్‌అప్‌ను ఏస్, ఈవో సిరీస్‌లుగా తీసుకురానుంది. ఇందులో 4G తో పాటు 5G మోడళ్లు కూడా ఉంటాయి. అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయం ఏమిటంటే.. ఈ ఫోన్లన్నీ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్‌లో భాగంగా భారతదేశంలోనే తయారు చేయబడతాయి. మొదట్లో రూ. 20,000 కంటే తక్కువ ధర ఉండే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లపైనే ఫైర్-బోల్ట్ దృష్టి పెట్టనుంది. ఇదే గనుక జరిగితే ఈ సెగ్మెంట్‌లో ఇప్పటికే ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్న లావా, ఒప్పో, వివో, శామ్‌సంగ్, రియల్‌మీ వంటి దిగ్గజ బ్రాండ్లకు ఫైర్-బోల్ట్ నుంచి తీవ్ర పోటీ ఎదురుకానుంది.

గీక్‌బెంచ్ లీక్స్.. లీకైన ప్రాసెసర్, ఫీచర్లు 
లాంచ్‌కు ముందే ప్రముఖ బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫామ్ గీక్‌బెంచ్‎లో బోల్ట్ బ్రాండ్ ఫస్ట్ ఫోన్ Boltt Evo 4G పేరుతో లిస్ట్ అయింది.
ప్రాసెసర్, ఓఎస్: గీక్‌బెంచ్ వివరాల ప్రకారం ఈ ఫోన్‌లో యూనిసాక్ T7250 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్ ఉండే అవకాశాలు ఉన్నాయి.
బెంచ్‌మార్క్ స్కోర్లు: గీక్‌బెంచ్ సింగిల్-కోర్ టెస్ట్‌లో 440 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్‌లో 1,470 పాయింట్ల స్కోర్‌ను ఈ ఫోన్ సాధించింది.
చిప్‌సెట్ వివరాలు: ఈ యూనిసాక్ ఎంట్రీ లెవల్ చిప్‌సెట్‌లో 1.82 GHz క్లాక్ స్పీడ్‌తో నడిచే 2 ప్రైమరీ కోర్లు, 1.61 GHzతో నడిచే 6 ఎఫిషియెన్సీ కోర్లు ఉన్నాయి. ఇదే తరహా ప్రాసెసర్‌ను రియల్‌మీ P4x, ఒప్పో A6c, పోకో C81 ప్రో,  ఐటెల్ జెనో 200 మోడళ్లలోనూ ఉపయోగించారు.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Oppo F35 Series : పండుగ సేల్స్ ముందే ఒప్పో బిగ్ ప్లాన్..  వచ్చే నెలలోనే మార్కెట్లోకి  రెండు పవర్ ఫుల్ ఫోన్లు
  2. Boltt Evo 4G : ఐఫోన్ కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు బోల్ట్ ఫోన్ రెడీ.. ఫస్ట్ ఫోన్ లాంచ్ డేట్ ఫిక్స్
  3. EV Sales : ఈవీ మార్కెట్లో సరికొత్త రికార్డులు.. జులైలో ఏకంగా 81.6 శాతం పెరిగిన కార్ల విక్రయాలు
  4. Telegram : ఐఫోన్ యూజర్లకు మైండ్ బ్లాంకింగ్ షాక్.. యాప్ స్టోర్ నుంచి టెలిగ్రామ్ అవుట్
  5. Elon Musk : నెల రోజుల్లోనే ఎలాన్ మస్క్ ఆస్తి మటాష్.. ఏకంగా 600 బిలియన్ డాలర్ల సంపద ఆవిరి
  6. iQOO Z11  : చైనాలో ఒకలా, ఇండియాలో ఇంకోలా.. ఐకూ Z11 కొత్త లుక్ అదిరింది భయ్యా
  7. WhatsApp Tricks : ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోతుందా ?.. ఈ చిన్న వాట్సాప్ సెట్టింగ్ మారితే మీ ప్రాబ్లమ్ సాల్వ్
  8. Flipkart Freedom Sale : ఆగస్ట్ 15కు బంపర్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో 65 ఇంచుల 4K స్మార్ట్ టీవీలపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు
  9. OnePlus N6x vs Vivo T5 Lite 5G vs Tecno Spark 50 5G : రూ. 20 వేల బడ్జెట్‌లో ఏది బెస్ట్?
  10. Redmi K100 Pro Series  : ఏకంగా 9000 mAh బ్యాటరీ, 200MP కెమెరా.. షావోమి నుంచి నెక్స్ట్ లెవెల్ స్మార్ట్‌ఫోన్లు
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »