ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో భారతీయ స్వదేశీ దిగ్గజం టాటా మోటార్స్ తన నంబర్ వన్ స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
Mahindra & Mahindra
EV Sales : భారతదేశంలో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల విక్రయాలు జులై నెలలో ఊహించని స్థాయిలో పుంజుకున్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతుండటంతో వినియోగదారులు ఇంధన ఆధారిత వాహనాల కంటే ఎలక్ట్రిక్ కార్ల వైపే మొగ్గు చూపుతున్నారు. వాహన్ పోర్టల్ డేటా ప్రకారం... గత నెలలో ఏకంగా 31,788 యూనిట్ల ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది ఏకంగా 81.6 శాతం భారీ ఎదుగుదల కావడం విశేషం.
43 శాతంతో నంబర్ 1 స్థానంలో టాటా మోటార్స్
ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో భారతీయ స్వదేశీ దిగ్గజం టాటా మోటార్స్ తన నంబర్ వన్ స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. జులై నెలలో కంపెనీ ఏకంగా 13,579 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. గత ఏడాదితో పోలిస్తే టాటా ఈవీల విక్రయాల్లో 101.8 శాతం వృద్ధి నమోదైంది. దేశంలో అమ్ముడైన మొత్తం ఎలక్ట్రిక్ కార్లలో ఒక్క టాటా మోటార్స్ వాటానే దాదాపు 43 శాతంగా ఉండటం విశేషం. టాటా పోర్ట్‌ఫోలియోలో కర్వ్ ఈవీ, సియెర్రా ఈవీ, హారియర్ ఈవీ, టియాగో ఈవీ, టిగోర్ ఈవీ, పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ మోడళ్లు ఉన్నాయి. ఇటీవలే లాంచ్ అయిన సియెర్రా ఈవీ ధర రూ. 18.79 లక్షల నుంచి రూ. 24.79 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.
Telegram : ఐఫోన్ యూజర్లకు మైండ్ బ్లాంకింగ్ షాక్.. యాప్ స్టోర్ నుంచి టెలిగ్రామ్ అవుట్
124 శాతం దాటిన మహీంద్రా జోరు
స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్ విక్రయాల్లో టాప్‌లో ఉండే మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఈవీ విభాగంలో రికార్డులు క్రియేట్ చేసింది. కంపెనీ ఈవీ సేల్స్ ఏకంగా 124 శాతానికి పైగా పెరిగి 7,677 యూనిట్లకు చేరుకున్నాయి. మహీంద్రా పోర్ట్‌ఫోలియోలో బీఈ 6, ఎక్స్‌ఈవీ 9ఈ, ఎక్స్‌ఈవీ 9ఎస్ వంటి పవర్‌ఫుల్ ఈవీలు ఉన్నాయి. మరోవైపు మూడో స్థానంలో ఉన్న ఎమ్‌జీ మోటార్ విక్రయాలు స్వల్పంగా తగ్గాయి. గత ఏడాది జులైలో 5,900 యూనిట్లు విక్రయించిన ఎంజీ, ఈ ఏడాది 5,642 యూనిట్లకే పరిమితమైంది. కంపెనీ అమ్మకాల్లో విండ్సర్ ఈవీ ప్రధాన పాత్ర పోషిస్తోంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో పెరగనున్న ఈవీ మార్కెట్ వాటా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో ఎలక్ట్రిక్ కార్ల వాటా 6 నుంచి 8 శాతానికి పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ వాటా కేవలం 4.37 శాతంగా మాత్రమే ఉండేది. విన్‌ఫాస్ట్ వంటి విదేశీ ఈవీ కంపెనీలు కూడా భారత మార్కెట్లోకి అడుగుపెడుతుండటంతో రాబోయే రోజుల్లో పోటీ మరింత తీవ్రతరం కానుంది.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,652
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
iPhone 18 Pro Series’ A20 Pro Chipset Appears on Multiple Benchmarking Platforms Showing Performance Gains