Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ షురూ.. రూ. 30 వేల బడ్జెట్‌లో టాప్ 5జీ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

పోకో, రియల్‌మీ, రెడ్‌మీ, శామ్‌సంగ్, వివో వంటి ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై ప్రత్యేక బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ తగ్గింపులను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది.

Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ షురూ.. రూ. 30 వేల బడ్జెట్‌లో టాప్ 5జీ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

Photo Credit: Samsung

Samsung Galaxy A36 5G

ముఖ్యాంశాలు
  • ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం
  • రూ. 30 వేల బడ్జెట్‌లో టాప్ 5జీ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు
  • పోకో, రియల్‌మీ, శామ్‌సంగ్ 5జీ ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు
ప్రకటన

Flipkart Freedom Sale: భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‎ను ప్రారంభించింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఇయర్‌బడ్స్, ట్యాబ్లెట్లు, స్మార్ట్‌వాచ్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ముఖ్యంగా రూ. 30,000 బడ్జెట్‌లో నూతన 5జీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. పోకో, రియల్‌మీ, రెడ్‌మీ, శామ్‌సంగ్, వివో వంటి ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై ప్రత్యేక బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ తగ్గింపులను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది.

Poco M8 Power 5G :
ఈ ఆఫర్లలో మొదటిది Poco M8 Power 5G స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ 6GB/128GB స్టోరేజ్ వేరియంట్ ప్రస్తుతం రూ. 24,999 కి లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్‌తో చెల్లిస్తే రూ. 1,250 ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభించి, దీని ఎఫెక్టివ్ ధర రూ. 23,749 కి తగ్గుతుంది. అంతేకాకుండా, పాత ఫోన్ కండిషన్‌పై ఆధారపడి ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా గరిష్టంగా రూ. 22,900 వరకు అదనపు తగ్గింపు పొందే అవకాశం ఉంది.

Realme P4 Pro 5G :
తదుపరి మోడల్ Realme P4 Pro 5G   8GB/128GB వేరియంట్ రూ. 28,999 కి అందుబాటులో ఉంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్‌పై రూ. 1,250 ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభించడంతో దీని ఎఫెక్టివ్ ధర రూ. 27,749 అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్, 7000mAh భారీ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మరియు 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి శక్తివంతమైన ఫీచర్లతో వస్తుంది.

Redmi Note 15 SE 5G :
మరో ఆకర్షణీయమైన మోడల్ Redmi Note 15 SE 5G  6GB/128GB వేరియంట్ రూ. 23,999 కి లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌పై రూ. 1,575 ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభించడంతో దీని ఎఫెక్టివ్ ధర రూ. 22,424 కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మరియు 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సదుపాయాలు ఉన్నాయి.

Samsung Galaxy A36 5G:
అలాగే Samsung Galaxy A36 5G స్మార్ట్‌ఫోన్ 8GB/128GB వేరియంట్ రూ. 26,999 కి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. దీనిపై ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి రూ. 1,825 ఇన్ స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు, దాంతో దీని ఎఫెక్టివ్ ధర రూ. 25,174 అవుతుంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో రూపుదిద్దుకుంది.

Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ ధమాకా.. 43 ఇంచుల స్మార్ట్ టీవీలపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు

Vivo T5x 5G :
చివరగా Vivo T5x 5G స్మార్ట్‌ఫోన్ 8GB/128GB వేరియంట్ రూ. 27,999 కి లభిస్తోంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌పై రూ. 2,100 ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభించడంతో దీని ఎఫెక్టివ్ ధర రూ. 25,899 అవుతుంది. ఈ ఫోన్ 6.76 ఇంచుల డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అమరికతో లభిస్తోంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »