ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌లో Realme TechLife 43 inch Smart Google TV 2026 రూ.19,999 జాబితా ధరతో అందుబాటులో ఉంది.
Photo Credit: Samsung
Samsung 43 inch Smart Tizen TV
Flipkart Freedom Sale: భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇయర్‌బడ్స్, టాబ్లెట్లు, స్మార్ట్‌వాచ్‌లతో పాటు స్మార్ట్ టీవీలపై కూడా భారీ ఆఫర్లు అందిస్తోంది. ముఖ్యంగా 43 ఇంచుల పెద్ద స్క్రీన్ స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారికి ఈ సేల్ మంచి అవకాశం. రియల్‌మీ, శామ్‌సంగ్, మోటోరోలా, షియోమీ, హైయర్ వంటి ప్రముఖ బ్రాండ్ల టీవీలపై బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
రియల్‌మీ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ
ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌లో Realme TechLife 43 inch Smart Google TV 2026 రూ.19,999 జాబితా ధరతో అందుబాటులో ఉంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1,250 ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ టీవీ ఎఫెక్టివ్ ధర రూ.18,749కు వస్తుంది. అంతేకాదు, పాత టీవీని ఎక్స్ఛేంజ్ చేస్తే గరిష్టంగా రూ.6,380 వరకు అదనంగా ఆదా చేసుకునే అవకాశం ఉంది. అయితే ఎక్స్ఛేంజ్ విలువ పాత టీవీ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.
శామ్‌సంగ్ 43 ఇంచ్ టీవీ
Samsung 43 inch Full HD LED Smart Tizen TV జాబితా ధర రూ.23,250గా ఉంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో చెల్లిస్తే రూ.3,550 ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో దీని ఎఫెక్టివ్ ధర రూ.19,700కు తగ్గుతుంది. ఈ టీవీలో వాయిస్ అసిస్టెంట్ రిమోట్ కంట్రోల్, HDR10+ సపోర్ట్, శామ్‌సంగ్ నాక్స్ సెక్యూరిటీ, డిజిటల్ ట్యూనర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ లైట్, అడాప్టివ్ సౌండ్ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.
మోటోరోలా 43 ఇంచ్ 4K టీవీ
Motorola 43 inch Smart Google TV 2025 Edition జాబితా ధర రూ.24,099గా ఉంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1,250 ఇన్ స్టంట్ డిస్కౌంట్ అందుతుంది. దీంతో ఈ టీవీ రూ.22,849 ఎఫెక్టివ్ ధరకు లభిస్తుంది. ఇందులో 43 ఇంచుల QLED Ultra HD (4K) డిస్‌ప్లే ఉంది. గేమింగ్ ఇష్టపడేవారికి 120Hz గేమ్ యాక్సిలరేషన్ సపోర్ట్ అందించడం ప్రత్యేక ఆకర్షణ. ఈ టీవీ 5.0 ఓఎస్‌పై పనిచేస్తుంది.
షియోమీ 43 ఇంచ్ ఫైర్ టీవీ
Xiaomi FX Pro 43 inch Smart Fire TV జాబితా ధర రూ.26,499. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.4,250 ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో దీని ఎఫెక్టివ్ ధర రూ.22,249కు తగ్గుతుంది. ఈ టీవీలో ఇన్‌బిల్ట్ అలెక్సా, 32GB స్టోరేజ్, HDR10+, 30W డాల్బీ ఆడియో వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనికి ప్రీమియం మెటల్ బెజెల్-లెస్ డిజైన్‌తో పాటు ఫిల్మ్‌మేకర్ మోడ్ కూడా ఉంది.
హైయర్ 43 ఇంచ్ గూగుల్ టీవీ
Haier 43 inch Smart Google TV జాబితా ధర రూ.29,490గా ఉంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో చెల్లిస్తే రూ.5,750 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ టీవీ రూ.23,740 ఎఫెక్టివ్ ధరకు అందుబాటులోకి వస్తుంది. ఇందులో వాయిస్ అసిస్టెంట్ రిమోట్ సెర్చ్, HDR10, MEMC, డాల్బీ ఆడియో, టోటల్ సోనిక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇన్‌బిల్ట్ క్రోమ్‌కాస్ట్, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, 2GB ర్యామ్ కూడా ఇందులో ఉన్నాయి.
43 ఇంచ్ టీవీ కొనేవారికి మంచి ఆప్షన్లు
ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ 43 ఇంచ్ స్మార్ట్ టీవీల్లో రూ.18,749 ఎఫెక్టివ్ ధరతో రియల్‌మీ మోడల్ అత్యంత తక్కువ ధరలో ఉంది. మరోవైపు 4K QLED డిస్‌ప్లే, గేమింగ్ ఫీచర్ల కోసం మోటోరోలా, ఎక్కువ స్టోరేజ్, డాల్బీ ఆడియో కోసం షియోమీ, ప్రీమియం ఫీచర్ల కోసం హైయర్ వంటి మోడళ్లను పరిశీలించవచ్చు. అయితే బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ విలువలు మారే అవకాశం ఉండటంతో కొనుగోలు చేసే ముందు తాజా ధరను చెక్ చేయడం మంచిది.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
Infinix Xpad 30 Pro Launched With MediaTek Helio G200 Ultimate SoC, 8,200mAh Battery: Price, Specifications