భారత మార్కెట్లో ఒప్పో రెనో 13 5G ఫోన్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ లాంచింగ్ సమయంలో రూ.37,999 ధరతో విడుదలైంది.
Photo Credit: Oppo
Oppo Reno 13 5G
Oppo Reno 13 5G : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో నిర్వహిస్తున్న ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ నేటితో ముగియనుంది. ఈ సేల్ చివరి రోజున కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి ఒక అద్భుతమైన అవకాశం లభిస్తోంది. ముఖ్యంగా రూ. 35,000 బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు ఉన్న మొబైల్ కోసం చూస్తున్నట్లయితే.. ఒప్పో రెనో 13 5G పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. కంపెనీ అందించే ప్రైస్ కట్ ఆఫర్‌తో పాటు, బ్యాంక్ డిస్కౌంట్లు , ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కలుపుకొని ఈ ఫోన్‌ను అత్యంత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
భారత మార్కెట్లో ఒప్పో రెనో 13 5G ఫోన్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ లాంచింగ్ సమయంలో రూ.37,999 ధరతో విడుదలైంది. అయితే ప్రస్తుత ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ ఫోన్ నేరుగా రూ.34,999 ధరకే లిస్ట్ అయ్యింది. దీనికి అదనంగా బ్యాంక్ ఆఫర్లను కూడా ఉపయోగించుకోవచ్చు. మీ వద్ద ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే, దాని ద్వారా ట్రాన్సాక్షన్ చేయడం వల్ల మరో రూ.2,225 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్లన్నీ పోను ఒప్పో రెనో 13 5G ఎఫెక్టివ్ ధర కేవలం రూ.32,774 కే చేరుకుంటుంది. అంటే లాంచ్ ధరతో పోలిస్తే కస్టమర్లకు ఏకంగా రూ.5,225 మేర నికర పొదుపు లభిస్తుంది. ఒకవేళ మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే మరికొంత అదనపు తగ్గింపు కూడా పొందవచ్చు.
ఫీచర్ల పరంగా ఒప్పో రెనో 13 5G చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో 6.59 ఇంచుల 1.5K ఫ్లాట్ ఒలెడ్ కర్వ్‌డ్ డిస్‌ప్లేను అందించారు. ఇది 2760×1256 పిక్సెల్స్ రెజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. దీనివల్ల ఫోన్ స్క్రీన్ స్క్రోలింగ్, గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా స్మూత్‌గా ఉంటుంది. సెక్యూరిటీ కోసం ఇందులో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. ఇక ఫోన్ బాడీ మెజర్‌మెంట్స్ విషయానికి వస్తే.. 7.24 మిమీ మందంతో చాలా స్లిమ్‌గా, కేవలం 181 గ్రాముల బరువుతో చేతిలో పట్టుకోవడానికి చాలా లైట్ వెయిట్‌గా, ప్రీమియం లుక్‌తో డిజైన్ చేయబడింది.
Jio : జియో యూజర్లకు పండగే.. రీఛార్జ్ ప్లాన్స్‌పై 20GB వరకు ఉచితంగా ఎక్స్‌ట్రా డేటా
ఈ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ కోసం ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. భారీ యాప్స్ వాడటం, మల్టీటాస్కింగ్, హై-ఎండ్ గేమింగ్ ఆడేటప్పుడు ఈ ప్రాసెసర్ చాలా పవర్‌ఫుల్‌గా రన్ అవుతుంది. సాఫ్ట్‌వేర్ పరంగా ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్ ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. బ్యాటరీ విషయానికొస్తే, ఇందులో 5800mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది చాలా వేగంగా ఛార్జ్ అవ్వడానికి వీలుగా 80W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది.
కెమెరా లవర్స్ కోసం ఒప్పో ఈ ఫోన్‌లో అదిరిపోయే సెటప్ ఇచ్చింది. ఫోన్ వెనుక వైపు f/1.8 అపెర్చర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను, అలాగే f/2.2 అపెర్చర్‌తో కూడిన 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాను అమర్చారు. ఇక సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో f/2.0 అపెర్చర్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ హై-రెజల్యూషన్ ఫ్రంట్ కెమెరాను అందించడం విశేషం. వీటన్నింటితో పాటు, ఈ ఫోన్‌కు ధూళి, నీటి నుంచి గరిష్ట రక్షణ కోసం ఏకంగా IP66, IP68, IP69 అనే ట్రిపుల్ ప్రొటెక్షన్ రేటింగ్స్ ఇచ్చారు. అంటే ఫోన్ పూర్తిగా నీటిలో మునిగినా లేదా దుమ్ములో పడినా కూడా ఏమాత్రం పాడవదు. కనెక్టివిటీ పరంగా ఇందులో 5G, వై-ఫై 6, బ్లూటూత్ 5.4, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹63,999
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Oppo ColorOS 17 India Launch Set for October 13; Enco X4 Earbuds, Pad Mini Teased
Amazon Great Indian Festival 2026: Best Refrigerator Deals