జియో తన వినియోగదారుల కోసం కొన్ని ప్రత్యేకమైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. వీటిలో ప్రతిరోజూ లభించే రెగ్యులర్ డేటాతో పాటు అదనంగా 5GB నుంచి 20GB వరకు పూర్తి ఉచితంగా ఎక్స్‌ట్రా డేటాను అందిస్తోంది.
Photo Credit: RIL
Jio
Jio : ప్రస్తుత రోజుల్లో మన ఆన్‌లైన్ పనులన్నీ స్మార్ట్‌ఫోన్ల ద్వారానే సాగిపోతున్నాయి. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వీడియోలు, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల వాడకం పెరిగినప్పటి నుంచి ఇంటర్నెట్ డేటా వినియోగం కూడా భారీగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తమ కస్టమర్ల కోసం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ మోసుకొచ్చింది. జియో తన వినియోగదారుల కోసం కొన్ని ప్రత్యేకమైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. వీటిలో ప్రతిరోజూ లభించే రెగ్యులర్ డేటాతో పాటు అదనంగా 5GB నుంచి 20GB వరకు పూర్తి ఉచితంగా ఎక్స్‌ట్రా డేటాను అందిస్తోంది.
ఈ ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్ల ద్వారా జియో కేవలం ఇంటర్నెట్ డేటాను మాత్రమే కాకుండా.. ఈ తరం యూజర్లకు ఉపయోగపడే ఎన్నో ప్రీమియం బెనిఫిట్స్‌ను కూడా ఉచితంగా ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకునే కస్టమర్లకు గూగుల్ జెమిని ప్రో 18 నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్, జియోహాట్‌స్టార్ మొబైల్ యాక్సెస్, జియోగేమ్స్, ఫ్యాన్‌కోడ్, జియో ఏఐ క్లౌడ్ వంటి అదనపు ప్రయోజనాలను అందిస్తోంది. ఇంటర్నెట్ ఎక్కువగా వాడుతూ, ఓటీటీ కంటెంట్‌ను ఇష్టపడే వారికి ఈ ప్లాన్స్ బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తాయి. ఆ టాప్ ప్లాన్ల వివరాలు ఇప్పుడు చూద్దాం.
జియో రూ. 459, రూ. 495 యూత్ ప్లాన్స్ వివరాలు:
యువత, గేమర్లను టార్గెట్ చేస్తూ జియో ఇటీవల తెచ్చిన రూ. 459 ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఇందులో రోజువారీ 2GB డేటాతో పాటు అదనంగా 5GB డేటా లభిస్తుంది. అంటే మొత్తంగా 61GB హై-స్పీడ్ డేటా అన్నమాట. దీనితో పాటు అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్, ఎలిజిబుల్ యూజర్లకు అన్‌లిమిటెడ్ 5G డేటా వస్తుంది. అదనంగా 18 నెలల గూగుల్ జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్, 5TB క్లౌడ్ స్టోరేజ్, 3 నెలల జియోహాట్‌స్టార్, స్నాప్‌చాట్ ప్లస్ వంటి ఫీచర్లు లభిస్తాయి. ఇక రూ. 495 ప్లాన్ కూడా 28 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఇందులో రోజుకు 1.5GB డేటాతో పాటు 5GB ఎక్స్‌ట్రా డేటా (మొత్తం 47GB డేటా) లభిస్తుంది. దీనితో పాటు జియోగేమ్స్ క్లౌడ్, ఫ్యాన్‌కోడ్, గూగుల్ జెమిని ప్రో యాక్సెస్ కూడా ఇస్తున్నారు.
జియో రూ. 545 ప్రీపెయిడ్ ప్లాన్ స్పెషాలిటీ ఏంటి?
మరో బెస్ట్ ఆప్షన్ అయిన జియో రూ. 545 ప్లాన్ ద్వారా యూజర్లకు 28 రోజుల వాలిడిటీ లభిస్తుంది. ఇందులో ప్రతిరోజూ 2GB డేటా చొప్పున వస్తుంది. అదనంగా మరో 5GB డేటాను ఉచితంగా ఇస్తున్నారు. అంటే ఈ ప్లాన్ ద్వారా మొత్తంగా 61GB డేటా మీ సొంతమవుతుంది. అర్హులైన కస్టమర్లకు అన్‌లిమిటెడ్ 5G సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. ఉచిత ప్రయోజనాల విషయానికి వస్తే.. 3 నెలల జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్, గూగుల్ జెమిని ప్రో, జియోగేమ్స్ క్లౌడ్, ఫ్యాన్‌కోడ్, జియో ఏఐ క్లౌడ్‌కు సంబంధించిన 50GB ఉచిత స్టోరేజ్ స్పేస్ లభిస్తాయి.
Vivo T5 Lite 5G : భారీ బ్యాటరీతో మార్కెట్లోకి వీవో కొత్త 5G ఫోన్.. బడ్జెట్ ధరలో ఫీచర్లు అదిరిపోయాయ్
లాంగ్ వాలిడిటీ కోసం చూస్తున్నారా?
మీకు ఎక్కువ రోజుల వాలిడిటీతో పాటు భారీగా డేటా కావాలనుకుంటే.. జియో రూ. 749 ప్లాన్ పర్ఫెక్ట్ ఛాయిస్. ఇది 72 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఇందులో రోజువారీ 2GB డేటాతో పాటు ఏకంగా 20GB ఎక్స్‌ట్రా డేటాను బోనస్‌గా ఇస్తున్నారు. దీనివల్ల కస్టమర్లకు మొత్తం 164GB డేటా లభిస్తుంది. దీనితో పాటు గూగుల్ జెమిని ప్రో, జియోహాట్‌స్టార్ మొబైల్, 50GB జియో క్లౌడ్ స్టోరేజ్ వస్తాయి. ఇక చివరగా రూ. 899 ప్లాన్ ఏకంగా 90 రోజుల సుదీర్ఘ వాలిడిటీతో వస్తుంది. ఇందులో రోజువారీ 2GB డేటాతో పాటు మరో 20GB అదనపు డేటా లభిస్తుంది. అంటే కస్టమర్లకు మొత్తం 200GB డేటా అందుతుంది. అపరిమిత వాయిస్ కాలింగ్, రోజువారీ 100 ఎస్ఎమ్ఎస్, అన్‌లిమిటెడ్ 5G డేటా, మిగిలిన అన్ని జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్లు ఇందులో ఇన్-బిల్ట్‌గా వస్తాయి.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹63,999
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Oppo ColorOS 17 India Launch Set for October 13; Enco X4 Earbuds, Pad Mini Teased
Amazon Great Indian Festival 2026: Best Refrigerator Deals