ఫ్లిప్‌కార్ట్ జూన్ ఎపిక్ సేల్‌లో అన్నింటికంటే మోస్ట్ పవర్‌ఫుల్ డీల్ దేనిపై ఉందంటే.. అది శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ పైనే.
Photo Credit: Flipkart
Samsung Galaxy S25 Edge
Flipkart June Epic Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సరికొత్త డిస్కౌంట్ ఆఫర్లతో కస్టమర్ల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ వేదికగా జూన్ ఎపిక్ సేల్ అధికారికంగా లైవ్ లోకి వచ్చేసింది. ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఉన్న పలు పాపులర్ స్మార్ట్‌ఫోన్లపై కంపెనీ భారీ మొత్తంలో డిస్కౌంట్లను అందిస్తోంది. ఎంతో కాలంగా మంచి ప్రీమియం ఫోన్ కొనాలని ఎదురుచూస్తున్న వారికి ఈ సేల్ ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. ఎందుకంటే చాలా స్మార్ట్‌ఫోన్లు ఆకర్షణీయమైన ధరలకే కాకుండా.. కొన్ని మోడళ్లు ఏకంగా సగం ధరకే లిస్ట్ అయ్యాయి.
సగం ధరకే శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్
ఈ ఫ్లిప్‌కార్ట్ జూన్ ఎపిక్ సేల్‌లో అన్నింటికంటే మోస్ట్ పవర్‌ఫుల్ డీల్ దేనిపై ఉందంటే.. అది శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ పైనే. ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ధర సేల్‌లో ఊహించని విధంగా పడిపోయింది. శాంసంగ్ కంపెనీ ఈ మొబైల్‌ను ఇండియన్ మార్కెట్లో రూ.1,09,999 ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. కానీ, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ కరెంట్ సేల్‌లో ఈ ఫోన్ ఏకంగా రూ.59,999 ధరకే లిస్ట్ కావడం విశేషం.
ఎన్నడూ లేని విధంగా రూ.50,000 డిస్కౌంట్
శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ ఫోన్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ బేస్ వేరియంట్ పై ఫ్లిప్‌కార్ట్ ఈ 50 శాతం క్రేజీ ఆఫర్‌ను ఇస్తోంది. అంటే దీని ఎంఆర్‌పీ ధరపై కస్టమర్లకు నేరుగా రూ.50,000 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయిన తర్వాత దీనిపై లభిస్తున్న అత్యంత భారీ, అతిపెద్ద డిస్కౌంట్ ఆఫర్ ఇదే కావడం గమనార్హం. ప్రీమియం లుక్, బెస్ట్ పర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఇది అస్సలు వదులుకోకూడని డీల్.
అదనపు సేవింగ్స్ కోసం అదిరిపోయే బ్యాంక్ ఆఫర్లు
ఫ్లిప్‌కార్ట్ కేవలం ఫ్లాట్ డిస్కౌంట్ మాత్రమే కాకుండా కస్టమర్ల కోసం అదనపు బ్యాంక్ ఆఫర్లను కూడా అందుబాటులో ఉంచింది. ఈ ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు మీ దగ్గర గనుక ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ లేదా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఉంటే.. వాటి ద్వారా పేమెంట్ చేయడం వల్ల మరో రూ.3,000 ఎక్స్‌ట్రా ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్లన్నీ కలుపుకుంటే శాంసంగ్ ఈ మోస్ట్ లగ్జరీ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను ఎన్నడూ లేని విధంగా లైఫ్ టైమ్ లోయెస్ట్ ప్రైస్ కే సొంతం చేసుకోవచ్చు.
Motorola : మోటోరోలా నుంచి సరికొత్త బడ్జెట్ 5జీ ఫోన్లు..మార్కెట్లోకి మోటో జీ37, జీ37 పవర్ ఎంట్రీ
శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ అదిరిపోయే ఫీచర్లు
ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం ధర పరంగానే కాకుండా ఫీచర్ల పరంగా కూడా మార్కెట్లో నంబర్ వన్ గా నిలుస్తుంది. ఇందులో 6.7 ఇంచుల క్వాడ్ హెచ్‌డీ+ ఎల్‌టీపీఓ అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. ఇది 1440x3120 పిక్సెల్స్ హై-రెజల్యూషన్, స్మూత్ 120Hz రీఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లో అత్యంత పవర్‌ఫుల్ అయిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ను అమర్చారు, ఇది గేమింగ్ కు, మల్టీటాస్కింగ్ కు అదిరిపోయే స్పీడ్ ఇస్తుంది.
200MP కెమెరా, అల్ట్రా స్లిమ్ డిజైన్
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఈ కారులో ఏకంగా 200 మెగాపిక్సెల్ ప్రైమరీ మెయిన్ కెమెరాను అందించారు, ఇది నైట్ టైమ్ లో కూడా అద్భుతమైన క్రిస్టల్ క్లియర్ పిక్చర్స్ అందిస్తుంది. ఈ ఫోన్ యొక్క మరో అతిపెద్ద హైలైట్ ఏంటంటే దీని స్లిమ్ సైజ్. ఈ ఫోన్ కేవలం 5.8mm థిక్‌నెస్ తో శాంసంగ్ కంపెనీ చరిత్రలోనే అత్యంత సన్నని, స్టైలిష్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా నిలిచింది. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే.. ఈ గెలాక్సీ S25 ఎడ్జ్ మొబైల్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ 7 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Amazon Great Indian Festival 2026: Gaming Headset Deals Under Rs. 5,000
Amazon Great Indian Festival 2026 Sale: Best Gaming Monitors Under Rs. 20,000
Amazon Great Indian Festival 2026: Best Power Bank Deals