ఇందులో భాగంగా మోటో జీ37 పవర్ మోడల్ 4GB రామ్ + 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్‌ను వినియోగదారులు కేవలం రూ.15,999 ఎఫెక్టివ్ ధరకే సొంతం చేసుకోవచ్చు.
Motorola
Motorola : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటోరోలా బడ్జెట్ ధరలో అధునాతన ఫీచర్లు కోరుకునే భారతీయ వినియోగదారుల కోసం రెండు సరికొత్త 5జీ మొబైల్స్‌ను పరిచయం చేసింది. తమ పాపులర్ జీ సిరీస్‌లో భాగంగా మోటో జీ37, మోటో జీ37 పవర్ మోడల్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ రెండు ఫోన్లను ముఖ్యంగా సుదీర్ఘమైన బ్యాటరీ లైఫ్, వేగవంతమైన 5జీ కనెక్టివిటీని కోరుకునే కస్టమర్ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ సరికొత్త ఫోన్ల లాంచ్ సందర్భంగా మోటోరోలా సంస్థ కస్టమర్ల కోసం ఒక అద్భుతమైన లిమిటెడ్ పీరియడ్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా మోటో జీ37 పవర్ మోడల్ 4GB రామ్ + 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్‌ను వినియోగదారులు కేవలం రూ.15,999 ఎఫెక్టివ్ ధరకే సొంతం చేసుకోవచ్చు. కాగా, ఈ సిరీస్‌లోని సాధారణ మోడల్ అయిన మోటో జీ37 అసలు ధర రూ.14,999 కాగా, లాంచ్ ఆఫర్ కింద లభిస్తున్న బ్యాంక్ డిస్కౌంట్ సహాయంతో దీనిని కేవలం రూ.13,999కే కొనుగోలు చేసే అవకాశం ఉంది.
జీ37 పవర్ 8GB వేరియంట్‌పై భారీ తగ్గింపు
ఎక్కువ ర్యామ్ కావాలనుకునే వారి కోసం మోటో జీ37 పవర్ మోడల్‌లో 8GB రామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ ప్రీమియం వేరియంట్ అసలు ధర రూ.21,999 కాగా.. ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న ప్రత్యేక బ్యాంక్ ఆఫర్ కింద రూ.2,000 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. దీనితో ఈ ఫోన్ ఎఫెక్టివ్ ధర కేవలం రూ.19,999గా మారుతుంది. ఈ ఫోన్లు అన్నీ కూడా పాంటోన్ క్యాప్రి, పాంటోన్ ఇంపెనెట్రబుల్, పాంటోన్ నాటికల్ బ్లూ వంటి స్టైలిష్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. వీటిని ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా అధికారిక వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.
అద్భుతమైన డిస్ప్లే, పవర్‌ఫుల్ ప్రాసెసర్
ఫీచర్ల పరంగా చూస్తే, మోటో జీ37, జీ37 పవర్ స్మార్ట్‌ఫోన్‌లు రెండింటిలోనూ 6.7 ఇంచుల హెచ్‌డీ+ ఎల్‌సీడీ (HD+ LCD) డిస్ప్లేను అందించారు. ఇది 1604x720 పిక్సెల్స్ రెజల్యూషన్, 120Hz రీఫ్రెష్ రేట్, గరిష్టంగా 1050 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్ రక్షణ కోసం బలమైన Corning Gorilla Glass 7i ప్రొటెక్షన్‌ను ఇచ్చారు. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు కూడా లేటెస్ట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌పై రన్ అవుతాయి. గ్రాఫిక్స్ కోసం దీనిలో ఆర్మ్ మాలి-G57 MC2 జీపీయూని అమర్చారు.
లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఓఎస్ సపోర్ట్
ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు అవుట్ ఆఫ్ ది బాక్స్ గూగుల్ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 16 పై రన్ అవుతాయి. దీనితో పాటు వినియోగదారులకు 1 మేజర్ ఓఎస్ అప్‌డేట్, 3 సంవత్సరాల పాటు రెగ్యులర్ సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని మోటోరోలా గ్యారెంటీ ఇచ్చింది. మెమరీ విషయానికి వస్తే, మోటో జీ37 లో 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ ఉండగా.. జీ37 పవర్ లో 4GB/8GB ర్యామ్, 64GB/128GB స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. మైక్రో ఎస్‌డీ కార్డ్ సహాయంతో ఫోన్ స్టోరేజ్‌ను ఏకంగా 1TB వరకు పెంచుకోవచ్చు. సెక్యూరిటీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఇందులో ఉంది.
Lenovo Yoga Earbuds : లెనోవో నుంచి సరికొత్త యోగా ఇయర్‌బడ్స్.. అదిరిపోయే ఫీచర్లతో లాంచ్
సోనీ 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ భద్రత
ఫొటోగ్రఫీ కోసం రెండు స్మార్ట్‌ఫోన్‌ల వెనుక భాగంలో f/1.8 అపెర్చర్ కలిగిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను, ఒక 2-ఇన్-1 లైట్ సెన్సార్‌ను అందించారు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్లకు పూర్తి రక్షణ కల్పించేందుకు IP64 రేటింగ్ (వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్), కఠినమైన మిలిటరీ గ్రేడ్ MIL-STD 810H సర్టిఫికేషన్‌ను ఇచ్చారు. దీనివల్ల ఫోన్ కింద పడినా అంత సులభంగా డ్యామేజ్ కాదు. కనెక్టివిటీ కోసం 5G, డ్యూయల్ 4G VoLTE, వైఫై 5, బ్లూటూత్ 5.4, జీపీఎస్, 3.5mm ఆడియో జాక్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి.
బ్యాటరీ సామర్థ్యంలోనే అసలైన తేడా
ఈ రెండు మోడల్స్ మధ్య ఉన్న అతిపెద్ద వ్యత్యాసం వాటి బ్యాటరీ, చార్జింగ్ స్పీడ్‌లోనే ఉంది. బేస్ మోడల్ అయిన మోటో జీ37లో 5200mAh సామర్థ్యం గల బ్యాటరీని అమర్చారు, ఇది 20W టర్బో చార్జింగ్, 6W రివర్స్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. కాగా, ప్రీమియం మోడల్ అయిన మోటో జీ37 పవర్లో ఏకంగా 7000mAh సామర్థ్యం గల కొండలాంటి భారీ బ్యాటరీని అందించారు. ఇది చాలా వేగంగా చార్జ్ అవ్వడానికి 30W టర్బో చార్జింగ్ సపోర్ట్‌తో పాటు, ఇతర చిన్న గ్యాడ్జెట్లను చార్జ్ చేసుకోవడానికి 6W రివర్స్ చార్జింగ్ ఫీచర్‌ను కలిగి ఉంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Amazon Great Indian Festival 2026: Gaming Headset Deals Under Rs. 5,000
Amazon Great Indian Festival 2026 Sale: Best Gaming Monitors Under Rs. 20,000
Amazon Great Indian Festival 2026: Best Power Bank Deals