Flipkart Bank officer on HMD Vbe 2: బడ్జెట్ ధరలోనే 5G పవర్..భారత మార్కెట్లోకి HMD వైబ్ 2 5G లాంచ్!

Flipkart bank officer on HMD Vbe 2: HMD వైబ్ 2 5G పేరుతో సరికొత్త వేరియంట్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది.

Flipkart Bank officer on HMD Vbe 2: బడ్జెట్ ధరలోనే 5G పవర్..భారత మార్కెట్లోకి HMD వైబ్ 2 5G లాంచ్!

Photo Credit: HMD

HMD Vibe 2 5G

ముఖ్యాంశాలు
  • బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో హెచ్ఎండీ సునామీ
  • 6000mAh బ్యాటరీతో మార్కెట్ ను ఊడ్చేయడానికి వచ్చిన HMD వైబ్ 2
  • బ్యాటరీ బ్యాకప్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న వైబ్ 2 5G!
ప్రకటన

Flipkart Bank officer on HMD Vbe 2 5g: మొబైల్ తయారీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హెచ్ఎండీ సంస్థ, భారతీయ బడ్జెట్ కస్టమర్లను టార్గెట్ చేస్తూ ఒక సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. HMD వైబ్ 2 5G పేరుతో సరికొత్త వేరియంట్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. తక్కువ ధరలోనే నెక్స్ట్ జనరేషన్ 5G కనెక్టివిటీని, పవర్‌ఫుల్ బ్యాటరీని కోరుకునే వారికి ఈ స్మార్ట్‌ఫోన్ ఒక అద్భుతమైన ఆప్షన్‌గా నిలవనుంది.

హెచ్ఎండీ వైబ్ 2 5G స్మార్ట్‌ఫోన్ కేవలం ఒకే ఒక స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో లభిస్తోంది. దీని 6GB రామ్ + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.16,999గా కంపెనీ నిర్ణయించింది. అయితే, కస్టమర్లకు మరింత లబ్ధి చేకూర్చేందుకు ప్రత్యేక బ్యాంక్ ఆఫర్లను కూడా ప్రకటించింది. ఈ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లను ఉపయోగించుకుంటే.. ఈ ఫోన్‌ను కేవలం రూ.14,999 లంచ్ స్పెషల్ ప్రైస్‌కే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే జూన్ 16, 2026 మధ్యాహ్నం 12 గంటల నుంచి హెచ్ఎండీ అధికారిక వెబ్‌సైట్,  ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది.

సిల్కీ స్మూత్ 120Hz డిస్‌ప్లే, సెక్యూరిటీ

సాంకేతిక వివరాల పరంగా చూస్తే.. HMD వైబ్ 2 5G ఫోన్‌లో 6.75 ఇంచుల హెచ్‌డీ+ వీ-నాచ్ ఐపీఎస్ డిస్‌ప్లేను అందించారు. ఇది 720x1600 పిక్సెల్స్ రెజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. బడ్జెట్ ధరలోనే గేమింగ్, స్క్రీన్ స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా సాగడానికి వీలుగా ఇందులో ఏకంగా 120Hz హై రిఫ్రెష్ రేట్‌ను అందించడం విశేషం. ఇక సెక్యూరిటీ విషయానికి వస్తే.. ఫోన్ లాక్ ఈజీగా అన్‌లాక్ చేసుకోవడానికి వీలుగా సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కంపెనీ అమర్చింది.


Jio 1-Year Recharge Plans : జియో కస్టమర్లకు బంపర్ ఆఫర్.. ఒక్క రీఛార్జ్‌తో ఏడాది పాటు నో టెన్షన్

పవర్‌ఫుల్ ప్రాసెసర్, లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16

ఈ స్మార్ట్‌ఫోన్ పనితీరును మెరుగుపరచడానికి ఇందులో యునిసోక్ T8200 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది రోజువారీ పనులతో పాటు మల్టీటాస్కింగ్‌ను సులభంగా హ్యాండిల్ చేస్తుంది. ఇందులో ఉన్న 6GB రామ్‌తో పాటు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కస్టమర్లకు లభిస్తుంది. ఒకవేళ స్టోరేజ్ చాలకపోతే.. మైక్రో ఎస్‌డీ కార్డ్ సహాయంతో ఏకంగా 1TB వరకు స్టోరేజ్‌ను పెంచుకునే సదుపాయం కూడా ఉంది. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే.. ఈ ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. అలాగే ఈ ఫోన్‌కు 2 సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని హెచ్ఎండీ హామీ ఇచ్చింది.

50 ఎంపీ ఏఐ కెమెరా, 6000mAh బ్యాటరీ

ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ సామర్థ్యం గల ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇది మంచి క్వాలిటీ ఫోటోలను క్లిక్ చేస్తుంది. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు. కనెక్టివిటీ పరంగా ఇందులో 5G, బ్లూటూత్ 5.0, వై-ఫై, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా.. ఈ ఫోన్ లో ఏకంగా 6000mAh భారీ బ్యాటరీని ఇచ్చారు. దీనిని ఛార్జ్ చేయడానికి 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండటంతో బ్యాటరీ లైఫ్ గురించి అస్సలు టెన్షన్ పడాల్సిన పనే లేదు.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »