Jio 1 Year Recharge Plan: జియో తన కస్టమర్ల కోసం 365 రోజుల వాలిడిటీతో అందిస్తున్న ప్రారంభ ప్లాన్ ధర రూ.3,599.
Reliance Jio
Jio 1-Year Recharge Plan: ఇటీవలి కాలంలో భారతీయ టెలికాం కంపెనీలన్నీ తమ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరలను విపరీతంగా పెంచేసాయి. ఈ ధరల పెంపు సిరీస్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి నెలా రీఛార్జ్ చేసుకుంటూ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం కంటే.. ఒకేసారి 365 రోజుల లాంగ్ వాలిడిటీ ప్లాన్ ఎంచుకోవడం వినియోగదారులకు ఎంతో లాభదాయకంగా మారుతోంది. ఈ ప్లాన్లలో రోజువారీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, ఉచిత ఓటీటీ వంటి అద్భుతమైన ఎంటర్టైన్‌మెంట్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఇందులో భాగంగానే రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ పోర్ట్‌ఫోలియోలో రెండు బెస్ట్ యాన్యువల్ ప్లాన్లను కస్టమర్ల ముందుకు తెచ్చింది.
జియో రూ.3599 వార్షిక ప్లాన్ వివరాలు..
జియో తన కస్టమర్ల కోసం 365 రోజుల వాలిడిటీతో అందిస్తున్న ప్రారంభ ప్లాన్ ధర రూ.3,599. ఈ ప్లాన్ ఎంచుకుంటే కస్టమర్లకు ప్రతిరోజూ 2.5GB హైస్పీడ్ 4G డేటా లభిస్తుంది. అంటే ఏడాది మొత్తానికి కలిపి ఏకంగా 912.5GB భారీ డేటాను కంపెనీ ఇస్తోంది. ఒకవేళ మీ ఏరియాలో 5G నెట్‌వర్క్ ఉంటే గనుక కస్టమర్లు అన్‌లిమిటెడ్ 5G సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్‌ను ఉచితంగా వాడుకోవచ్చు. దీనితో పాటు దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ లోకల్/ఎస్టీడీ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఉచిత ఎస్ఎమ్ఎస్ లభిస్తాయి. డైలీ హైస్పీడ్ డేటా లిమిట్ అయిపోయిన తర్వాత కూడా ఇంటర్నెట్ ఆగిపోదు, కానీ స్పీడ్ 64 Kbpsకి తగ్గుతుంది.
ఉచిత గూగుల్ జెమిని ఏఐ ప్రో, ఓటీటీలు..
ఈ రూ.3599 ప్లాన్ లోని బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే.. ఇందులో కస్టమర్లకు సరికొత్త గూగుల్ జెమిని ఏఐ ప్రో సబ్‌స్క్రిప్షన్ పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. దీనితో పాటు సరికొత్త జియోహాట్‌స్టార్ కి సంబంధించిన 3 నెలల మొబైల్, టీవీ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా ఆఫర్ చేస్తున్నారు. అలాగే 365 రోజుల పాటు లైవ్ టీవీ షోలు, సినిమాల కోసం జియో టీవీ యాక్సెస్, మీ ఫోటోలు, వీడియోలను భద్రపరుచుకోవడానికి ఎక్స్‌ట్రా క్లౌడ్ స్టోరేజ్ ఆప్షన్ ఇచ్చే జియోక్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఇందులో ఉచితం.
Tata Sierra EV : పనోరమిక్ సన్‌రూఫ్, ప్రీమియం ఆడియో సిస్టమ్.. ఈ నెలాఖరులోనే సియెర్రా ఈవీ లాంచ్
స్పోర్ట్స్ లవర్స్ కోసం జియో రూ.3999 ప్లాన్..
జియో అందిస్తున్న రెండవ వార్షిక ప్లాన్ ధర రూ.3,999. ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 365 రోజులుగా ఉంటుంది. ఇందులో కూడా కస్టమర్లకు ప్రతిరోజూ 2.5GB డేటా (అన్‌లిమిటెడ్ 5G డేటా ఆఫర్‌తో కలిపి), అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఫ్రీ ఎస్ఎమ్ఎస్ సౌకర్యం లభిస్తుంది. ఈ ప్లాన్ లో కూడా కస్టమర్లకు 3 నెలల పాటు జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్, ఉచిత గూగుల్ జెమిని ఏఐ ప్రో లభిస్తాయి.
ఫ్యాన్‌కోడ్ ఓటీటీ యాక్సెస్ స్పెషల్..
రూ.3599 ప్లాన్‌కు, రూ.3999 ప్లాన్‌కు ఉన్న ఒకే ఒక్క ముఖ్యమైన తేడా ఓటీటీ యాప్స్ యాక్సెస్ మాత్రమే. ఈ రూ.3999 ప్లాన్ కొనుగోలు చేసే వారికి కంపెనీ అదనంగా ప్రముఖ స్పోర్ట్స్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ఫ్యాన్‌కోడ్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తుంది. దీని ద్వారా కస్టమర్లు తమ మొబైల్‌లోనే ఫార్ములా 1 రేసింగ్, లైవ్ క్రికెట్, ఇతర అంతర్జాతీయ లైవ్ స్పోర్ట్స్ మ్యాచ్‌లను ఎలాంటి అదనపు రుసుము లేకుండా ప్రశాంతంగా ఆస్వాదించవచ్చు. కస్టమర్లు తమ అవసరాలకు తగ్గట్టుగా ఈ రెండు ప్లాన్లలో ఏదైనా ఒకదానిని జియో అఫీషియల్ వెబ్‌సైట్ లేదా మైజియో యాప్ ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999