హానర్ రోబోట్ ఫోన్లో ట్రిపుల్ రియర్ కెమెరా ఇచ్చారు.
Photo Credit: Honor
Honor Robot Phone
Honor Robot Phone : చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హానర్ ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన ఇన్-బిల్ట్ గింబల్ కెమెరా టెక్నాలజీతో తమ సరికొత్త స్మార్ట్‌ఫోన్ హానర్ రోబోట్ ఫోన్‌ను ఆవిష్కరించడానికి సిద్ధమైంది. చైనాకు చెందిన ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వేదిక వీబోలో లీకైన వివరాల ప్రకారం.. ఈ విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్ట్ 12న చైనాలో అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. హాలీవుడ్ లెవల్ వీడియో మేకింగ్ ఎక్స్పీరియన్స్ అందించడం కోసం హానర్ సంస్థ ప్రముఖ జర్మన్ ఫిల్మ్ ఇక్విప్మెంట్ కంపెనీ ARRIతో చేతులు కలిపి ఈ ఫోన్‌ను రూపొందించడం టెక్ ప్రపంచంలో విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది.
200 మెగాపిక్సెల్ గింబల్ కెమెరా సెటప్
ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ లీక్ చేసిన సమాచారం ప్రకారం.. హానర్ రోబోట్ ఫోన్లో ట్రిపుల్ రియర్ కెమెరా ఇచ్చారు. అందులోనూ ముఖ్యంగా f/1.6 అపెర్చర్‌తో కూడిన ఏకంగా 200 మెగాపిక్సెల్ ప్రైమరీ గింబల్ కెమెరాను అందించబోతున్నారు. దీనివల్ల ఎలాంటి షేక్స్ లేదా వణుకు లేకుండా అత్యంత స్పష్టమైన వీడియోలు, ఫోటోలు తీయవచ్చు. దీనితో పాటు 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను కూడా పొందుపరచడం విశేషం. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లు, వీలాగర్లకు ఈ ఫోన్ ఒక డ్రీమ్ డివైజ్‌గా మారనుంది.
పవర్ ఫుల్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, పీక్ బ్రైట్నెస్
ఈ నయా ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ మొబైల్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో రానుంది. దీనికి అదనంగా హానర్ సొంత 'C1' కనెక్టివిటీ చిప్‌ను కూడా అందించనున్నారు. డిస్ప్లే విభాగానికి వస్తే, ఇది 1,216 x 2,640 పిక్సెల్స్ రెసల్యూషన్ కలిగిన 6.3 ఇంచుల ఫ్లాట్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది ఏకంగా 6,800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను సపోర్ట్ చేస్తుంది, దీనివల్ల ఎంతటి తీవ్రమైన ఎండలోనైనా స్క్రీన్ అత్యంత స్పష్టంగా కనిపిస్తుంది.
LG TV : జెమినీ ఏఐ సపోర్ట్‌తో ఎల్జీ టీవీలు.. రూమ్‌ని థియేటర్లా మార్చేయడానికి కొత్త మోడల్స్ వచ్చేశాయ్
భారీ బ్యాటరీ, స్టోరేజ్ వేరియంట్లు
హానర్ రోబోట్ ఫోన్లో సుదీర్ఘ బ్యాటరీ లైఫ్ కోసం ఏకంగా 7,060 mAh భారీ బ్యాటరీని అందించబోతున్నారు. ఇది 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉండటం వల్ల ఫోన్ అత్యంత వేగంగా ఛార్జ్ అవుతుంది. ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్లలో లభించనుంది. అవి స్టార్ ట్రైల్ సిల్వర్, మూన్ షాడో గ్రే. రామ్, స్టోరేజ్ విషయానికి వస్తే.. 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్‌తో పాటు హై-ఎండ్ 16GB RAM + 1TB స్టోరేజ్ ఆప్షన్లలో ఇది అందుబాటులోకి రానుంది.
ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన హానర్ X80 ప్రొ మ్యాక్స్
మరొకవైపు హానర్ సంస్థ ఇటీవలే హానర్ X80 ప్రొ మ్యాక్స్ ను కూడా ప్రవేశపెట్టింది. డ్యూయల్ సిమ్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ 6.8 ఇంచుల 1.5K (1,280 × 2,788 పిక్సెల్స్) LTPS AMOLED డిస్ప్లేను కలిగి ఉంది, ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 10,000 నిట్స్ పీక్ HDR బ్రైట్నెస్ను సపోర్ట్ చేస్తుంది. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 చిప్సెట్, అడ్రినో 812 GPU తో నడిచే ఈ ఫోన్ వెనుక వైపు 10x డిజిటల్ జూమ్‌తో 50 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా, ముందు వైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇది 4K/30 fps రెసల్యూషన్‌లో వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఇస్తుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
BGMI Air Set to Launch in India on December 10; Closed Beta Testing to Begin Later This Month
WhatsApp Rolls Out Recent Media Suggestions Feature for Android and iOS Users: Report