క్యూఎన్‌ఈడీ ఈవో మినీ ఎల్‌ఈడీ సిరీస్ ధరలు రూ. 52,990 నుంచి ప్రారంభం కాగా నానో 4కే యూహెచ్‌డీ లైనప్ ధర రూ. 38,990 నుంచి మొదలవుతుంది.
Photo Credit: LG
LG Mini LED
LG TV : ప్రముఖ గృహోపకరణాల దిగ్గజం ఎల్జీ భారతీయ మార్కెట్లోకి అత్యంత ఆధునిక ఫీచర్లతో కూడిన 2026 ఏఐ టీవీ లైనప్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త సిరీస్‌లో భాగంగా కంపెనీ QNED evo Mini LED, OLED evo, Micro RGB evo, Mini RGB evo, Nano 4K UHD, Smart AI TV మోడళ్లను ప్రవేశపెట్టింది. ఈ కొత్త లైనప్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఏకంగా 115 అంగుళాల భారీ QNED evo Mini LED TV భారత్‌లో లాంచ్ కావడం విశేషం. ఈ టీవీలు అత్యాధునిక ఏఐ ప్రాసెసర్లు, హై రిఫ్రెష్ రేట్లు, అద్భుతమైన గేమింగ్ ఫీచర్లు, గూగుల్ జెమినీ ఇంటిగ్రేషన్‌తో కస్టమర్లను అలరించడానికి సిద్ధమయ్యాయి.
ఏయే మోడల్ ధర ఎంతెంత ఉందంటే..
ఎల్జీ కొత్త ఏఐ టీవీ సిరీస్ ప్రారంభ ధర రూ. 19,990 నుంచి మొదలవుతుంది. క్యూఎన్‌ఈడీ ఈవో మినీ ఎల్‌ఈడీ సిరీస్ ధరలు రూ. 52,990 నుంచి ప్రారంభం కాగా నానో 4కే యూహెచ్‌డీ లైనప్ ధర రూ. 38,990 నుంచి మొదలవుతుంది. ఇక ప్రీమియం ఓఎల్‌ఈడీ లవర్స్ కోసం OLED evo C6 ధర రూ. 1,19,990 నుంచి, OLED B6 ధర రూ. 1,47,490 నుంచి, అత్యంత విలాసవంతమైన OLED evo G6 ధర రూ. 2,14,990 నుంచి ప్రారంభమవుతాయి. అలాగే మినీ ఆర్‌జీబీ ఈవో సిరీస్ రూ. 1,28,990 నుంచి లభించనుండగా, అత్యంత ఖరీదైన 100 అంగుళాల మైక్రో ఆర్‌జీబీ ఈవో మోడల్ ధర రూ. 12,99,990గా నిర్ణయించారు. ఈ కొత్త టీవీలన్నీ దేశవ్యాప్తంగా ఉన్న ఎల్జీ రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.
క్యూఎన్‌ఈడీ ఈవో మినీ ఎల్‌ఈడీ, గేమింగ్ ఫీచర్లు
ఎల్జీ కొత్త QNED evo Mini LED సిరీస్ 43 అంగుళాల నుంచి మొదలుకుని అతిపెద్ద 115 అంగుళాల స్క్రీన్ సైజ్ వరకు విభిన్న ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో డైనమిక్ క్యూఎన్‌ఈడీ కలర్ ప్రో, ప్రెసిషన్ డిమ్మింగ్ అల్ట్రా, మోషన్ బూస్టర్ వంటి మోడ్రన్ టెక్నాలజీని పొందుపరిచారు. ఎంపిక చేసిన కొన్ని మోడళ్లలో ఏకంగా 330Hz వరకు రిఫ్రెష్ రేట్, 165Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్, ఆటో లో లేటెన్సీ మోడ్ సపోర్ట్ లభిస్తుంది. దీనివల్ల గేమింగ్ లవర్స్‌కు స్మూత్, ఎలాంటి లాగ్ లేని అనుభూతి దక్కుతుంది. కొన్ని మోడళ్లలో ఆల్ఫా 8 ఏఐ ప్రాసెసర్ జెన్ 3ను అందించారు.
అత్యుత్తమ విజువల్స్ ఇచ్చే ఓఎల్‌ఈడీ ఈవో సిరీస్
పిక్చర్ క్వాలిటీ విషయంలో రాజీ పడని వారి కోసం ఎల్జీ G6, C6, B6 ఓఎల్‌ఈడీ సిరీస్‌లను పరిచయం చేసింది. G6, C6 మోడళ్లలో పవర్ఫుల్ ఆల్ఫా 11 ఏఐ ప్రాసెసర్ జెన్ 3, బ్రైట్‌నెస్ బూస్టర్ అల్ట్రా, హైపర్ రేడియంట్ కలర్ టెక్నాలజీ, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్, ఎన్విడియా జి-సింక్, ఏఎండీ ఫ్రీసింక్ ప్రీమియం, 165Hz VRR వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక OLED B6 మోడల్‌లో ఆల్ఫా 8 ఏఐ ప్రాసెసర్ జెన్ 3 ఇవ్వగా, దీనికి పర్ఫెక్ట్ బ్లాక్, పర్ఫెక్ట్ కలర్ సర్టిఫికేషన్ లభించింది.
OnePlus N6x : వన్ ప్లస్ నుంచి సరికొత్త బడ్జెట్ ఫోన్ OnePlus N6x సేల్స్ ప్రారంభం.. ఆఫర్లతో భారీగా ఆదా
మొదటిసారిగా మైక్రో, మినీ ఆర్‌జీబీ ఈవో టీవీల విడుదల
ఎల్జీ చరిత్రలో తొలిసారిగా Micro RGB evo, Mini RGB evo ఎల్‌సీడీ టీవీలను మార్కెట్లోకి తెచ్చింది. వీటిలో TÜV రైన్‌ల్యాండ్ సర్టిఫైడ్ హై ప్యూరిటీ ఆర్‌జీబీ స్పెక్ట్రమ్ డిస్‌ప్లే టెక్నాలజీని వాడారు. 100 అంగుళాల మైక్రో ఆర్‌జీబీ ఈవో మోడల్ BT.2020, DCI-P3, Adobe RGB కలర్ స్పేస్‌లో నూటికి 100 శాతం కలర్ కవరేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. అలాగే మినీ ఆర్‌జీబీ ఈవో మోడళ్లలో టెండెం ఎల్‌ఈడీ టెక్నాలజీ, ప్రెసిషన్ డిమ్మింగ్, ఆల్ఫా 8 ఏఐ ప్రాసెసర్ జెన్ 3 ఉన్నాయి.
నానో 4కే, స్మార్ట్ ఏఐ టీవీల ప్రత్యేకతలు
ఈ లైనప్‌లో భాగంగా నానో 4కే యూహెచ్‌డీ సిరీస్‌ను కూడా అప్‌గ్రేడ్ చేశారు. ఇందులో 43 అంగుళాల నుంచి 98 అంగుళాల వరకు మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఆల్ఫా 7 ఏఐ ప్రాసెసర్ జెన్ 9, నానో డీటైల్ ఎన్‌హాన్సర్, HDR10 Pro, డాల్బీ అట్మాస్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇక చిన్న రూమ్‌ల కోసం తెచ్చిన కొత్త Smart AI TV (LB65) సిరీస్ 32, 43 అంగుళాల సైజుల్లో లభిస్తుంది. ఇందులో ఆల్ఫా 5 ఏఐ ప్రాసెసర్ జెన్ 9, webOS 26, గూగుల్ జెమినీ, మైక్రోసాఫ్ట్ కోపైలట్ (Microsoft Copilot), ఎల్జీ గేమింగ్ పోర్టల్, ఏకంగా 5 సంవత్సరాల పాటు webOS అప్‌డేట్ల సపోర్ట్ అందించడం గమనార్హం.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,150
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Meta Muse AI Agent Arrives on Mac With Support for Complex Tasks: What to Know
WhatsApp Could Bring New Theme Categories and Wallpapers to Android
Mivi One 5G Camera Details Revealed, Mivi Care+ Support Teased Ahead of Launch