Honor X80 Pro Max launching with 11000mah battery on June 22 in China: హానర్ X80 సిరీస్‌లో భాగంగా రాబోతున్న హానర్ X80 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్ అధికారిక లాంచ్ తేదీని కంపెనీ కన్ఫర్మ్ చేసింది
Photo Credit: Honor
Honor X80 Pro Max
Honor X80 Pro Max launching with 11000mah battery on June 22 in China: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను ఎక్కువగా వేధించే సమస్య బ్యాటరీ ఛార్జింగ్ త్వరగా అయిపోవడం. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హానర్, తన అప్‌కమింగ్ సిరీస్‌లో అత్యంత పవర్‌ఫుల్ ఫోన్‌ను తీసుకురాబోతోంది. హానర్ X80 సిరీస్‌లో భాగంగా రాబోతున్న హానర్ X80 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్ అధికారిక లాంచ్ తేదీని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. వచ్చే వారం జూన్ 22, 2026న ఈ మొబైల్ చైనా మార్కెట్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. అదే రోజున ఈ ఫోన్ పూర్తి సేల్ వివరాలు, ధరలను కంపెనీ అధికారికంగా వెల్లడించనుంది.
ప్రపంచంలోనే అతిపెద్ద 11000mAh బ్యాటరీ..
ఈ స్మార్ట్‌ఫోన్‌లోని అసలైన, బిగ్గెస్ట్ హైలైట్ దాని బ్యాటరీ సామర్థ్యం. ఇందులో ఏకంగా 11,000mAh సామర్థ్యం కలిగిన భారీ సిలికాన్-కార్బన్ బ్యాటరీని అమర్చినట్లు హానర్ సంస్థ అధికారికంగా ధృవీకరించింది. ఇప్పటివరకు ప్రపంచంలో ఏ మెయిన్‌స్ట్రీమ్ స్మార్ట్‌ఫోన్ లోనూ ఇంత పెద్ద సైజ్ బ్యాటరీని అందించలేదు. ఈ భారీ బ్యాటరీని చాలా వేగంగా ఛార్జ్ చేయడానికి వీలుగా 90W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా ఇచ్చారు. దీనితో పాటు 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది, అంటే ఈ ఫోన్ సహాయంతో మనం ఇతర గ్యాడ్జెట్లకు లేదా ఫోన్లకు పవర్‌బ్యాంక్‌లా ఛార్జింగ్ ఇచ్చుకోవచ్చు.
ఆకట్టుకునే రంగులు, లగ్జరీ డిజైన్..
లుక్ , డిజైన్ పరంగా కూడా ఈ ఫోన్ చాలా ప్రీమియంగా ఉండబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ మొత్తం నాలుగు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభించనుందని కంపెనీ స్పష్టం చేసింది. అందులో ఎనర్జిటిక్ ఆరెంజ్, లైట్నింగ్ రెడ్, మూన్ షాడో వైట్, మిస్టిక్ బ్లాక్ కలర్స్ ఉన్నాయి. ఈ కలర్ వేరియంట్లు అన్నీ కస్టమర్లను మొదటి చూపులోనే ఆకట్టుకునేలా స్టైలిష్ గ్లాస్, మ్యాట్ ఫినిషింగ్‌తో రానున్నాయి.
Flipkart June Epic Sale : మోటరోలా లవర్స్‌కు ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. జూన్ ఎపిక్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
కళ్లు చెదిరే 1.5K OLED డిస్‌ప్లే, పవర్‌ఫుల్ ప్రాసెసర్..
ప్రముఖ చైనీస్ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ లీక్ చేసిన సమాచారం ప్రకారం.. హానర్ X80 ప్రో మాక్స్ లో 6.78 ఇంచుల భారీ 1.5K రిజల్యూషన్ (2788×1280 పిక్సెల్స్) కలిగిన అద్భుతమైన OLED డిస్‌ప్లేను అందించనున్నారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ప్రపంచంలోనే మొదటిసారిగా క్వాల్‌కామ్ సంస్థ సరికొత్త స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 చిప్‌సెట్‌తో ఈ ఫోన్ రన్ కానుంది. ఇది మల్టీటాస్కింగ్, హెవీ గేమింగ్‌ను చాలా స్మూత్‌గా హ్యాండిల్ చేస్తుంది.
బుల్లెట్ ప్రూఫ్ లాంటి ప్రొటెక్షన్, కెమెరా..
భద్రత, మన్నిక విషయంలో హానర్ ఈ ఫోన్‌ను అత్యంత బలంగా తయారు చేసింది. దీని బాడీ పూర్తిగా వాటర్‌ప్రూఫ్, డ్రాప్-రెసిస్టెంట్ టెక్నాలజీతో వస్తుంది. అంటే అనుకోకుండా ఫోన్ నీటిలో పడినా లేదా చేతిలో నుంచి కింద పడినా అంత సులభంగా పాడైపోదు. దీని కోసం కంపెనీ గోల్డ్-స్టాండర్డ్ డ్రాప్ ప్రొటెక్షన్‌ను అందించింది. అంతేకాకుండా ఒకవేళ స్క్రీన్ పగిలిపోతే ఉచితంగా స్క్రీన్ రీప్లేస్‌మెంట్ చేసే ప్రత్యేక సదుపాయాన్ని కూడా కస్టమర్లకు కల్పించనుంది. ఇక ఫొటోగ్రఫీ కోసం ఈ ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ పవర్‌ఫుల్ ప్రైమరీ కెమెరాను అమర్చారు, ఇది అత్యంత స్పష్టమైన ఫొటోలను క్యాప్చర్ చేస్తుంది. జూన్ 22న లాంచ్ అయిన తర్వాత దీని ఇండియన్ ఎంట్రీపై క్లారిటీ రానుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Amazon Great Indian Festival 2026: Gaming Headset Deals Under Rs. 5,000
Amazon Great Indian Festival 2026 Sale: Best Gaming Monitors Under Rs. 20,000
Amazon Great Indian Festival 2026: Best Power Bank Deals