Huge disoucnts in Flipkart June Epic Sale: మోటరోలా లవర్స్‌కు ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. జూన్ ఎపిక్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!

Huge disoucnts on Motorola Edge 60 Pro, Edge 60,Fusion G37 ower Flipkart June Epic Sale: స్టైలిష్ లుక్, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో అలరిస్తున్న Motorola Edge 60 Fusion మోడల్‌ను కేవలం రూ.27,999 ప్రారంభ ధరకే లిస్ట్ చేశారు.

Huge disoucnts in Flipkart June Epic Sale: మోటరోలా లవర్స్‌కు ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. జూన్ ఎపిక్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!

Flipkart June Epic Sale Motorola

ముఖ్యాంశాలు
  • ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో సంచలనం సృష్టిస్తున్న మొటొరొలా 5G ఫోన్లు!
  • మొటొరొలా ఎడ్జ్ 60 ప్రో పై ఏకంగా 7 వేల రూపాయల ఫ్లాట్ డిస్కౌంట్
  • యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌తో అదనపు ఊరట
ప్రకటన

Huge disoucnts in Flipkart June Epic Sale: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న జూన్ ఎపిక్ సేల్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా లైవ్‌లో ఉంది. ఈ ప్రత్యేకమైన సేల్‌లో శామ్‌సంగ్, షియోమీ, ఒప్పో, వీవో వంటి టాప్ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లను అందిస్తున్నారు. అయితే, ఈ సేల్‌లో అన్నింటికంటే ఆకర్షణీయమైన, బంపర్ డిస్కౌంట్లు  మోటరోలా కంపెనీ స్మార్ట్‌ఫోన్లపైనే లభిస్తుండటం విశేషం. కంపెనీకి చెందిన పాపులర్ జీ సిరీస్, ప్రీమియం ఎడ్జ్ సిరీస్ ఫోన్లను వేల రూపాయల తగ్గింపుతో సొంతం చేసుకునేందుకు ఇది కస్టమర్లకు ఒక సువర్ణావకాశం.

మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ పై క్రేజీ ఆఫర్
ఈ సేల్‌లో స్టైలిష్ లుక్, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో అలరిస్తున్న Motorola Edge 60 Fusion మోడల్‌ను కేవలం రూ.27,999 ప్రారంభ ధరకే లిస్ట్ చేశారు. దీనితో పాటు అదనపు సేవింగ్స్ కోసం కస్టమర్లకు అదిరిపోయే బ్యాంక్ ఆఫర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఎవరైనా కస్టమర్ ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే.. వారికి అదనంగా మరో రూ.1,400 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

ఎడ్జ్ 60 ఫ్యూజన్ అదిరిపోయే ఫీచర్లు
ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఫోన్‌లో 6.67 ఇంచుల అద్భుతమైన డిస్‌ప్లేను అందించారు. దీని వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ మెయిన్ కెమెరాతో కూడిన డ్యూయల్ లెన్స్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది, ఇది క్రిస్టల్ క్లియర్ ఫోటోలను క్లిక్ చేస్తుంది. కారులో ప్రయాణిస్తున్నప్పుడు లేదా ప్రయాణాల్లో ఉన్నప్పుడు నాన్‌స్టాప్ పవర్ బ్యాకప్ కోసం ఇందులో 5500mAh పవర్‌ఫుల్ బ్యాటరీని అమర్చారు. అలాగే ఫోన్ స్పీడ్‌గా రన్ అవ్వడం కోసం ఇందులో సరికొత్త ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు.
 

Flipkart June Epic Sale

Flipkart June Epic Sale में Motorola के स्मार्टफोन्स पर बम्पर डिस्काउंट दिया जा रहा है।
Photo Credit: Flipkart

మోటరోలా ఎడ్జ్ 60 ప్రో పై ఏకంగా 7 వేల తగ్గింపు
ఇక మోటరోలా ప్రీమియం విభాగంలో మోస్ట్ పాపులర్ అయిన Motorola Edge 60 Pro స్మార్ట్‌ఫోన్ (8GB ర్యామ్ + 256GB స్టోరేజ్) వేరియంట్‌ను ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కేవలం రూ.29,999 ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ అసలు ఎంఆర్‌పీ ధరతో పోలిస్తే ఏకంగా రూ.7,000 ఫ్లాట్ డిస్కౌంట్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. దీనికి తోడు మీ దగ్గర గనుక ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే.. మరో రూ.1,500 ఎక్స్‌ట్రా బ్యాంక్ డిస్కౌంట్‌ను కూడా సొంతం చేసుకోవచ్చు.

ఎడ్జ్ 60 ప్రో టాప్-ఎండ్ స్పెసిఫికేషన్లు
సాంకేతిక పరంగా ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లో 6.7 ఇంచుల సూపర్ హెచ్‌డీ+ 1.5K ప్రీమియం డిస్‌ప్లేను అందించారు, ఇది అద్భుతమైన విజువల్స్ అందిస్తుంది. ఈ ఫోన్ లోపల అత్యంత వేగవంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 8350 పవర్‌ఫుల్ ప్రాసెసర్‌ను అమర్చారు. ఫోటోగ్రఫీ ప్రియుల కోసం దీని వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. అలాగే, ఈ ఫోన్‌లో ఏకంగా 6000mAh భారీ బ్యాటరీ ఉండటం వల్ల ఛార్జింగ్ తిప్పలు పూర్తిగా తప్పుతాయి.

మోటరోలా జీ37 పవర్ పై ఏకంగా 15 వేల భారీ ప్రైస్ కట్
భారీ బ్యాటరీ ఫోన్ కోరుకునే వారి కోసం వచ్చిన  Motorola G37 Power (4GB ర్యామ్ + 128GB స్టోరేజ్) వేరియంట్‌ను ఈ సేల్‌లో కేవలం రూ.15,999 ధరకే అందిస్తున్నారు. ఈ ఫోన్ ఎంఆర్‌పీ ధరతో పోలిస్తే దాదాపు రూ.15,000 వరకు భారీ తగ్గింపు లభించడం విశేషం. దీనితో పాటు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా మరో రూ.800 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.

7000mAh రాక్షస బ్యాటరీ.. జీ37 పవర్ ప్రత్యేకతలు
ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌లో 6.6 ఇంచుల చక్కటి డిస్‌ప్లేను అందించారు. ఇది డైమెన్సిటీ 6400 పవర్‌ఫుల్ చిప్‌సెట్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. కెమెరా పరంగా వెనుక వైపు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ యొక్క అతిపెద్ద హైలైట్ ఏంటంటే ఇందులో అమర్చిన 7000mAh భారీ బ్యాటరీ. సాధారణ వినియోగదారులకు ఈ బ్యాటరీ బ్యాకప్ సులభంగా రెండు నుంచి మూడు రోజుల పాటు వస్తుంది. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, 5G కనెక్టివిటీ కావాలనుకునే వారికి ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇదొక బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »