Infinix Note 60 Pro launched with New Colors: ఇప్పటివరకు ఓషన్ బ్లూ, సోలార్ ఆరెంజ్, మోచా బ్రౌన్ కలర్లలో లభించిన ఈ ఫోన్.. ఇప్పుడు ఈ నయా లుక్‌తో మరింత రాయల్‌గా కనిపిస్తోంది
Photo Credit: Infinix
Infinix Note 60 Pro
Infinix Note 60 Pro Launched with New Colors: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ భారతదేశంలో ఇటీవలే లాంచ్ చేసిన తమ మోస్ట్ పాపులర్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రోలో కొత్త ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చింది. ప్రీమియమ్ మెటాలిక్ ఫినిషింగ్ కోరుకునే కస్టమర్ల కోసం ఫ్రాస్ట్ సిల్వర్, మిస్ట్ టైటానియం అనే రెండు సరికొత్త కలర్ వేరియంట్లను మార్కెట్లోకి ఆవిష్కరించింది. ఇప్పటివరకు ఓషన్ బ్లూ, సోలార్ ఆరెంజ్, మోచా బ్రౌన్ కలర్లలో లభించిన ఈ ఫోన్.. ఇప్పుడు ఈ నయా లుక్‌తో మరింత రాయల్‌గా కనిపిస్తోంది.
రూ.3,999 విలువైన మ్యాగ్‌పవర్ స్పీకర్ ఉచితం..
కొత్త రంగుల్లో వచ్చిన ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో ప్రారంభ ధరను రూ.33,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ రీటైల్ స్టోర్లలో విక్రయానికి అందుబాటులోకి వచ్చింది. లాంచ్ ఆఫర్ కింద ఈ ఫోన్ కొనుగోలు చేసే ప్రతి ఒక్కరికీ రూ. 3,999 విలువైన మ్యాగ్‌పవర్ స్పీకర్‌ను ఉచితంగా అందిస్తున్నారు. దీనితో పాటు ఏకంగా 18 నెలల ఉచిత గూగుల్ జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్, 5TB ఉచిత గూగుల్ క్లౌడ్ స్టోరేజ్, సులభమైన నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కస్టమర్లకు కల్పిస్తున్నారు.
144Hz 1.5K AMOLED డిస్‌ప్లే, 50MP OIS కెమెరా..
ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. ఈ డివైజ్ 6.78 అంగుళాల Active Matrix 1.5K AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. గేమింగ్, వీక్షణ అనుభూతిని వేరే లెవెల్‌కి తీసుకెళ్లడానికి ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందించారు. డిస్‌ప్లే రక్షణ కోసం అత్యంత బలమైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను ఉపయోగించారు.
JBL Vienna Speaker : మ్యూజిక్ ప్లే అవుతుంటే గాల్లో తేలాడే పాటల లిరిక్స్.. స్పీకర్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్
స్నాప్‌డ్రాగన్ 7s Gen 4 ప్రాసెసర్, 6500mAh భారీ బ్యాటరీ..
ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో స్మార్ట్‌ఫోన్ వేగవంతమైన స్నాప్‌డ్రాగన్ 7s Gen 4 ప్రాసెసర్, అడ్రినో జిపియుతో పనిచేస్తుంది. ఇందులో 8GB RAM, 256GB వరకు అంతర్గత స్టోరేజ్ సపోర్ట్ ఉంది. ఆపరేటింగ్ సిస్టమ్ పరంగా ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 పై రన్ అవుతుంది. ఫొటోగ్రఫీ కోసం వెనుక వైపు f/1.59 అపార్చర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అమర్చారు.
90W ఫాస్ట్ ఛార్జింగ్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్..
ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో ఫోన్‌కి అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని 6,500 mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీ. దీనిని వేగంగా ఛార్జ్ చేయడానికి 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 30W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కంపెనీ అందించింది. సెక్యూరిటీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు. తక్కువ బడ్జెట్‌లో ఆల్ రౌండ్ ఫ్లాగ్‌షిప్ అనుభవాన్ని, మెటాలిక్ రాయల్ లుక్‌ను కోరుకునే వినియోగదారులకు ఈ కొత్త ఫ్రాస్ట్ సిల్వర్, మిస్ట్ టైటానియం ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో బెస్ట్ ఆప్షన్‌గా నిలవనుంది.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,590
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹41,061
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999