ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో పినిన్‌ఫారినా ఎడిషన్ రేసింగ్ కార్ డిజైన్, స్నాప్‌డ్రాగన్ 7s జెн 4 ప్రాసెసర్, 6500mAh బ్యాటరీతో భారత్‌లో జూన్ 24న లాంచ్ అయింది.
Photo Credit: Infinix Note 60 Pro Pininfarina Edition
Infinix Note 60 Pro Pininfarina Edition
Infinix : భారతీయ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఇన్ఫినిక్స్ బ్రాండ్ సరికొత్త సరిహద్దులను బద్దలు కొడుతోంది. ఇటీవల దేశీయ మార్కెట్లో విడుదలైన సక్సెస్‌ఫుల్ మోడల్ ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రోకు కొనసాగింపుగా, కంపెనీ ఇవాళ (జూన్ 24) సరికొత్త పినిన్‌ఫారినా ఎడిషన్‌ను అధికారికంగా విడుదల చేసింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఇటాలియన్ లగ్జరీ కార్ డిజైనింగ్ హౌస్ పినిన్‌ఫారినాతో కలిసి ఇన్ఫినిక్స్ ఈ స్పెషల్ ఎడిషన్ మొబైల్‌ను రూపొందించింది. ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రోసైట్ కూడా అందుబాటులోకి వచ్చింది.
ఈ సరికొత్త పినిన్‌ఫారినా ఎడిషన్ డిజైన్ పరంగా కస్టమర్లను మొదటి చూపులోనే కట్టిపడేస్తోంది. దీని బ్యాక్ ప్యానెల్‌కు ప్రీమియం కార్బన్ ఫైబర్ ఫినిషింగ్‌ను అందించారు. అలాగే ఫోన్ చుట్టూ 360 డిగ్రీల ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్‌ను వాడారు. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఇందులో అత్యంత శక్తివంతమైన 4 నానోమీటర్ ఆర్కిటెక్చర్‌పై తయారైన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. వినూత్నంగా ఈ ఫోన్ కుడి వైపున వినియోగదారుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు ఒక ప్రత్యేకమైన హెల్త్ మానిటరింగ్ సెన్సార్‌ను అమర్చడం విశేషం.
వినియోగదారులకు అద్భుతమైన ఆడియో అనుభూతిని అందించడం కోసం ఇందులో జేబీఎల్ ద్వారా ట్యూన్ చేయబడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లను అందించారు. డిస్‌ప్లే పరంగా ఇందులో 144Hz హై రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేసే 1.5K అమోలెడ్ స్క్రీన్‌ను చేర్చారు. ఈ స్క్రీన్‌కు గట్టి రక్షణ కల్పించేందుకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను వాడారు. అలాగే రెగ్యులర్ మోడల్ లాగే దీని వెనుక భాగంలో కూడా సమయం, నోటిఫికేషన్లు చూసుకోవడానికి వీలుగా యాక్టివ్ మ్యాట్రిక్స్ సెకండరీ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.
Coolpad : మార్కెట్లోకి కూల్‌ప్యాడ్ కొత్త బడ్జెట్ ఫోన్.. ఐఫోన్ లాంటి అదిరిపోయే డిజైన్‌తో కూల్ 80 లాంచ్
హెవీ గేమింగ్ లేదా మల్టీటాస్కింగ్ చేసేటప్పుడు ఫోన్ అస్సలు వేడెక్కకుండా ఉండేందుకు ఇందులో 3D ఐస్ కూల్ వేపర్ ఛాంబర్ కూలింగ్ టెక్నాలజీని అమర్చారు. కెమెరా విభాగంలో వెనుక వైపు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉన్న 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. బ్యాటరీ విషయానికి వస్తే.. ఇందులో ఏకంగా 6,500 mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చారు. ఇది 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 30W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది.
ఇదే నెల ప్రారంభంలో ఇన్ఫినిక్స్ కంపెనీ తమ సరికొత్త బడ్జెట్ మొబైల్ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20ని కూడా భారత్‌లో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ ఫీచర్లు చూస్తే.. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న 6.78 ఇంచుల ఐపీఎస్ ఎల్‌సీడీ హెచ్‌డీ ప్లస్ స్క్రీన్‌ను అందించారు. ఇది ఆండ్రాయిడ్ 16 బేస్డ్ XOS 16 పై రన్ అవుతుంది. ఇందులో మీడియాటెక్ హీలియో G81 అల్టిమేట్ ప్రాసెసర్‌తో పాటు మాలీ G52 జీపీయూ కలదు. ఈ బడ్జెట్ ఫోన్‌లో వెనుక వైపు 8MP కెమెరా, ముందు వైపు 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. అలాగే 15W ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న 5,200mAh బ్యాటరీని ఇందులో చేర్చారు. మిడ్-రేంజ్, బడ్జెట్ సెగ్మెంట్లలో ఇన్ఫినిక్స్ ఫోన్ల సేల్స్ ఇండియాలో ప్రస్తుతం విపరీతంగా పెరుగుతున్నాయి.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,590
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹41,061
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999