Smartphone Comparison : రూ.13 వేల బడ్జెట్‌లో ఏ ఫోన్ బెస్ట్?.. ఇన్‌ఫినిక్స్, లావా, రెడ్‌మిల మధ్య అసలైన పోటీ

ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 20 రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,499 కాగా, 4GB RAM + 128GB మోడల్ ధర రూ.13,999గా ఉంది.

Smartphone Comparison : రూ.13 వేల బడ్జెట్‌లో ఏ ఫోన్ బెస్ట్?.. ఇన్‌ఫినిక్స్, లావా, రెడ్‌మిల మధ్య అసలైన పోటీ

Photo Credit: Infinix/Lava/Xiaomi

Infinix Smart 20 vs Lava Bold N2 5G vs Redmi A7 Pro

ముఖ్యాంశాలు
  • ఇన్‌ఫినిక్స్, లావా, రెడ్‌మిల మధ్య అసలైన పోటీ!
  • లావా ఫోన్‌లో 6000mAh బ్యాటరీ
  • లావా, రెడ్‌మి ఫోన్లలో 13 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్!
ప్రకటన

Smartphone Comparison : భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రస్తుతం రూ.12 వేల నుంచి రూ.14 వేల బడ్జెట్ రేంజ్‌లో పోటీ చాలా తీవ్రంగా మారింది. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్ ఇటీవల మార్కెట్లోకి తెచ్చిన ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 20 మోబైల్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. ఇప్పటికే మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న లావా బోల్డ్ N2 5G, రెడ్‌మి A7 ప్రో  ఫోన్లతో ఇది తలపడుతోంది. అన్నీ కూడా తక్కువ ధరలోనే కస్టమర్లకు అదిరిపోయే ఫీచర్లు ఇస్తామని ఆఫర్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూడు స్మార్ట్‌ఫోన్ల ధరలు, స్పెసిఫికేషన్లు కంపారిజన్ చేసి తెలుసుకుందాం.

జేబుకు చిల్లు పడకుండా ధరల వివరాలు
మొదటగా ఈ ఫోన్ల ధరల విషయానికి వస్తే.. ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 20 రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,499 కాగా, 4GB RAM + 128GB మోడల్ ధర రూ.13,999గా ఉంది. ఇక దేశీయ బ్రాండ్ అయిన లావా బోల్డ్ N2 5G లోని 4GB RAM + 64GB వేరియంట్ అసలు ధర రూ.12,999 అయినప్పటికీ, స్పెషల్ లాంచ్ ఆఫర్ కింద దీనిని రూ.11,999 కే సొంతం చేసుకోవచ్చు. మరోవైపు వీటికి పోటీగా ఉన్న రెడ్‌మి A7 ప్రో ఫోన్ 4GB RAM + 64GB సింగిల్ వేరియంట్ ధర రూ.12,499గా నిర్ణయించారు. బడ్జెట్ పరంగా చూస్తే లావా ఫోన్ కాస్త తక్కువ ధరకు లభిస్తోంది.

కళ్లు చెదిరే పెద్ద డిస్‌ప్లేలు
ఫోన్ స్క్రీన్ పరంగా చూస్తే మూడు బ్రాండ్లు కూడా పెద్ద డిస్‌ప్లేలనే ఇచ్చాయి. ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 20 లో 6.78 ఇంచుల IPS LCD HD+ స్క్రీన్ ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 700 నిట్స్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇక లావా బోల్డ్ N2 5G ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.75 ఇంచుల HD+ నాచ్ డిస్‌ప్లేతో వస్తుంది. అయితే వీటన్నింటికంటే పెద్ద స్క్రీన్‌తో రెడ్‌మి A7 ప్రో నిలిచింది. ఇందులో 6.9 ఇంచుల భారీ HD+ IPS LCD డిస్‌ప్లేను అమర్చారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు గేమింగ్‌కు వీలుగా 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది.

పవర్‌ఫుల్ ప్రాసెసర్లు, లేటెస్ట్ ఓఎస్
పర్ఫార్మెన్స్ విషయంలో ఈ మూడు ఫోన్లు వేర్వేరు చిప్‌సెట్లతో పనిచేస్తాయి. ఇన్‌ఫినిక్స్ ఫోన్‌లో ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G81 అల్టిమేట్  ప్రాసెసర్‌ను వాడారు. అదే సమయంలో లావా 5G ఫోన్‌లో పవర్‌ఫుల్ ఆక్టా-కోర్ 6nm యూనిసోక్ T8200 చిప్‌సెట్ ఉంది. ఇక రెడ్‌మి ఫోన్ విషయానికి వస్తే.. ఇందులో ఆక్టా-కోర్ యూనిసోక్ T7250 12nm ప్రాసెసర్‌ను ఇచ్చారు. సాఫ్ట్‌వేర్ పరంగా మూడు ఫోన్లు కూడా లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తోనే పనిచేస్తాయి. ఇన్‌ఫినిక్స్ ఫోన్ ఎక్స్ ఓఎస్ 16తో రాగా, రెడ్‌మి ఫోన్ షావోమి సరికొత్త హైపర్ ఓఎస్ 3తో కస్టమర్లను ఆకట్టుకుంటోంది.


New Smartphones : భారత మార్కెట్లో మొబైల్స్ జాతర.. ఈ వారంలో లాంచ్ అవుతున్న 4 సూపర్ స్మార్ట్‌ఫోన్లు

ఛార్జింగ్ టెన్షన్ లేని భారీ బ్యాటరీలు
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ కొనేవారికి బ్యాటరీ లైఫ్ చాలా ముఖ్యం. ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 20 లో 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5200mAh బ్యాటరీని ఇచ్చారు. కాగా, లావా బోల్డ్ N2 5G ఫోన్ అంతకంటే పెద్దదైన 6000mAh బ్యాటరీతో వస్తుంది, ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అయితే బ్యాటరీ రేసులో వీటన్నింటినీ వెనక్కి నెడుతూ రెడ్‌మి A7 ప్రో ఏకంగా 6300mAh భారీ బ్యాటరీని తన కస్టమర్లకు అందిస్తోంది. దీనికి 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే ఈ ఫోన్లు చాలా సులభంగా రెండు రోజుల పాటు బ్యాకప్ ఇస్తాయి.

కెమెరా, కనెక్టివిటీ ఫీచర్లు
ఫోటోల విషయానికి వస్తే.. ఇన్‌ఫినిక్స్ ఫోన్ వెనుక వైపు f/2.0 అపెర్చర్‌తో 8 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ముందు వైపు సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. అదే లావా ఫోన్‌లో వెనుక వైపు 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ముందు వైపు 5 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ఇక రెడ్‌మి A7 ప్రో లో వెనుక వైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, ఇందులో 13 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు. కనెక్టివిటీ పరంగా ఇన్‌ఫినిక్స్, లావా ఫోన్లు లేటెస్ట్ 5G నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుండగా, రెడ్‌మి ఫోన్ మాత్రం డ్యూయల్ 4G VoLTE సపోర్ట్‌తోనే వస్తుంది. యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి ఫీచర్లు మూడింటిలోనూ కామన్‌గా ఉన్నాయి. కాబట్టి 5G, పెద్ద బ్యాటరీ కావాలనుకునే వారు లావా లేదా ఇన్‌ఫినిక్స్ వైపు మొగ్గు చూపవచ్చు.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »