కొత్తగా వచ్చిన ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 20 మొబైల్ 4GB+64GB వేరియంట్ ధర రూ.12,499గా ఉండగా.. దీని 4GB+128GB మోడల్ ధర రూ.13,999గా ఉంది.
Photo Credit: Infinix/Motorola/Realme
Infinix Smart 20 vs Moto G37 vs Realme P4 Lite 5G
Budget Smartphones : భారతదేశ మొబైల్ మార్కెట్లో తక్కువ ధరలో మంచి ఫీచర్లు కోరుకునే కస్టమర్ల కోసం ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్ తన సరికొత్త సిరీస్ ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 20ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రాకతో ఇప్పటికే బడ్జెట్ విభాగంలో మంచి సేల్స్ సాధిస్తున్న మోటో జి37, రియల్‌మీ పి4 లైట్ 5జీ ఫోన్లకు గట్టి పోటీ ఎదురుకానుంది. ఈ మూడు బ్రాండ్లు కూడా తక్కువ ధరలోనే కస్టమర్లను ఆకర్షించేందుకు వేర్వేరు ఫీచర్లతో తలపడుతున్నాయి.
ధరల విషయానికి వస్తే ఏది బెస్ట్?
కొత్తగా వచ్చిన ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 20 మొబైల్ 4GB+64GB వేరియంట్ ధర రూ.12,499గా ఉండగా.. దీని 4GB+128GB మోడల్ ధర రూ.13,999గా ఉంది. దీనికి పోటీగా ఉన్న రియల్‌మీ పి4 లైట్ 5జీ బేస్ మోడల్ (4GB+64GB) ధర రూ.12,999, టాప్ మోడల్ (4GB+128GB) ధర రూ.13,999గా నిర్ణయించారు. అయితే మోటో జి37 విషయానికి వస్తే ఇందులో కేవలం ఒకే ఒక్క వేరియంట్ (4GB+64GB) మాత్రమే అందుబాటులో ఉంది, దీని ధర రూ.13,999గా కంపెనీ నిర్ణయించింది. ధరల పరంగా చూస్తే ఇన్‌ఫినిక్స్ ప్రారంభ మోడల్ మిగిలిన వాటి కంటే కాస్త తక్కువకే లభిస్తోంది.
స్క్రీన్ క్వాలిటీ, డిస్‌ప్లే ఫీచర్లు
డిస్‌ప్లే పరంగా చూస్తే రియల్‌మీ పి4 లైట్ 5జీ అందరికంటే ఒక అడుగు ముందే ఉంది. ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.8 ఇంచుల హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు, ఇది 900 నిట్స్ బ్రైట్‌నెస్‌ను ఇస్తుంది. ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 20లో 120Hz రిఫ్రెష్ రేట్ గల 6.78 ఇంచుల ఐపీఎస్ ఎల్‌సీడీ హెచ్‌డీ ప్లస్ స్క్రీన్‌ను ఇచ్చారు, ఇది 700 నిట్స్ హై బ్రైట్‌నెస్‌తో వస్తుంది. అటు మోటో జి37లో 6.7 ఇంచుల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ స్క్రీన్ ఉంది, దీని రిఫ్రెష్ రేట్ కూడా 120Hz కాగా.. ఇది ఏకంగా 1050 నిట్స్ హై బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. ఎండలో ఫోన్ వాడేవారికి మోటో స్క్రీన్ బాగా కనిపిస్తుంది, కానీ స్మూత్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ కోసం రియల్‌మీ బెస్ట్ ఆప్షన్.
ప్రాసెసర్, ఆపరేటింగ్ సిస్టమ్ పవర్
ఈ మూడు స్మార్ట్‌ఫోన్లు కూడా లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగానే పని చేస్తాయి. ఇన్‌ఫినిక్స్ ఫోన్ ఎక్స్ఓఎస్ 16 స్కిన్‌తో రాగా.. రియల్‌మీ ఫోన్ రియల్‌మీ యూఐ 7.0తో రన్ అవుతుంది. మోటో మాత్రం ప్యూర్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 20 లో ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో జీ81 అల్టిమేట్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. మోటో జి37 లో పవర్‌ఫుల్ ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్ ఉండగా.. రియల్‌మీ పి4 లైట్ 5జీ లో ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను అమర్చారు. స్పీడ్ పరంగా మోటో, రియల్‌మీ ఫోన్లు ఇన్‌ఫినిక్స్ కంటే కాస్త మెరుగ్గా పనిచేస్తాయి.
Instagram : ఇన్‌స్టాగ్రామ్‌లో పెను సంచలనం.. మెటా ఏఐ సిస్టమ్ లోపంతో 20 వేల అకౌంట్లు హ్యాక్!
బ్యాటరీ, ఛార్జింగ్ కెపాసిటీ
ఈ పోరాటంలో బ్యాటరీ విభాగంలో రియల్‌మీ పి4 లైట్ 5జీ అందరి మైండ్ బ్లాక్ చేస్తోంది. రియల్‌మీ ఫోన్ లో ఏకంగా 7000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని ఇచ్చారు, ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఒకసారి ఛార్జింగ్ పెడితే రెండు మూడు రోజుల వరకు బ్యాటరీ గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఇక ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 20 లో 15W ఫాస్ట్ ఛార్జింగ్ గల 5200mAh బ్యాటరీని అందించారు. మోటో జి37 లో కూడా 5200mAh బ్యాటరీ ఉన్నప్పటికీ.. ఇది అందరికంటే వేగంగా ఛార్జ్ అయ్యేలా 20W టర్బోఛార్జింగ్‌తో పాటు ఇతర డివైజ్‌లను ఛార్జ్ చేసుకునేలా 6W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంది.
కెమెరా, కనెక్టివిటీ ఆప్షన్లు
ఫోటోలు తీసుకునే వారికి మోటో జి37 ఒక అద్భుతమైన వరం అని చెప్పొచ్చు. ఎందుకంటే మోటో వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 2-ఇన్-1 లైట్ సెన్సార్‌ను ఇచ్చారు. సెల్ఫీల కోసం 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 20 లో వెనుక, ముందు రెండు వైపులా కూడా 8 మెగాపిక్సెల్ కెమెరాలనే అందించారు. రియల్‌మీ లో వెనుక 13 మెగాపిక్సెల్ కెమెరా, ముందు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా మూడు ఫోన్లలోనూ 5జీ, వైఫై, బ్లూటూత్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, 3.5mm ఆడియో జాక్ వంటి అన్ని రకాల ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరలో ఎక్కువ స్టోరేజ్ కావాలనుకుంటే ఇన్‌ఫినిక్స్, ఎక్కువ బ్యాటరీ కావాలంటే రియల్‌మీ, మంచి కెమెరా కావాలంటే మోటో జి37 ని ఎంచుకోవచ్చు.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,590
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹41,061
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999