ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ రికవరీ కోసం మెటా రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సిస్టమ్‌లో ఉన్న ఒక పెద్ద లోపాన్ని వాడుకుని, హ్యాకర్లు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 20 వేల కంటే ఎక్కువ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను హ్యాక్ చేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
Photo Credit: Pexels/ Solen Feyissa
Meta के AI रिकवरी सिस्टम की खामी से हजारों Instagram अकाउंट प्रभावित हुए
Instagram : సోషల్ మీడియా దిగ్గజం మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక షాకింగ్ సైబర్ సెక్యూరిటీ మోసం వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ రికవరీ కోసం మెటా రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సిస్టమ్‌లో ఉన్న ఒక పెద్ద లోపాన్ని వాడుకుని, హ్యాకర్లు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 20 వేల కంటే ఎక్కువ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను హ్యాక్ చేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. లాక్ అయిన అకౌంట్లను ఈజీగా రికవర్ చేయడానికి తీసుకొచ్చిన హై టచ్ సపోర్ట్(HTS) టూల్లోనే ఈ ఘోరమైన లోపం బయటపడటంతో మెటా యాజమాన్యం తలపట్టుకుంది.
మే నెలలోనే వెలుగులోకి వచ్చిన డేటా బ్రీచ్
గత కొన్ని వారాలుగా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు తమ అకౌంట్లు లాక్ అయిపోతున్నాయని, లాగిన్ అవ్వడం కుదరడం లేదని వరుస ఫిర్యాదులు చేశారు. ఈ వ్యవహారంపై ప్రముఖ టెక్ మీడియా బ్లీపింగ్ కంప్యూటర్ ఒక పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది. మెటా సంస్థ అమెరికాలోని మైనే ఆఫీస్ ఆఫ్ ది అటార్నీ జనరల్‌కు పంపిన అధికారిక డేటా బ్రీచ్ నోటిఫికేషన్‌లో ఈ ఘోర భద్రతా లోపాన్ని అంగీకరించింది. మే 31, 2026న కంపెనీకి ఈ లూప్‌హోల్ గురించి తెలిసిందని, అయితే హ్యాకర్లు అంతకంటే ముందే అంటే ఏప్రిల్ 17, 2026 ప్రాంతంలోనే మొదటిసారిగా ఈ ఏఐ సిస్టమ్‌ను హ్యాక్ చేయడంలో సక్సెస్ అయ్యారని మెటా దర్యాప్తులో తేలింది.
ఏఐ బాట్‌ను బురిడీ కొట్టించిన హ్యాకర్లు
ఈ మెగా హ్యాకింగ్‌కు సంబంధించిన మరికొన్ని సంచలన నిజాలను 404 మీడియా తన రిపోర్టులో బయటపెట్టింది. ఇన్‌స్టాగ్రామ్ తెచ్చిన అధునాతన హెచ్‌టీఎస్ (HTS) సిస్టమ్.. అకౌంట్ రికవరీ ప్రాసెస్‌లో యూజర్లు ఇచ్చే కొత్త ఈమెయిల్ అడ్రస్ నిజంగా ఆ పాత అకౌంట్‌కు లింక్ అయి ఉందో లేదో సరిగ్గా వెరిఫై చేయలేకపోయింది. ఈ చిన్న టెక్నికల్ లోపాన్ని హ్యాకర్లు క్యాచ్ చేశారు. హ్యాకర్లు క్రియేట్ చేసిన ఫేక్ ఈమెయిల్ అడ్రస్‌లను నిజమైనవని నమ్మేలా వారు ఇన్‌స్టాగ్రామ్ ఏఐ సపోర్ట్ బాట్‌ను మాయం చేశారు. దాంతో ఆ ఏఐ బాట్.. హ్యాకర్లు అడిగిందే తడవుగా పాస్‌వర్డ్ రీసెట్ లింకులను వారి ఈమెయిల్స్ కే పంపేసింది. ఆ లింకుల సహాయంతో హ్యాకర్లు ఒరిజినల్ యూజర్ల అకౌంట్లను హైజాక్ చేశారు.
ప్రముఖుల అకౌంట్లు కూడా మాయం
ఈ భారీ సైబర్ దాడి ప్రభావం కేవలం సాధారణ ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుల పైనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సెలబ్రిటీలు, పెద్ద పెద్ద అధికారిక అకౌంట్ల పైనా పడింది. హ్యాకర్ల చేతికి చిక్కిన వాటిలో మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు చెందిన వైట్ హౌస్ అకౌంట్, అంతర్జాతీయ బ్యూటీ బ్రాండ్ సెఫోరా అఫీషియల్ అకౌంట్, అమెరికా డిఫెన్స్ విభాగానికి చెందిన చీఫ్ మాస్టర్ సార్జెంట్ ఆఫ్ స్పేస్ ఫోర్స్ వంటి హై-ప్రొఫైల్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలు కూడా ఉండటం సైబర్ భద్రతా లోపానికి అద్దం పడుతోంది. ఎవరి అకౌంట్లలో అయితే టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA) ఆన్ చేసి లేదో.. ఆ అకౌంట్లను హ్యాకర్లు చాలా సులభంగా లేపేశారు.
పర్సనల్ డేటా మొత్తం హ్యాకర్ల చేతిలోకి
ఈ హ్యాకింగ్ ద్వారా యూజర్లకు చెందిన ఏయే డేటాను హ్యాకర్లు దొంగిలించారనే దానిపై మెటా సంస్థ ఇంకా ఒక ఖచ్చితమైన స్పష్టతకు రాలేకపోతోంది. అయినప్పటికీ, హ్యాక్ అయిన ఆ 20 వేల అకౌంట్ల లోని ప్రైవేట్ ఈమెయిల్ అడ్రస్‌లు, ఫోన్ నంబర్లు, యూజర్ల పుట్టిన తేదీలు, ప్రొఫైల్ వివరాలు, వారు పోస్ట్ చేసిన ఫోటోలు, వీడియోలు, ఇన్‌స్టా స్టోరీలు, అన్నింటికంటే ముఖ్యంగా పర్సనల్ డైరెక్ట్ మెసేజ్‌లు (DMs), అకౌంట్ యాక్టివిటీ మరియు ఇన్‌స్టాగ్రామ్‌తో లింక్ అయి ఉన్న ఇతర థర్డ్ పార్టీ అప్లికేషన్ల డేటా మొత్తం లీక్ అయిపోయే ప్రమాదం ఉందని మెటా ఆందోళన వ్యక్తం చేసింది.
సపోర్ట్ సిస్టమ్ బంద్.. మెటా కొత్త ఆంక్షలు
ఈ లూప్‌హోల్ దెబ్బకు అలర్ట్ అయిన మెటా యాజమాన్యం.. తక్షణ రక్షణ చర్యల్లో భాగంగా ఇన్‌స్టాగ్రామ్ ఏఐ ఆధారిత హెచ్‌టీఎస్ రికవరీ సిస్టమ్‌ను తాత్కాలికంగా పూర్తిగా క్లోజ్ చేసింది. ఈ టూల్ ద్వారా అంతకుముందు జనరేట్ అయిన అన్ని రకాల పాస్‌వర్డ్ రీసెట్ లింకులను చెల్లకుండా బ్లాక్ చేసింది. అంతేకాకుండా, అనుమానాస్పదంగా ఉన్న అకౌంట్ల కోసం అదనపు సెక్యూరిటీ వెరిఫికేషన్ స్టెప్స్ ప్రవేశపెట్టింది. బాధితులైన యూజర్లందరూ ఖచ్చితంగా తమ పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలని స్పష్టం చేసింది. ఈమెయిల్ వెరిఫికేషన్ ప్రక్రియను వంద శాతం పటిష్టం చేసిన తర్వాతే ఈ ఏఐ సపోర్ట్ సిస్టమ్‌ను మళ్లీ రీ-స్టార్ట్ చేస్తామని, అప్పటివరకు ఇతర రికవరీ ఆప్షన్లను కూడా రీ-రివ్యూ చేస్తున్నామని మెటా పేర్కొంది.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Amazfit Cheetah 2 Ultra
Starts from ₹54,999
JBL Tune 780NC Wireless Headphones
Starts from ₹7,999
iQOO 16 Renders Leaked Again; Could Feature New Rear Camera Design
Huawei Watch 6 and Watch 6 Pro Announced at IFA 2026; Watch GT 7 and GT 7 Pro Tag Along