Apple : మార్కెట్లోకి యాపిల్ మొదటి ఫోల్డబుల్ ఐఫోన్.. అల్ట్రా మోడల్ కలర్స్, అదిరిపోయే ఫీచర్స్ లీక్

Apple could adopt a conservative colour scheme for its first foldable smartphone, similar to its iPhone X strategy.

Apple : మార్కెట్లోకి యాపిల్ మొదటి ఫోల్డబుల్ ఐఫోన్.. అల్ట్రా మోడల్ కలర్స్, అదిరిపోయే ఫీచర్స్ లీక్

The foldable iPhone is rumoured to have similar dimensions as Pixel Fold (pictured)

ముఖ్యాంశాలు
  • మార్కెట్లోకి యాపిల్ మొదటి ఫోల్డబుల్ ఐఫోన్
  • ఐఫోన్ అల్ట్రా క్రేజీ ఫీచర్స్ లీక్
  • గేమింగ్ ఆడినా అస్సలు హీట్ అవ్వకుండా చాలా కూల్‌గా పనిచేస్తుంది
ప్రకటన

Apple : ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ మొబైల్ రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపబోతోంది. స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాపిల్ మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్ ఈ ఏడాది చివర్లో మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఐఫోన్ 18 ప్రో లైనప్‌తో పాటు ఈ ఫోల్డబుల్ ఫోన్ కూడా గ్రాండ్‌గా లాంచ్ కానుందని టెక్ వర్గాల సమాచారం. ఈ అద్భుతమైన హ్యాండ్‌సెట్‌ను యాపిల్ సంస్థ ఐఫోన్ అల్ట్రా అనే పేరుతో పిలవబోతున్నట్లు లీక్‌ల ద్వారా తెలుస్తోంది. తాజాగా ఈ ఫోల్డబుల్ ఐఫోన్ కలర్ ఆప్షన్స్, డిజైన్, హీటింగ్ సమస్యలు రాకుండా వాడే సరికొత్త కూలింగ్ సిస్టమ్ వివరాలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.  

వైట్ ఫినిషింగ్‌లో మెరిసిపోతున్న ఐఫోన్ అల్ట్రా  
ప్రముఖ చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్  వైబోలో లీక్‌స్టర్ ఐస్ యూనివర్స్ షేర్ చేసిన సమాచారం ప్రకారం.. యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్‌కు సంబంధించిన ఒక ఫోటో బయటకు వచ్చింది. ఈ లీకైన పిక్చర్‌లో ఫోన్ అద్భుతమైన వైట్ కలర్ ఫినిషింగ్‌తో మెరిసిపోతూ కనిపిస్తోంది. ఈ ఇమేజ్ ఎంతవరకు నిజమనేది యాపిల్ అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఐఫోన్ అల్ట్రా డిజైన్ ఎలా ఉండబోతుందనే దానిపై యాపిల్ ఫ్యాన్స్‌కు ఇదొక ముందస్తు ఐడియాను ఇచ్చిందని చెప్పవచ్చు.

మరో ఇంట్రెస్టింగ్ కలర్ ఆప్షన్ కూడా 
మరో ప్రముఖ లీక్‌స్టర్ ఇన్‌స్టంట్ డిజిటల్ చెబుతున్న దాని ప్రకారం.. ప్రస్తుతం యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ కోసం కేవలం వైట్ కలర్ మాత్రమే ఖరారైంది. అయితే సప్లై చైన్ నుంచి అందుతున్న మరికొన్ని నివేదికల ప్రకారం యాపిల్ సంస్థ రెండో కలర్ ఆప్షన్‌ను కూడా టెస్ట్ చేస్తోందని టాక్. గతంలో వచ్చిన ఐఫోన్ 17 ప్రో డీప్ బ్లూ కలర్ తరహాలోనే, ఈ ఫోల్డబుల్ ఫోన్ కోసం ఇండిగో కలర్‌ను కూడా యాపిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

యాపిల్ పాత ఫార్ములానే ఫాలో అవ్వనుందా?  
బ్లూమ్‌బెర్గ్ ప్రముఖ విశ్లేషకులు మార్క్ గుర్మాన్ అభిప్రాయం ప్రకారం.. యాపిల్ తన మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ కోసం కలర్స్ విషయంలో పెద్దగా ప్రయోగాలు చేయకపోవచ్చు. గతంలో సూపర్ హిట్ అయిన ఐఫోన్ ఎక్స్ స్ట్రాటజీనే ఇక్కడ కూడా వాడే అవకాశం ఉంది. అంటే సాంప్రదాయకంగా మార్కెట్లో ఎక్కువ మంది ఇష్టపడే సిల్వర్, వైట్, బ్లాక్,స్పేస్ గ్రే వంటి క్లాసిక్ లుక్ ఇచ్చే కలర్ ఆప్షన్స్ లోనే ఈ ఫోల్డబుల్ ఫోన్ అందుబాటులోకి రానుందని ఆయన అంచనా వేస్తున్నారు.

Xiaomi : జూన్ 4న Xiaomi 17T లాంచ్.. 6,500mAh బ్యాటరీ, లైకా కెమెరాలతో అరాచకమైన ఫీచర్స్

ఫోన్ అస్సలు వేడెక్కదు.. వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ 
 ఫిక్స్డ్ ఫోకస్ డిజిటల్ అనే మరో లీక్‌స్టర్ ఐఫోన్ అల్ట్రాకు సంబంధించిన ఒక క్రేజీ ఫీచర్‌ను బయటపెట్టారు. ఈ ఫోల్డబుల్ ఐఫోన్‌లో పవర్‌ఫుల్ వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను యాపిల్ అమర్చబోతోందట. దీనివల్ల ఫోన్ ఎంత ఎక్కువ వాడినా, గేమింగ్ ఆడినా అస్సలు హీట్ అవ్వకుండా చాలా కూల్‌గా పనిచేస్తుందని, యాపిల్ ఈ థర్మల్ ఇంజనీరింగ్ కోసం భారీగా ఖర్చు చేస్తోందని లీక్‌స్టర్ పేర్కొన్నారు.

యాపిల్ లైనప్‌లో మూడో ఫోన్ ఇదే 
ఒకవేళ ఈ వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ వార్త నిజమైతే.. యాపిల్ మొబైల్స్ లో ఈ టెక్నాలజీతో వస్తున్న మూడో ఫోన్‌గా ఐఫోన్ అల్ట్రా రికార్డు సృష్టిస్తుంది. గత సెప్టెంబర్ 2025 లో లాంచైన ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ మోడల్స్ లో మొదటిసారి ఈ వీసీ కూలింగ్ సిస్టమ్‌ను యాపిల్ పరిచయం చేసింది. ఇది పవర్‌ఫుల్ A19 ప్రో చిప్ నుంచి వచ్చే వేడిని డీఅయోనైజ్డ్ వాటర్ ఎవాపరేషన్ ప్రాసెస్ ద్వారా తగ్గించి, ఫోన్ టెంపరేచర్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది.

ఉత్పత్తిలో సవాళ్లు.. కానీ లాంచ్ డేట్ మారదు 
ప్రస్తుతం ప్రీ-అసెంబ్లీ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న యాపిల్ ఫోల్డబుల్ హ్యాండ్‌సెట్ తయారీ ప్రక్రియ కొన్ని సాంకేతిక సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు లీక్‌స్టర్ వెల్లడించారు. ఐనప్పటికీ ఫోన్ లాంచ్ అయ్యే టైమ్‌లైన్‌లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో జరగబోయే మెగా ఈవెంట్‌లో ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ మోడల్స్ తో పాటే ఈ మోస్ట్ అవేటెడ్ ఐఫోన్ అల్ట్రా కూడా లాంచ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »