iQOO 15R : అమెజాన్‌లో ఐకూ 15ఆర్ పై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.6,000 తగ్గిన ధర

iQOO 15R స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.53,999గా ఉంది. అయితే ప్రస్తుత సేల్‌లో భాగంగా అమెజాన్ ఈ ఫోన్‌పై నేరుగా రూ.4,000 ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తూ రూ.49,999కే లిస్ట్ చేసింది.

iQOO 15R : అమెజాన్‌లో ఐకూ 15ఆర్ పై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.6,000 తగ్గిన ధర

Photo Credit: Amazon

iQOO 15R

ముఖ్యాంశాలు
  • అమెజాన్‌లో ఐకూ 15ఆర్ (iQOO 15R) పై బంపర్ ఆఫర్
  • భారీ డిస్కౌంట్‌తో అత్యంత చౌకగా లభిస్తున్న ఐకూ ఫ్లాగ్‌షిప్ ఫోన్
  • ఐకూ 15ఆర్ మొబైల్‌లో ఏకంగా 7600mAh పవర్‌ఫుల్ బ్యాటరీ
ప్రకటన

iQOO 15R : ప్రీమియం, గేమింగ్ స్మార్ట్‌ఫోన్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఐకూ బ్రాండ్ నుంచి వచ్చిన మోస్ట్ పాపులర్ మోడల్ ఐకూ 15ఆర్ పై ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారీ ఆఫర్లను ప్రకటించింది. అదిరిపోయే బ్యాటరీ లైఫ్, టాప్ నాచ్ కెమెరా పర్ఫార్మెన్స్‌తో మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్ ధరను కంపెనీ ఇప్పుడు భారీగా తగ్గించింది. లాంచ్ అయిన తర్వాత ఈ రేంజ్‌లో అత్యంత తక్కువ ధరకు ఈ ఫోన్ అందుబాటులోకి రావడం ఇదే మొదటిసారి. నేరుగా ఇచ్చే ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్ ఆఫర్లను కూడా కలపడం వల్ల వినియోగదారులు ఈ ప్రీమియం ఫోన్‌ను చాలా తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశం లభిస్తోంది.

రూ.4,000 ఫ్లాట్ డిస్కౌంట్ 
అమెజాన్ లీస్టింగ్ ప్రకారం, iQOO 15R స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.53,999గా ఉంది. అయితే ప్రస్తుత సేల్‌లో భాగంగా అమెజాన్ ఈ ఫోన్‌పై నేరుగా రూ.4,000 ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తూ రూ.49,999కే లిస్ట్ చేసింది. దీనికి తోడు అదనపు ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు గనుక ఎంపిక చేసిన కొన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే, వారికి మరో రూ.2,000 అదనపు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, మొత్తంగా రూ. 6,000 తగ్గింపుతో ఈ ఫోన్‌ను కేవలం రూ.47,999లకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్లకు సంబంధించిన పూర్తి వివరాలను అమెజాన్ అఫీషియల్ ఆఫర్ పేజీని సందర్శించి తెలుసుకోవచ్చు.

ఛార్జింగ్ కష్టాలకు గుడ్ బై 
ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీ సామర్థ్యమే. ఐకూ 15ఆర్ మోడల్‌లో ఏకంగా 7,600mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చారు. ఇంత పెద్ద బ్యాటరీని వేగంగా రీఛార్జ్ చేయడానికి వీలుగా 100W ఫ్లాష్‌ఛార్జ్  సపోర్ట్‌ను కూడా ఇచ్చారు. మొబైల్ హీట్ అవ్వకుండా ఉండేందుకు ఇందులో బైపాస్ ఛార్జింగ్  టెక్నాలజీని కూడా వాడటం విశేషం. స్క్రీన్ విషయానికి వస్తే, ఇందులో 6.59 ఇంచుల 1.5K అమోలెడ్  డిస్‌ప్లే కలదు. ఇది 1260 x 2750 పిక్సెల్స్ రెజల్యూషన్, 120Hz రీఫ్రెష్ రేట్, ఏకంగా 5000 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. థియేటర్ లాంటి అనుభూతి కోసం ఇందులో HDR10+ సర్టిఫికేషన్ కూడా ఇచ్చారు.


Tata Motors : భారత్‌లో ఈవీ కార్ల హవా.. జూన్ నెలలో ఏకంగా 108 శాతం పెరిగిన ఎలక్ట్రిక్ కార్ సేల్స్

నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ 
పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే ఈ ఫోన్ ఒక బీస్ట్ అని చెప్పవచ్చు. ఇందులో క్వాల్కమ్ కంపెనీకి చెందిన అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. భారీ స్టోరేజ్ కోసం 12GB LPDDR5x ర్యామ్, 512GB UFS 4.1 ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించారు. గేమర్లకు నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి ప్రత్యేకంగా  Q2 గేమింగ్ చిప్ ఇందులో ఉంది. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ, ఈ ఫోన్ కేవలం 7.9mm థిక్‌నెస్‌తో చాలా స్లిమ్‌గా, స్టైలిష్‌గా ఉంటుంది. దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం దీనికి IP68, IP69 రేటింగ్స్ ఇచ్చారు. కెమెరాల విషయానికి వస్తే.. వెనుక వైపు OIS సపోర్ట్ ఉన్న 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరాను అమర్చారు.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »