iQOO Neo 11S: ఛార్జర్ ని మరచిపోయినా నో ప్రాబ్లమ్.. 8000mAh బ్యాటరీతో ఐకూ కొత్త ఫోన్ తెచ్చేస్తోంది

iQOO Neo 11S Tipped to launch soon with 8,000mAh Battery: iQOO Neo 11S స్మార్ట్‌ఫోన్ 2K రిజల్యూషన్, స్మూత్ 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేసే ఫ్లాట్ OLED డిస్‌ప్లేతో రానుంది.

iQOO Neo 11S: ఛార్జర్ ని మరచిపోయినా నో ప్రాబ్లమ్.. 8000mAh బ్యాటరీతో ఐకూ కొత్త ఫోన్ తెచ్చేస్తోంది

Photo Credit: iQOO

iQOO Neo 10

ముఖ్యాంశాలు
  • 8000mAh బ్యాటరీ, 144Hz డిస్‌ప్లేతో గ్రాండ్ ఎంట్రీ
  • రూ. 42,800 అంచనా ధరతో ఐకూ నియో 11S
  • ఛార్జర్ ని మరచిపోయినా నో ప్రాబ్లమ్
ప్రకటన

iQOO Neo 11S tipped to Launch Soon with 8,000mAh Battery: స్మార్ట్‌ఫోన్ ప్రియులు, గేమర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐకూ నియో 11S త్వరలోనే మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. మొదట్లో ఈ ఫోన్‌ను జూలై నెలలోనే చైనా మార్కెట్లో ఆవిష్కరిస్తారని ప్రచారం జరిగినప్పటికీ, సాంకేతిక కారణాల వల్ల లాంచ్ వాయిదా పడింది. అయితే తాజాగా ప్రముఖ చైనీస్ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఈ ఫోన్‌కు సంబంధించిన ఆసక్తికరమైన సమాచారాన్ని, వేరియంట్లు, లాంచ్ టైమ్‌లైన్, కీలక ఫీచర్ల వివరాలను విబో ద్వారా లీక్ చేశారు.  

2K 144Hz ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్  

లీకైన వివరాల ప్రకారం.. iQOO Neo 11S స్మార్ట్‌ఫోన్ 2K రిజల్యూషన్, స్మూత్ 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేసే ఫ్లాట్ OLED డిస్‌ప్లేతో రానుంది. గేమింగ్ ఆడటానికి, పవర్ ఫుల్ విజువల్స్ వీక్షించడానికి ఈ స్క్రీన్ చాలా అద్భుతంగా తోడ్పడుతుంది. సేఫ్టీ కోసం ఇందులో వేగవంతమైన 'అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‎ను అమర్చారు. అంతేకాకుండా నీరు, ధూళి నుంచి రక్షణ కల్పించడానికి ఈ ఫోన్‌కు IP68, IP69 రేటింగ్ లభించనుంది.   

భారీ 8000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్  

ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవబోయేది దీని బ్యాటరీ కెపాసిటీనే. ఈ డివైజ్ ఏకంగా 8,000mAh కొలతలతో కూడిన భారీ బ్యాటరీతో రాబోతోందని లీక్స్ చెబుతున్నాయి. ఇటీవల 3C సర్టిఫికేషన్ సైట్‌లో నమోదైన V2545A మోడల్ నంబర్ డేటా ప్రకారం.. ఇది 100W వేగవంతమైన వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల రోజంతా ఎంత హెవీగా వాడినా బ్యాటరీ అయిపోతుందనే భయం ఉండదు, చార్జింగ్ కూడా చాలా నిమిషాల్లోనే పూర్తవుతుంది.   

Samsung Galaxy Glasses : కళ్లజోడు పెట్టుకుంటే చాలు.. ప్రపంచాన్నంతా చూసేయొచ్చు.. శామ్‌సంగ్ నుంచి కొత్త స్మార్ట్ గ్లాసెస్

డైమెన్సిటీ 9500 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16  

iQOO Neo 11S లో మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది. ఇటీవలే గీక్‌బెంచ్ బెంచ్ మార్కింగ్ సైట్‌లో ప్రత్యక్షమైన మోడల్ ప్రకారం, ఇది 16GB RAM, లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. గీక్‌బెంచ్ సింగిల్-కోర్ టెస్టులో 3,395 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్టులో 10,312 పాయింట్లు సాధించడం ద్వారా ఈ ఫోన్ ప్రాసెసింగ్ పవర్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

అంచనా ధర, లాంచ్ టైమ్‌ 

చైనా మార్కెట్లో iQOO Neo 11S ఆరంభ ధర 3,000 యువాన్లు (భారత కరెన్సీలో సుమారు రూ.42,800)గా ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ 12GB+256GB, 12GB+512GB, 16GB+256GB, 16GB+512GB వంటి రకరకాల ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్లలో రానుంది. కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే లైట్ వైట్, షాడో బ్లాక్, విండ్ చేజర్ రంగుల్లో ఇది అందుబాటులోకి రానుండగా, ఆగస్టు నెలలోనే చైనాలో అధికారికంగా లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »