Samsung AI Galaxy Glasses: కళ్లజోడు పెట్టుకుంటే చాలు.. ప్రపంచాన్నంతా చూసేయొచ్చు.. శామ్‌సంగ్ నుంచి కొత్త స్మార్ట్ గ్లాసెస్

Samsung launched Galaxy AI intelligent Glasses Powered by Google Gemini: స్టైలిష్ లుక్ కోసం ప్రముఖ ఐవేర్ లైఫ్‌స్టైల్ బ్రాండ్లు వార్బీ పార్కర్, జెంటిల్ మోన్‌స్టర్ భాగస్వామ్యంతో వీటి ఫ్రేమ్‌లను డిజైన్ చేశారు.

Samsung AI Galaxy Glasses: కళ్లజోడు పెట్టుకుంటే చాలు.. ప్రపంచాన్నంతా చూసేయొచ్చు.. శామ్‌సంగ్ నుంచి కొత్త స్మార్ట్ గ్లాసెస్

Samsung Galaxy Glasses

ముఖ్యాంశాలు
  • శామ్‌సంగ్ నుంచి సరికొత్త గెలాక్సీ ఏఐ స్మార్ట్ గ్లాసెస్ ఆవిష్కరణ
  • గూగుల్ జెమిని ఏఐ, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో శామ్‌సంగ్ గెలాక్సీ గ్లాసెస్
  • మెటా రాయ్-బాన్‌కు గట్టి పోటీ
ప్రకటన

Samsung launched Galaxy AI intelligent Glasses Powered by Google Gemini: సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం శామ్‌సంగ్ వేరబుల్స్ టెక్నాలజీ విభాగంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. లండన్‌లో నిర్వహించిన గ్రాండ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో తన తొలి ఏఐ స్మార్ట్ గ్లాసెస్ శామ్‌సంగ్ గెలాక్సీ గ్లాసెస్‎ను అధికారికంగా ప్రదర్శించింది. ఇటీవల గూగుల్ ఐ/ఓ కాన్ఫరెన్స్‌లో ప్రదర్శించిన ఈ స్మార్ట్ కళ్లజోడును కంపెనీ ఇప్పుడు పూర్తిస్థాయిలో పరిచయం చేసింది. స్టైలిష్ లుక్ కోసం ప్రముఖ ఐవేర్ లైఫ్‌స్టైల్ బ్రాండ్లు వార్బీ పార్కర్, జెంటిల్ మోన్‌స్టర్   భాగస్వామ్యంతో వీటి ఫ్రేమ్‌లను డిజైన్ చేశారు. మార్కెట్లో ఇవి రాయ్-బాన్ మెటా స్మార్ట్ గ్లాసెస్‌కు గట్టి పోటీ ఇవ్వనున్నాయి.

డిజైన్, కెమెరా, ఏఐ ఫీచర్లు

శామ్‌సంగ్ గెలాక్సీ గ్లాసెస్ రెండు రకాల స్టైలిష్ ఫ్రేమ్ ఆప్షన్లలో అందుబాటులోకి రానున్నాయి. ఇందులో బిల్ట్-ఇన్ కెమెరా అమర్చారు. మనం చూసే పరిసరాలను ఈ కెమెరా విశ్లేషించి, దానికి తగినట్లుగా సమాధానాలు ఇచ్చేందుకు గూగుల్ జెమిని ఏఐ అసిస్టెంట్ ఇందులో సహాయపడుతుంది. దీంతో పాటు పెద్ద పెద్ద మెసేజ్‌లను చిన్నగా సమ్మరైజ్ చేసి యూజర్లకు చదివి వినిపిస్తుంది. ఈ గ్లాసెస్ పూర్తిగా హ్యాండ్స్-ఫ్రీ అనుభూతిని అందిస్తాయి. యూజర్లు కేవలం వాయిస్ కమాండ్లు లేదా గ్లాసెస్ టచ్ జెస్టర్ల ద్వారా ఫోన్ కాల్స్ మాట్లాడవచ్చు, పాటలు వినవచ్చు, అలాగే ఫోటోలు కూడా తీయవచ్చు.

Samsung Galaxy Z Fold 8 Launch : 50MP డ్యూయల్ కెమెరా, లైట్ వెయిట్ టైటానియం బాడీ.. శామ్‌సంగ్ నయా ఫోల్డబుల్ ఫోన్ లాంచ్

ప్రాసెసర్, థర్మల్ మేనేజ్‌మెంట్, బ్యాటరీ

ఈ స్మార్ట్ గ్లాసెస్‌లో క్వాల్కమ్ తయారు చేసిన అత్యాధునిక స్నాప్‌డ్రాగన్ AR1 జెన్ 1 చిప్‌సెట్ అందించారు. కళ్లజోడు చిన్నగా ఉన్నప్పటికీ, నిరంతరం పనిచేసేటప్పుడు వేడెక్కకుండా ఉండేలా ప్రత్యేకమైన థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ఇందులో అమర్చారు. బ్యాటరీ విషయానికి వస్తే.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 9 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తుందని శామ్‌సంగ్ ప్రకటించింది.

లభ్యత, ఇతర ఉత్పత్తులు

శామ్‌సంగ్ ఈ స్మార్ట్ గ్లాసెస్ ద్వారా హెడ్‌మౌంటెడ్ వేరబుల్స్ రంగంలో అధికారికంగా బిజినెస్ ప్రారంభించింది. ప్రారంభంలో వీటిని ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయానికి తీసుకురానున్నారు. అయితే ఈ గ్లాసెస్ ధర, సేల్ డేట్‌కు సంబంధించిన వివరాలను కంపెనీ త్వరలోనే ప్రకటించనుంది. కాగా ఇదే గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో శామ్‌సంగ్ కంపెనీ గెలాక్సీ Z ఫోల్డ్ 8 సిరీస్ ఫోల్డబుల్ ఫోన్లు, గెలాక్సీ వాచ్ 9, గెలాక్సీ వాచ్ అల్ట్రా 2 స్మార్ట్‌వాచ్‌లను కూడా గ్రాండ్‌గా లాంచ్ చేసింది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »