ఇండియన్ వేరియంట్ ఐకూ Z11 డిజైన్ పరంగా చాలా కొత్తగా అనిపిస్తోంది.
iQOO Z11
iQOO Z11 : ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో సబ్-బ్రాండ్ అయిన ఐకూ, తమ సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఐకూ Z11ని భారత్‌లో లాంచ్ చేయడానికి సర్వం సిద్ధం చేస్తోంది. ఇటీవలే ఈ ఫోన్‌ను చైనా మార్కెట్లో విడుదల చేయగా, త్వరలోనే భారతీయ కస్టమర్ల ముందుకు తీసుకురానున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X వేదికగా ఐకూ ఇండియా సీఈఓ నిపున్ మార్యా ఈ ఫోన్ అధికారిక ఇమేజెస్‌ను షేర్ చేశారు. చైనాలో విడుదలైన వేరియంట్ కంటే భారత్‌కు రాబోయే మోడల్ డిజైన్, ఫినిషింగ్ పూర్తిగా భిన్నంగా ఉండబోతున్నట్లు ఈ పిక్స్ ద్వారా స్పష్టమవుతోంది.
పిల్ షేప్ కెమెరా, ప్రీమియమ్ డిజైన్.. ఎలా ఉందంటే?
ఇండియన్ వేరియంట్ ఐకూ Z11 డిజైన్ పరంగా చాలా కొత్తగా అనిపిస్తోంది. ఈ ఫోన్ వెనుక వైపు పిల్-షేప్‌లో ఉండే రియర్ కెమెరా ఐలాండ్ అమర్చారు. ఇందులో డ్యూయల్ కెమెరా యూనిట్‌తో పాటు ఎల్‌ఈడీ రింగ్ లైట్ కలదు. ఫోన్ బ్యాక్ ప్యానెల్ ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్‌తో ఆకట్టుకుంటోంది. దీనికి తోడు 3D కర్వ్‌డ్ డిస్‌ప్లే, చాలా సన్నని ఫ్రేమ్ ఉండటం వల్ల చేతిలో పట్టుకోవడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఫోన్ కుడి వైపున పవర్ బటన్, వాల్యూమ్ బటన్లు ఉండగా, పైన వైపు స్పీకర్ గ్రిల్, మైక్రోఫోన్లను అందించారు.
ఫస్ట్ టైమ్ డైమెన్సిటీ 7500 టర్బో ప్రాసెసర్
భారత్‌లో లాంచ్ కాబోయే ఐకూ Z11 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో చిప్‌సెట్‌ను ఉపయోగించబోతున్నారు. దేశంలో ఈ పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో వస్తున్న మొదటి ఐకూ స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. అయితే చైనా వేరియంట్‌లో మాత్రం మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ప్రాసెసర్‌ను వాడారు. పెర్ఫార్మెన్స్, గేమింగ్ విషయంలో ఈ ఫోన్ ఇండియన్ యూజర్లను ఎంతగానో ఆకట్టుకుంటుందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఆగస్ట్ నెలలోనే ఈ ఫోన్ భారత్‌లో అడుగుపెట్టనుంది.
WhatsApp Tricks : ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోతుందా ?.. ఈ చిన్న వాట్సాప్ సెట్టింగ్ మారితే మీ ప్రాబ్లమ్ సాల్వ్
చైనా వేరియంట్ స్పెసిఫికేషన్లు ఇవే..
చైనాలో విడుదలైన ఐకూ Z11 మోడల్ ఫీచర్లను పరిశీలిస్తే.. ఇది 6.83 ఇంచుల (1,260 x 2,800 పిక్సెల్స్) అమోలెడ్ స్క్రీన్‌తో వస్తుంది. ఇందులో 165Hz దాకా రిఫ్రెష్ రేట్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్, HDR సపోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ 16 GB వరకు ర్యామ్, 512 GB వరకు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. కెమెరా విషయానికొస్తే.. వెనుక వైపు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా (OIS మద్దతుతో), 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఇక ఇటీవలే మన దేశంలో ఐకూ Z11 లైట్ పేరుతో 6.74 ఇంచుల HD+ LCD డిస్‌ప్లే, డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో కూడిన ఫోన్‌ను కూడా కంపెనీ లాంచ్ చేసిన విషయం తెలిసిందే.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,150
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Meta Muse AI Agent Arrives on Mac With Support for Complex Tasks: What to Know
WhatsApp Could Bring New Theme Categories and Wallpapers to Android
Mivi One 5G Camera Details Revealed, Mivi Care+ Support Teased Ahead of Launch