సాధారణంగా మనం వాడే వాట్సాప్‌లోని ఫోటోలు, వీడియోలు రెండుసార్లు సేవ్ కావడం వల్ల ఫోన్ లోకల్ మెమరీతో పాటు క్లౌడ్ స్టోరేజ్ కూడా క్షణాల్లో ఖాళీ అయిపోతుంది.
Photo Credit: Pexels/BM Amaro
WhatsApp Tricks : ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్లలో ఎంత ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ ఉన్నప్పటికీ అది చాలా త్వరగానే నిండిపోతుంటుంది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు తరచూ స్టోరేజ్ ఫుల్ అనే హెచ్చరికలను చూసి విసిగిపోతుంటారు. మీరు కూడా ఇలాంటి ఇబ్బందే ఎదుర్కొంటుంటే.. ఈ వార్తను పూర్తిగా చదవండి. సాధారణంగా మనం వాడే వాట్సాప్‌లోని ఫోటోలు, వీడియోలు రెండుసార్లు సేవ్ కావడం వల్ల ఫోన్ లోకల్ మెమరీతో పాటు క్లౌడ్ స్టోరేజ్ కూడా క్షణాల్లో ఖాళీ అయిపోతుంది. వాట్సాప్ చాట్ బ్యాకప్, మీ ఫోన్‌లోని గూగుల్ ఫోటోస్ యాప్ రెండూ ఒకే మీడియా ఫైల్‌ను బ్యాకప్ చేయడం వల్లే ఈ సమస్య వస్తుంది.
ఒకే ఫోటో రెండుసార్లు ఎందుకు సేవ్ అవుతుంది?
దీనికి ప్రధాన కారణం ఆండ్రాయిడ్ ఫోన్‌లలోని ఆటోమేటిక్ బ్యాకప్ ఫీచర్. వాట్సాప్ చాట్ బ్యాకప్ మీ మెసేజ్ డేటాబేస్‌తో పాటు మీ మీడియా ఫైళ్లను (ఫోటోలు, వీడియోలు) నేరుగా గూగుల్ డ్రైవ్ లేదా గూగుల్ అకౌంట్‌లో స్టోర్ చేస్తుంది. అదే సమయంలో మీ ఫోన్‌లోని గూగుల్ ఫోటోస్ యాప్ కూడా లోకల్‌గా ఉండే వాట్సాప్ ఇమేజెస్, వాట్సాప్ వీడియోస్ ఫోల్డర్లను ఆటోమేటిక్‌గా స్కాన్ చేసి, వాటిని మళ్లీ క్లౌడ్ గ్యాలరీకి అప్‌లోడ్ చేస్తుంది. దీనివల్ల ఒకే ఫోటో లేదా వీడియో రెండు చోట్ల బ్యాకప్ అయి మీ ముఖ్యమైన స్టోరేజ్‌ను తినేస్తుంది.
గూగుల్ ఫోటోస్‌లో ఈ సెట్టింగ్స్ మార్చండి
మీ ఫోన్‌లో గూగుల్ ఫోటోస్ బ్యాకప్ వల్ల స్టోరేజ్ వేస్ట్ కాకుండా ఉండటానికి ఈ క్రింది సులభమైన స్టెప్స్ ఫాలో అవ్వండి:
* ముందుగా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో Google Photos యాప్‌ను ఓపెన్ చేయండి.
* పైన కుడి వైపున కనిపించే మీ ప్రొఫైల్ ఫోటో పై ట్యాప్ చేయండి.
* ఆ తర్వాత Photos Settings లోకి వెళ్లండి.
* అక్కడ మీకు కనిపించే Backup, Back up device folders ఆప్షన్లపై క్లిక్ చేయండి.
* అక్కడ జాబితాలో ఉండే WhatsApp Images, WhatsApp Video ఆప్షన్లను వెతికి, వాటి పక్కన ఉన్న టాగల్ను ఆఫ్ చేయండి.
Flipkart Freedom Sale : ఆగస్ట్ 15కు బంపర్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో 65 ఇంచుల 4K స్మార్ట్ టీవీలపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు
వాట్సాప్ మీడియా ఫోన్ గ్యాలరీలోకి రాకుండా ఎలా ఆపాలి?
మీరు వాట్సాప్‌లో స్వీకరించే ప్రతి ఫోటో లేదా వీడియో నేరుగా ఫోన్ గ్యాలరీలోకి వచ్చి పడకుండా నిరోధించడానికి వాట్సాప్ యాప్‌లోనే ఒక సెట్టింగ్ మార్చుకోవచ్చు:
* మీ ఫోన్‌లో WhatsApp యాప్‌ను ఓపెన్ చేయండి.
* పైన కుడి మూలన ఉన్న త్రీ-డాట్స్ పై ట్యాప్ చేయండి.
* ఆ తర్వాత Settings ఆప్షన్‌ను ఎంచుకుని, Chats విభాగంలోకి వెళ్లండి.
* అక్కడ ఉండే Media Visibility ఆప్షన్‌ను ఆఫ్ చేయండి.
ఈ చిన్న మార్పు చేయడం వల్ల వాట్సాప్‌లోకి వచ్చే మీడియా ఫైళ్లు మీ ఫోన్ లోకల్ గ్యాలరీలో మళ్లీ సేవ్ కాకుండా ఆగిపోతాయి. ఫలితంగా మీ ఫోన్ స్టోరేజ్ సేవ్ అవ్వడమే కాకుండా, ఫోన్ హ్యాంగ్ అవ్వకుండా స్మూత్‌గా పనిచేస్తుంది.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,652
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
iPhone 18 Pro Series’ A20 Pro Chipset Appears on Multiple Benchmarking Platforms Showing Performance Gains