ఐకూ Z11 స్మార్ట్‌ఫోన్ ఆగస్టు నెలలోనే భారతదేశంలో అధికారికంగా అందుబాటులోకి రానుంది. భారతీయ వేరియంట్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నారు.
iQOO Z11
iQOO Z11 : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివోకు చెందిన సబ్ బ్రాండ్ ఐకూ, తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఐకూ Z11ను త్వరలోనే భారతదేశంలో లాంచ్ చేయబోతున్నట్లు అధికారికంగా సూచించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఐకూ పోస్ట్ చేసిన టీజర్‌లో మూడు బైనరీ కోడ్ స్ట్రింగ్స్ ఉన్నాయి. ఆ కోడ్‌లను డీకోడ్ చేయగా, ఈ కొత్త డివైజ్ ఐకూ Z11 అని స్పష్టంగా తేలింది. ఈ ఫోన్ ఇప్పటికే చైనా మార్కెట్‌లో విడుదల కాగా త్వరలోనే భారతీయ వినియోగదారుల ముందుకు రానుంది.
ఆగస్టులోనే ఎంట్రీ.. మీడియాటెక్ కొత్త ప్రాసెసర్
పరిశ్రమ వర్గాల కథనం ప్రకారం.. ఐకూ Z11 స్మార్ట్‌ఫోన్ ఆగస్టు నెలలోనే భారతదేశంలో అధికారికంగా అందుబాటులోకి రానుంది. భారతీయ వేరియంట్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నారు. దేశంలో ఈ పవర్‌ఫుల్ అక్టాకోర్ ప్రాసెసర్‌తో రాబోతున్న తొలి ఐకూ స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. చైనా వేరియంట్‌లో డైమెన్సిటీ 8500 ప్రాసెసర్‌ను ఉపయోగించగా, ఇండియన్ మోడల్‌ను 3D కర్వ్‌డ్ డిస్‌ప్లేతో మరింత ఆకర్షణీయంగా రూపొందించారు.
Google Play Store : గూగుల్ ప్లే స్టోర్ రూల్స్ మారాయి.. ఇకపై ఏ యాప్ వాడాలన్నా ఏజ్ వెరిఫికేషన్ తప్పనిసరి
డిస్‌ప్లే, స్టోరేజ్ వివరాలు
చైనాలో విడుదలైన ఐకూ Z11 స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే.. ఇందులో 6.83 ఇంచుల AMOLED స్క్రీన్‌ను అందించారు. ఇది 165Hz రిఫ్రెష్ రేట్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్, HDR సపోర్ట్‌ను కలిగి ఉంది. దీంతో యూజర్లకు గేమింగ్, వీడియో కంటెంట్ చూసే సమయంలో అద్భుతమైన అనుభూతి లభిస్తుంది. అలాగే ఇందులో 16 GB వరకు ర్యామ్, 512 GB వరకు భారీ ఇంటర్నల్ స్టోరేజ్ లభించనుంది.
కెమెరా, ఊహించని బ్యాటరీ కెపాసిటీ
కెమెరా విభాగానికి వస్తే.. ఐకూ Z11 వెనుక వైపు డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఇందులో ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందర 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇక ఈ ఫోన్‌లో అత్యంత ప్రత్యేకమైనది దాని బ్యాటరీ. ఏకంగా 9,020 mAh అత్యంత పవర్ఫుల్ బ్యాటరీతో పాటు 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించారు. దీనివల్ల ఫోన్ ఒకసారి ఛార్జ్ చేస్తే రోజుల తరబడి ఛార్జింగ్ భయం లేకుండా వాడుకోవచ్చు.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,909
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Nothing Deals Revealed for Phone 4 Series, CMF Buds Lineup, More Ahead of Flipkart's Big Billion Days Sale