iQOO Z11 Lite : భారత మార్కెట్లోకి ఐకూ కొత్త సంచలనం.. అదిరిపోయే ఫీచర్లతో iQOO Z11 Lite ఎంట్రీ

గత ఏడాది భారత మార్కెట్లో సూపర్ హిట్ అయిన iQOO Z10 Lite మోడల్‌కు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా ఈ సరికొత్త మొబైల్‌ను కంపెనీ తీసుకువస్తోంది.

iQOO Z11 Lite  : భారత మార్కెట్లోకి ఐకూ కొత్త సంచలనం.. అదిరిపోయే ఫీచర్లతో  iQOO Z11 Lite ఎంట్రీ

Photo Credit: iQOO

iQOO Z10 Lite

ముఖ్యాంశాలు
  • భారత మార్కెట్లోకి ఐకూ (iQOO) కొత్త సంచలనం
  • సరికొత్త నోటిఫికేషన్ ఎల్‌ఈడీ లైట్‌తో రానున్న ఐకూ బడ్జెట్ ఫోన్
  • 6500mAh భారీ బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్
ప్రకటన

iQOO Z11 Lite  : స్మార్ట్‌ఫోన్ ప్రియులకు సరికొత్త టెక్నాలజీని అందిస్తూ తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ బ్రాండ్ ఐకూ, భారత మార్కెట్లో తన పట్టును మరింత బలోపేతం చేసుకోవడానికి సిద్ధమైంది. తన పాపులర్ లైట్ సిరీస్‌ను విస్తరిస్తూ ఐకూ జీ11 లైట్ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే భారతదేశంలో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సరికొత్త టీజర్లను విడుదల చేస్తూ ఫోన్‌పై అంచనాలను పెంచేస్తోంది. గత ఏడాది భారత మార్కెట్లో సూపర్ హిట్ అయిన iQOO Z10 Lite మోడల్‌కు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా ఈ సరికొత్త మొబైల్‌ను కంపెనీ తీసుకువస్తోంది.
  
కంపెనీ విడుదల చేసిన తాజా టీజర్ ప్రకారం.. ఐకూ జీ11 లైట్ స్మార్ట్‌ఫోన్ మునుపటి కంటే చాలా వినూత్నమైన, ఆకర్షణీయమైన డిజైన్‌తో రాబోతోంది. ఈ ఫోన్ వెనుక భాగంలో ఒక చిన్న కెమెరా బార్‌ను అమర్చారు. దీని పక్కనే ఎల్‌ఈడీ ఫ్లాష్ లైట్‌తో పాటు, ఆ ఫ్లాష్ కింద ప్రత్యేకంగా ఒక నోటిఫికేషన్ ఎల్‌ఈడీ లైట్‌ను జత చేయడం ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఫోన్‌కు ఏదైనా మెసేజ్ లేదా కాల్ వచ్చినప్పుడు ఈ లైట్ బ్లింక్ అవుతుంది. అంతేకాకుండా, ఈ టీజర్‌లో కమ్స్ విత్ ఏఐ అని స్పష్టంగా పేర్కొనడం ద్వారా ఈ బడ్జెట్ ఫోన్ లోనూ సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఉండనున్నట్లు కంపెనీ హింట్ ఇచ్చింది.

ఐకూ జీ11 లైట్ స్మార్ట్‌ఫోన్ ఈ జూలై నెల చివరి నాటికి భారతీయ మార్కెట్లో అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. మార్కెట్లోకి లాంచ్ అయిన తర్వాత ఈ సరికొత్త మొబైల్ ఐకూ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వేదికగా కస్టమర్లకు కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానుంది. బడ్జెట్ ధరలోనే ఈ ఫోన్ లభించనుండటంతో మిడ్-రేంజ్ లవర్స్ దీని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

లీకైన నివేదికల ప్రకారం, iQOO Z11 Lite స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు చాలా బలంగా ఉన్నాయి. ఇందులో మల్టీటాస్కింగ్ కోసం పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఫోన్ డిస్‌ప్లే విషయానికొస్తే, ఇందులో 6.74 ఇంచుల సైజ్ గల పెద్ద ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించనున్నారు. ఇక భద్రత పరంగా ఈ ఫోన్‌కు కీలకమైన అప్‌గ్రేడ్ లభించింది. ఫోన్ ధూళి, నీటి వల్ల పాడవకుండా ఉండేందుకు ఇందులో IP65 రేటింగ్‌ను ఇచ్చారు. గత మోడల్ అయిన జీ10 లైట్‌లో కేవలం IP64 రేటింగ్ మాత్రమే ఉండగా, ఇప్పుడు దానిని మరింత మెరుగుపరచడం విశేషం.

RAM Price Hike : కంప్యూటర్, ల్యాప్‌టాప్ ప్రియులకు షాక్.. రాబోయే రోజుల్లో భారీగా పెరగనున్న ర్యామ్ ధరలు



ఫొటోగ్రఫీ విషయానికి వస్తే, iQOO Z11 Lite వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ పవర్‌ఫుల్ మెయిన్ ప్రైమరీ కెమెరాను అమర్చారు. ఇది మంచి క్వాలిటీ ఫోటోలను అందిస్తుంది. అదేవిధంగా, సెల్ఫీలు, కాల్స్ కోసం ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కేటాయించారు. ఈ బడ్జెట్ ఫోన్‌కు మరో ప్రధాన బలం ఇందులో ఉన్న 6500mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీ. దీనివల్ల ఫోన్ బ్యాటరీ సింగిల్ ఛార్జ్‌తో చాలా ఎక్కువ సమయం వస్తుంది. దీనిని వేగంగా ఛార్జ్ చేయడానికి 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కంపెనీ అందించింది.

లైట్ వెర్షన్‌తో పాటు, ఐకూ కంపెనీ భారత్‌లో తన మెయిన్ మోడల్ అయిన  iQOO Z11 పై కూడా వేగంగా పనిచేస్తోంది. ఈ ప్రీమియం మోడల్ ఫీచర్లు నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయి. ఇందులో అద్భుతమైన కలర్స్ అందించే ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో పాటు, పవర్‌ఫుల్  మీడియాటెక్ డైమెన్సిటీ 7500 చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నారు. అన్నింటికంటే మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటంటే, ఈ iQOO Z11 ఫోన్ లోపల ఏకంగా 8000mAh కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న అల్ట్రా భారీ బ్యాటరీని అమర్చబోతున్నట్లు లీక్స్ ద్వారా సమాచారం అందుతోంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Samsung : భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ A27 5G సేల్స్ షురూ.. రూ.3,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్
  2. iQOO Z11 Lite : భారత మార్కెట్లోకి ఐకూ కొత్త సంచలనం.. అదిరిపోయే ఫీచర్లతో iQOO Z11 Lite ఎంట్రీ
  3. RAM Price Hike : కంప్యూటర్, ల్యాప్‌టాప్ ప్రియులకు షాక్.. రాబోయే రోజుల్లో భారీగా పెరగనున్న ర్యామ్ ధరలు
  4. Motorola : మార్కెట్లోకి మోటోరోలా సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో లీకైన Motorola Edge 70 Max
  5. Motorola : భారత మార్కెట్లోకి మోటోరోలా కొత్త సంచలనం.. అదిరిపోయే ఫీచర్లతో Moto G77 Power ఎంట్రీ
  6. QCY MeloBuds : ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 గంటల బ్యాటరీ లైఫ్..మార్కెట్లోకి క్యూసీవై కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్స్
  7. Tesla : భారత్‌లో టెస్లా ఈవీ కార్ల జోరు.. సరికొత్త 6-సీటర్ మోడల్ వై ఎల్‎కు భారీ డిమాండ్
  8. Flipkart Goat Sale : రియల్‌మి లవర్స్‌కు పండగే.. ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్‌లో రేటు తగ్గిన పవర్‌ఫుల్ 5జీ స్మార్ట్‌ఫోన్
  9. Samsung : శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2026 ఈవెంట్ ఖరారు.. లండన్ వేదికగా సరికొత్త ఫోల్డబుల్ ఫోన్ల లాంచ్
  10. iQOO Z11 : భారత్‎లోకి ఐకూ కొత్త స్మార్ట్‌ఫోన్.. అదిరిపోయే ఫీచర్లతో iQOO Z11 ఎంట్రీ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »