ఈ ఫోన్ జూలై 24, 2026న భారత మార్కెట్లో విడుదల కానుంది. ఇప్పటికే ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఈ మొబైల్‌కు సంబంధించిన ప్రత్యేక మైక్రోసైట్ కూడా లైవ్ అయింది.
Photo Credit: iQOO
iQOO Z11 Lite
iQOO Z11 Lite : భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వివో సబ్-బ్రాండ్ అయిన ఐకూ తన పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ బ్రాండ్ దేశీయ మార్కెట్లోకి తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఐకూ Z11 లైట్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని ఐకూ ఇండియా సీఈఓ నిపుణ్ మర్యా అధికారికంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X ద్వారా వెల్లడించారు. ఈ ఫోన్ జూలై 24, 2026న భారత మార్కెట్లో విడుదల కానుంది. ఇప్పటికే ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఈ మొబైల్‌కు సంబంధించిన ప్రత్యేక మైక్రోసైట్ కూడా లైవ్ అయింది. బడ్జెట్ ధరలో ల్యాగ్‌లెస్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే వారి కోసం ఈ ఫోన్‌ను డిజైన్ చేశారు.
అదిరిపోయే డైమెన్సిటీ 6300 ప్రాసెసర్
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఐకూ Z11 లైట్ మొబైల్‌లో అడ్వాన్స్‌డ్ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ప్రముఖ బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫామ్ AnTuTuలో ఈ ఫోన్ ఏకంగా 5,79,000 కంటే ఎక్కువ స్కోర్‌ను సాధించినట్లు కంపెనీ గర్వంగా ప్రకటించింది. డిస్‌ప్లే పరంగా ఇందులో 6.74 ఇంచుల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ టచ్‌స్క్రీన్ ఉండబోతోంది. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 1,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ లెవెల్‌ను ఇందులో మైంటైన్ చేశారు. ఈ ఫోన్‌ను సోలార్ ఫ్లేమ్, మిడ్‌నైట్ బ్లూ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో లాంచ్ చేయనున్నారు.
కాల్స్ వస్తే రంగులు మారే డైనమిక్ లైట్
ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాక్ డిజైన్ చాలా డిఫరెంట్‌గా ఉండబోతోంది. ఫోన్ వెనుక భాగంలో ఒక ప్రత్యేకమైన డైనమిక్ లైట్ ఫీచర్‌ను ఇచ్చారు. మనకు ఏవైనా కాల్స్ లేదా నోటిఫికేషన్లు వచ్చినప్పుడు ఈ లైట్ రకరకాల రంగుల్లో ఫ్లాష్ అవుతూ స్మార్ట్ లుక్‌ను ఇస్తుంది. ఫోటోగ్రఫీ కోసం వెనుక వైపు పిల్-షేప్ లో ఉండే కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో పాటు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అమర్చారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. దీనితో పాటు ఇందులో కొన్ని క్రేజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు కూడా ఉండనున్నాయి.
BSNL : రోజుకు 2జీబీ డేటా, ఏడాది పాటు వాలిడిటీ.. బడ్జెట్ ధరలో బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త సంచలన ప్లాన్
ఏకంగా 6500mAh భారీ బ్యాటరీ
ఈ ఫోన్ యొక్క అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని బ్యాటరీ లైఫ్. ఎక్కువ సమయం ఛార్జింగ్ రావాలనే ఉద్దేశంతో ఇందులో ఏకంగా 6500mAh భారీ బ్యాటరీని అమర్చారు. దీనిని వేగంగా ఛార్జ్ చేయడానికి 44W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అయితే, ఈ లైట్ మోడల్‌తో పాటు కంపెనీ ఐకూ Z11 రెగ్యులర్ మోడల్‌ను కూడా త్వరలోనే భారత్‌లో లాంచ్ చేయనుంది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో విడుదలైన ఐకూ Z11 మోడల్ కంటే భారత వేరియంట్ భిన్నంగా ఉండబోతోంది. చైనాలో డైమెన్సిటీ 8500, మలేషియాలో స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్‌లతో విడుదలైన ఆ వేరియంట్లలో 6.83 ఇంచుల అమోలెడ్ స్క్రీన్, 9020mAh బ్యాటరీ ఉన్నాయి. మన దేశంలో రాబోయే ఇండియన్ వెర్షన్ ప్రోటోటైప్ ఇటీవల గీక్‌బెంచ్ ఏఐలో కూడా లిస్ట్ అయింది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹63,999
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999