బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టిన ఈ రూ. 1,551 రీఛార్జ్ ప్లాన్ ముఖ్య ఉద్దేశం తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం వాలిడిటీని అందించడమే. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లకు ఏకంగా 365 రోజుల వాలిడిటీ లభిస్తుంది.
Photo Credit: Pexels/Sharath G
BSNL
BSNL : భారతదేశంలో ప్రైవేట్ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్ తమ రీఛార్జ్ ప్లాన్ల ధరలను భారీగా పెంచేయడంతో సామాన్య వినియోగదారులు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వ యాజమాన్యంలోని బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు బంపర్ ఆఫర్లను ప్రకటిస్తోంది. దేశవ్యాప్తంగా తన నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తూ, 5జీ సేవలకు సిద్ధమవుతున్న బిఎస్‌ఎన్‌ఎల్.. బడ్జెట్ ధరలోనే అదిరిపోయే ప్లాన్లను అందిస్తోంది. ఇందులో భాగంగా తీసుకొచ్చిన రూ. 1,551 రీఛార్జ్ ప్లాన్ ప్రస్తుతం మొబైల్ వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రైవేట్ కంపెనీల ప్లాన్లతో పోలిస్తే సగం ధరకే లభించే ఈ ప్లాన్ ద్వారా ఏడాది పొడుగునా ఎలాంటి టెన్షన్ లేకుండా మొబైల్ సేవలను వాడుకోవచ్చు.
రోజుకు 2జీబీ డేటా, ఏడాది పాటు వాలిడిటీ
బీఎస్‌ఎన్‌ఎల్ ప్రవేశపెట్టిన ఈ రూ. 1,551 రీఛార్జ్ ప్లాన్ ముఖ్య ఉద్దేశం తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం వాలిడిటీని అందించడమే. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లకు ఏకంగా 365 రోజుల వాలిడిటీ లభిస్తుంది. ఇందులోనే రోజుకు 2జీబీ హై-స్పీడ్ డేటాను కంపెనీ ఆఫర్ చేస్తోంది. వాయిస్ కాలింగ్ విషయానికి వస్తే.. దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్ మాట్లాడుకోవచ్చు. వీటితో పాటు ఈ ప్లాన్ వ్యవధిలో మొత్తం 2400 ఉచిత SMSలు కూడా అందుతాయి. ఒకవేళ రోజువారీ హై-స్పీడ్ డేటా లిమిట్ అయిపోతే, ఇంటర్నెట్ పూర్తిగా ఆగిపోకుండా 40kbps వేగంతో కొనసాగుతుంది.
జియో రూ.3,599 ప్లాన్ ఫీచర్లు
ఇదే రకమైన ఏడాది వాలిడిటీ కోసం ప్రైవేట్ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో దాదాపు రెట్టింపు ధరను వసూలు చేస్తోంది. జియోలో లభించే రూ.3,599 ప్లాన్ ద్వారా 365 రోజుల వాలిడిటీ అందుతుంది. ఇందులో రోజుకు 2.5జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు లభిస్తాయి. అదనపు ప్రయోజనాల కింద జియో యాప్స్ ఉచిత యాక్సెస్, జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్, గూగుల్ జెమిని ఏఐ బెనిఫిట్స్ లభిస్తాయి. అలాగే మీ ప్రాంతంలో జియో 5జీ నెట్‌వర్క్ ఉంటే.. అన్‌లిమిటెడ్ 5జీ డేటాను కూడా ఉచితంగా వాడుకోవచ్చు. రోజువారీ డేటా పరిమితి ముగిసిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 64kbps కి తగ్గుతుంది.
ChatGPT : చాట్‌జీపీటీతో తిప్పలు.. ఏఐ సాయంతో సైబర్ దాడికి పాల్పడిన 15 ఏళ్ల కుర్రాడి అరెస్ట్
ఎయిర్‌టెల్ రూ.3599 ప్లాన్ హైలైట్స్
మరోవైపు భారతీ ఎయిర్‌టెల్ కూడా జియో తరహాలోనే రూ.3,599 ధరతో కూడిన వార్షిక ప్లాన్‌ను అందిస్తోంది. ఎయిర్‌టెల్ ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2జీబీ హై-స్పీడ్ డేటాను 365 రోజుల వాలిడిటీతో ఇస్తోంది. దేశవ్యాప్తంగా అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాలింగ్‌తో పాటు రోజుకు 100 ఉచిత ఎస్ఎమ్ఎస్లు వాడుకోవచ్చు. ఎయిర్‌టెల్ 5జీ ప్లస్ నెట్‌వర్క్ పరిధిలో ఉన్న వారికి అన్‌లిమిటెడ్ 5జీ డేటా పూర్తిగా ఉచితం. ఇవి కాకుండా 12 నెలల పాటు ఉచితంగా అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్, ఉచిత హెలోట్యూన్స్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ద్వారా ఓటీటీ కంటెంట్‌ను ఉచితంగా వీక్షించవచ్చు. ఫీచర్లు ఎక్కువగా ఉన్నప్పటికీ బడ్జెట్ పరంగా చూస్తే మాత్రం బిఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్ చాలా లాభదాయకమని చెప్పవచ్చు.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹63,999
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Oppo Pad Mini Matte Display Edition, Oppo Enco X4 Features Teased Ahead of India Launch