iQOO Z11 Lite vs Realme Narzo 100x 5G vs Moto G77 Power: మీ బడ్జెట్‌లో ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్?

ధరల విషయానికి వస్తే ఐకూ Z11 లైట్ వేరియంట్‌ను బట్టి రూ.19,499 (4GB+128GB), రూ.21,499 (6GB+128GB), రూ.24,499 (6GB+256GB) ప్రారంభ ధరలతో లభిస్తోంది.

iQOO Z11 Lite vs Realme Narzo 100x 5G vs Moto G77 Power: మీ బడ్జెట్‌లో ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్?

Photo Credit: iQOO/Realme/Motorola

iQOO Z11 Lite vs Realme Narzo 100x 5G vs Moto G77 Power

ముఖ్యాంశాలు
  • బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ల రంగంలో మహా సంగ్రామం
  • iQOO Z11 Lite వర్సెస్ Realme Narzo వర్సెస్ Moto G77 Power!
  • భారత మొబైల్ మార్కెట్‌ను శాసిస్తున్న 3 దిగ్గజ ఫోన్లు
ప్రకటన

iQOO Z11 Lite  vs Realme Narzo 100x 5G vs Moto G77 Power: భారత మార్కెట్లో బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్‌ల పోటీ మరింత వేడెక్కింది. ప్రముఖ టెక్ బ్రాండ్ iQOO ఇటీవల తన కొత్త మోడల్ ఐకూ  Z11 లైట్ను విడుదల చేసింది. భారత మార్కెట్లో ఈ ఫోన్ నేరుగా రియల్ మీ నార్జో 100x 5G, మోటో  G77 పవర్ స్మార్ట్‌ఫోన్‌లతో తలపడుతోంది. ఈ మూడు ఫోన్లు కూడా ఆకర్షణీయమైన డిజైన్, శక్తివంతమైన ప్రాసెసర్లు, భారీ బ్యాటరీలతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. కొత్తగా ఫోన్ కొనాలనుకునే వారికి సహాయపడేలా ఈ మూడింటి మధ్య ఉన్న వ్యత్యాసాలను ఇక్కడ క్లియర్‌గా పోల్చి చూద్దాం.  

ధరలు, స్టోరేజ్ వేరియంట్లు
ధరల విషయానికి వస్తే ఐకూ  Z11 లైట్ వేరియంట్‌ను బట్టి రూ.19,499 (4GB+128GB), రూ.21,499 (6GB+128GB), రూ.24,499 (6GB+256GB) ప్రారంభ ధరలతో లభిస్తోంది. ఇక రియల్ మీ నార్జో 100x 5G మోడల్ 4GB+128GB వేరియంట్ ధర రూ.20,999, 6GB+128GB ధర రూ.22,999, 6GB+256GB వేరియంట్ ధర రూ.24,999 వద్ద అందుబాటులో ఉంది. మరొకవైపు మోటో  G77 పవర్ కేవలం ఒకే ఒక్క టాప్-ఎండ్ 8GB+128GB వేరియంట్‌తో రూ.25,999 ధరకు లభిస్తోంది. బడ్జెట్ పరంగా iQOO కొంత తక్కువ ధరకే లభిస్తుండగా, మోటో ఎక్కువ ర్యామ్ ఆఫర్ చేస్తోంది.  

డిస్‌ప్లే క్వాలిటీ, రిఫ్రెష్ రేట్  
ఐకూ  Z11 లైట్ లో 6.74 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే కలదు, ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇక రియల్ మీ నార్జో 100x 5G లో 6.6 అంగుళాల HD+ LCD స్క్రీన్‌తో పాటు వేగవంతమైన 144Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ లభిస్తుంది. అయితే, వీటన్నింటికంటే మెరుగ్గా మోటో  G77 పవర్ లో 6.72 అంగుళాల Full HD+ LCD స్క్రీన్‌ను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1050 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వచ్చి, స్పష్టమైన డిస్‌ప్లే అనుభూతిని ఇస్తుంది.  

ప్రాసెసర్,  ఆపరేటింగ్ సిస్టమ్ 
ప్రాసెసింగ్ పరంగా ఐకూ  Z11 లైట్ మోడల్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 6nm చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. రియల్ మీ నార్జో 100x 5G లో కూడా మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5G ప్రాసెసర్ అందించారు. ఇక మోటో  G77 పవర్ మాత్రం కాస్త మెరుగైన మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్‌తో వస్తుంది. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, ఈ మూడూ ఆండ్రాయిడ్ 16 ఆధారంగానే పనిచేస్తాయి. ఐకూ ఫోన్ Origin OS 6 పై, రియల్‌మీ ఫోన్ Realme UI 7.0 పై, మోటో ఫోన్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌తో పనిచేస్తాయి.  

xMEMS Labs Microfan : స్మార్ట్ టెక్నాలజీ చరిత్రలోనే అద్భుత విప్లవం.. చేతి గోరు సైజులో మైక్రో ఫ్యాన్ ఆవిష్కరణ

కెమెరా, సెల్ఫీ పనితీరు 
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే ఐకూ  Z11 లైట్ వెనుక వైపు 50MP ప్రైమరీ + 0.08MP సెకండరీ కెమెరా, ముందు వైపు 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. రియల్ మీ నార్జో 100x 5G వెనుక 50MP ప్రైమరీ కెమెరా,  ముందు 8MP సెల్ఫీ కెమెరాను అందిస్తోంది. మోటో G77 Power కెమెరా విభాగంలో చాలా ముందంజలో ఉంది. దీని వెనుక వైపు క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీతో కూడిన 50MP ప్రధాన కెమెరాతో పాటు 8MP ఆల్ట్రావైడ్ కెమెరా ఉంది. అంతేకాకుండా సెల్ఫీల కోసం ఇందులో భారీగా 32MP ఫ్రంట్ కెమెరా ఇవ్వడం విశేషం.  

బ్యాటరీ, ఛార్జింగ్, కనెక్టివిటీ  
బ్యాటరీ బ్యాకప్ పరంగా రియల్ మీ నార్జో 100x 5G ఏకంగా 8,000mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో అగ్రస్థానంలో నిలుస్తుంది. మోటో  G77 పవర్ లో 7,000mAh బ్యాటరీ, 30W టర్బో ఛార్జింగ్, 6W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఐకూ  Z11 లైట్ లో 6,500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్ అందుబాటులో ఉన్నాయి. మూడింటిలోనూ 5G, వై-ఫై, బ్లూటూత్, టైప్-సి పోర్ట్, 3.5mm ఆడియో జాక్ వంటి అన్ని ప్రధాన కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.  

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »