xMEMS లాబ్స్ ఈ విప్లవాత్మక భాగాలను సెప్టెంబర్ 16న తైపీలో, సెప్టెంబర్ 18న షెన్‌జెన్‌లో జరగనున్న xMEMS Live Asia సెమినార్ సిరీస్‌లో అధికారికంగా ప్రదర్శించనుంది.
Photo Credit: xMEMS Labs
xMEMS Labs Microfan
xMEMS Labs Microfan : మన చేతి వేలి గోరు పరిమాణంలో ఒక చిన్న ఫ్యాన్ ఉంటుందంటే ఎవరైనా నమ్మగలరా? కానీ ఇది నిజం! xMEMS లాబ్స్ అనే సంస్థ స్మార్ట్ గ్లాసెస్ కోసం ప్రత్యేకంగా ఒక మైక్రో ఫ్యాన్‌ను అభివృద్ధి చేసింది. సాధారణంగా స్మార్ట్ గ్లాసెస్‌ను ఎక్కువ సమయం ధరించినప్పుడు అవి వేడెక్కడం, వాటి బరువు కారణంగా మొహానికి భారం అనిపించడం పెద్ద సమస్యగా మారుతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ కంపెనీ సైకామోర్, మైక్రో కూలింగ్ అనే టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. ఇవి స్మార్ట్ గ్లాసెస్ వేడిని, బరువును తగ్గించడమే కాకుండా, భవిష్యత్తులో ధరించే స్మార్ట్ పరికరాలను మరింత చిన్నగా, తేలికగా మార్చడంలో సహాయపడతాయి.
ఎప్పుడు అందుబాటులోకి రానున్నాయి?
xMEMS లాబ్స్ ఈ విప్లవాత్మక భాగాలను సెప్టెంబర్ 16న తైపీలో, సెప్టెంబర్ 18న షెన్‌జెన్‌లో జరగనున్న xMEMS Live Asia సెమినార్ సిరీస్‌లో అధికారికంగా ప్రదర్శించనుంది. ప్రస్తుతానికి కంపెనీ వీటి డిజైన్‌కు సంబంధించిన కొన్ని గ్లింప్స్ మాత్రమే విడుదల చేసింది. ఈ గ్లోబల్ ఈవెంట్‌ను ప్రత్యక్షంగా చూడాలనుకునే ఆసక్తి ఉన్నవారు xMEMS లాబ్స్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి ముందస్తుగా తమ సీట్లను బుక్ చేసుకోవచ్చు. స్మార్ట్ గ్లాసెస్ భవిష్యత్తులో ప్రధాన AI ఇంటర్‌ఫేస్‌గా మారతాయని, ఇవి మనం ప్రపంచాన్ని చూసే విధానాన్ని, కమ్యూనికేషన్‌ను పూర్తిగా మారుస్తాయని కంపెనీ నమ్ముతోంది.
సర్ఫేస్ ఉష్ణోగ్రతను 40 శాతం తగ్గించే చిన్న ఫ్యాన్
కంపెనీ తీసుకొచ్చిన ఈ చిన్న ఫ్యాన్ µCooling అనేది ఒక ఫ్యాన్-ఆన్-ఎ-చిప్ సాలిడ్-స్టేట్ హిట్-మూవింగ్ సిస్టమ్. ఈ ప్రొటోటైప్‌ను స్మార్ట్ గ్లాసెస్ ఫ్రేమ్‌లోనే నేరుగా అమర్చవచ్చు. ఇది గ్లాసెస్ ఉపరితల ఉష్ణోగ్రతను ఏకంగా 40 శాతం వరకు తగ్గిస్తుందని కంపెనీ చెబుతోంది. అంతేకాకుండా, ఇది థర్మల్ మార్జిన్‌ను 70 శాతం వరకు పెంచుతుంది. దీనివల్ల గ్లాసెస్ ఎంత సమయం వాడినా వేడెక్కకుండా ఎంతో చల్లగా ఉంటాయి.
Indian Railways : బెడ్‌షీట్‌పై చిన్న మచ్చ ఉన్నా ఇక ఏఐ పట్టేస్తుంది.. రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్
ప్రపంచంలోనే అత్యంత సన్నని స్పీకర్లు
గత ఏడాది నవంబర్‌లో xMEMS సంస్థ Sycamore పేరిట ప్రపంచంలోనే మొదటి స్లిమ్ నియర్-ఫీల్డ్ ఫుల్-రేంజ్ స్పీకర్‌ను పరిచయం చేసింది. దీని మందం కేవలం 1 మిమీ కంటే కాస్త మాత్రమే ఎక్కువ. ఈ స్పీకర్లను ప్రత్యేకంగా వియరబుల్ పరికరాల కోసమే డిజైన్ చేశారు. ఇప్పుడు ఈ స్పీకర్లతో కూడిన AI-పావర్డ్ స్మార్ట్ గ్లాసెస్ ప్రొటోటైప్‌ను చూపించేందుకు కంపెనీ సిద్ధమైంది. ఈ గ్లాసెస్ సైడ్ ఆర్మ్స్‌లో అమర్చిన సైకామోర్ స్పీకర్లు స్పష్టమైన సౌండ్, నేచురల్ కాన్వర్సేషనల్ AI, అద్భుతమైన మ్యూజిక్ ప్లేబ్యాక్ అనుభూతిని అందిస్తాయి.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,652
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999