భారతదేశంలో ఇటెల్ ఆక్వా ఫోన్ ధరను కంపెనీ చాలా అందుబాటులో ఉంచింది. కేవలం రూ. 1,799 లకే ఈ మొబైల్‌ను సొంతం చేసుకోవచ్చు.
Photo Credit: Itel
Itel Aqua comes in Black, Blue and Red colour options
Itel Aqua : ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ల హడావుడి ఎంత ఉన్నా, కీప్యాడ్ ఫోన్లకు ఉండే క్రేజ్ వేరేగా ఉంటుంది. ముఖ్యంగా బ్యాకప్ ఫోన్‌గా వాడుకోవడానికి, ఇంట్లో పెద్దవాళ్లకు ఇవ్వడానికి చాలామంది ఇప్పటికీ వీటిని ఇష్టపడుతుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ బ్రాండ్ ఇటెల్ భారత మార్కెట్లో సరికొత్త సంచలనానికి తెరలేపింది. తన కొత్త ఇన్నో సిరీస్లో భాగంగా ఇటెల్ ఆక్వా అనే మోస్ట్ పవర్‌ఫుల్ ఫీచర్ ఫోన్‌ను లాంచ్ చేసింది. కేవలం రూ. 1,799 ధరలోనే నీటిలో పడినా, బురదలో పడినా అస్సలు పాడవని ఐపీ67 వాటర్‌ప్రూఫ్ రేటింగ్‌తో ఈ ఫోన్ రావడం విశేషం. టైప్-సి చార్జింగ్, ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్ వంటి ఎన్నో అడ్వాన్స్డ్ ఫీచర్లతో వచ్చిన ఈ చిన్న ఫోన్ వివరాలను తెలుసుకుందాం.
భారతదేశంలో ఇటెల్ ఆక్వా ఫోన్ ధరను కంపెనీ చాలా అందుబాటులో ఉంచింది. కేవలం రూ. 1,799 లకే ఈ మొబైల్‌ను సొంతం చేసుకోవచ్చు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈ ఫోన్‌ను బ్లూ, రెడ్, బ్లాక్ వంటి మూడు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో కంపెనీ తీసుకొచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ మొబైల్ రిటైల్ స్టోర్లలో ఆఫ్ లైన్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ లో ఉన్న బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే.. దీనికి ఐపీ67 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఇచ్చారు. అంటే రూ.1,800 లోపు వచ్చే ఈ ఫోన్ నీటిలో పడినా, వర్షంలో తడిచినా, బురదలో పడినా అస్సలు పాడవదు. పొరపాటున చేయి జారి కింద పడినా తట్టుకునేలా, రఫ్ అండ్ టఫ్ కండిషన్లలో వాడుకునేలా దీని బాడీని చాలా స్ట్రాంగ్‌గా డిజైన్ చేసినట్లు ఇటెల్ సంస్థ పేర్కొంది.
ఇటెల్ ఆక్వా మొబైల్‌లో 2.4-ఇంచుల డిస్ప్లేను అమర్చారు. బయట ఎండలో ఉన్నప్పుడు కూడా స్క్రీన్ పై ఉన్న అక్షరాలు చాలా స్పష్టంగా కనిపించేలా ఇందులో మెరుగైన బ్రైట్‌నెస్ లెవెల్స్ ఇచ్చారు. ఈ ఫోన్ లో అంతర్గతంగా 1,000 కాంటాక్ట్స్ (ప్రత్యేక ఐకాన్లతో), 250 మెసేజ్‌లు, 60 కాల్ లాగ్స్ వరకు సేవ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా, మెమరీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను ఏకంగా 32GB వరకు పెంచుకునే వెసులుబాటు కూడా ఉంది. సాధారణంగా చిన్న కీప్యాడ్ ఫోన్లలో మాట్లాడేటప్పుడు చుట్టుపక్కల వచ్చే గోల వల్ల అవతలి వారి మాటలు సరిగ్గా వినిపించవు. కానీ ఇటెల్ ఆక్వా ఫోన్‌లో స్మార్ట్‌ఫోన్ల రేంజ్‌లో AI ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌ను ఇచ్చారు. ఇది మీరు ఫోన్ మాట్లాడేటప్పుడు మీ చుట్టూ ఉన్న అనవసరమైన శబ్దాలను, ట్రాఫిక్ గోలను తగ్గించి.. అవతలి వ్యక్తికి మీ వాయిస్ చాలా క్లియర్‌గా వెళ్లేలా చేస్తుంది.
Asus : గేమర్లకు పూనకాలే.. మార్కెట్లోకి అసూస్ ఆల్ఫా రేంజ్ గాడ్జెట్స్
చదువురాని వారికి సైతం ఉపయోగపడేలా ఇందులో కింగ్ వాయిస్ అనే ద్విభాషా వాయిస్ అసిస్టెన్స్ ఫీచర్ ఉంది. ఇది ఫోన్ మెనూ ఆప్షన్లను, మీకు వచ్చే కాల్ సమాచారాన్ని, నోటిఫికేషన్లను ఇంగ్లీష్, హిందీ భాషల్లో వాయిస్ రూపంలో చదివి వినిపిస్తుంది. దీంతో పాటుగా ఈ ఫోన్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ, మరాఠీ, తమిళ్, గుజరాతీ, పంజాబీ, కన్నడ, మలయాళంతో సహా మొత్తం 10 భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. ఈ రోజుల్లో వస్తున్న ట్రెండ్‌కు తగ్గట్టుగా ఇటెల్ ఈ చిన్న ఫోన్ లో కూడా యుఎస్‌బీ టైప్-సి చార్జింగ్ పోర్టును ఇచ్చింది. దీనివల్ల చార్జింగ్ పెట్టడం చాలా ఈజీ అవుతుంది. కనెక్టివిటీ కోసం ఇందులో బ్లూటూత్ సపోర్ట్ ఉంది, దీని ద్వారా ఫైల్స్ కూడా షేర్ చేసుకోవచ్చు. హెడ్‌ఫోన్స్ అవసరం లేకుండానే రేడియో వినేలా వైర్‌లెస్ ఎఫ్ఎమ్తో పాటు, నచ్చిన పాటలను రికార్డ్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది.
ఇటెల్ ఆక్వా ఫోన్‌లో 1,200mAh బ్యాటరీని ప్యాక్ చేశారు. ఇందులో ఉండే సూపర్ బ్యాటరీ మోడ్ ఆన్ చేస్తే బ్యాటరీ చాలా రోజుల పాటు వస్తుంది. ఇవే కాకుండా.. ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్, స్పీడ్ డయల్ సపోర్ట్, టైమ్ అప్‌డేట్, మెనూ అండ్ ఫోన్ బుక్ ఎంట్రీ రీడింగ్ సపోర్ట్ వంటి ఎన్నో రకాల చిన్న చిన్న ఉపయోగకరమైన ఫీచర్లను ఈ మొబైల్‌లో అందించారు. ఈ ఫోన్ కొలతలు 127.5×54.4×10.65 మిమీగా ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
IFA 2026: Lenovo Unveiled New IdeaPad, Yoga and ThinkBook Laptops
IFA 2026: Nvidia RTX Spark PCs, Local AI Tools Announced With October Launch Planned
Luna Band Now Available Globally: Check Price in India, Specifications and Features