Lava Bold N2 5G : భారత మార్కెట్లోకి లావా కొత్త సంచలనం.. జూన్ 9న అమెజాన్‌లో సేల్ షురూ

లావా బోల్డ్ N2 5G స్మార్ట్‌ఫోన్ సింగిల్ వేరియంట్ అయిన 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ ఆప్షన్ లో లభిస్తుంది. దీని అసలు ధర రూ.12,999 కాగా, కంపెనీ ప్రత్యేక లాంచ్ ఆఫర్ కింద రూ.1,000 తగ్గింపును అందిస్తోంది.

Lava Bold N2 5G : భారత మార్కెట్లోకి లావా కొత్త సంచలనం.. జూన్ 9న అమెజాన్‌లో సేల్ షురూ

Photo Credit: Lava

Lava Bold N2 5G is available in Billionaire Blue and Regal Gold colours

ముఖ్యాంశాలు
  • లావా దేశీయ మార్కెట్లోకి సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ 5G స్మార్ట్‌ఫోన్‌
  • కంపెనీ ప్రత్యేక లాంచ్ ఆఫర్ కింద రూ.1,000 తగ్గింపును అందిస్తోంది.
  • జూన్ 9 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్లో లభ్యం
ప్రకటన

Lava Bold N2 5G : భారతదేశానికి చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ లావా దేశీయ మార్కెట్లోకి సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ 5G స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది.  లావా బోల్డ్ N2 5G పేరుతో బుధవారం ఈ హ్యాండ్‌సెట్ అధికారికంగా లాంచ్ అయింది. ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీ విడుదల చేసిన లావా బోల్డ్ N2 4G మోడల్‌కు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా దీనిని తీసుకువచ్చారు. తక్కువ ధరలోనే 5G కనెక్టివిటీని కోరుకునే భారతీయ వినియోగదారులను టార్గెట్ చేస్తూ లావా ఈ ఫోన్‌ను డిజైన్ చేసింది.

లావా బోల్డ్ N2 5G స్మార్ట్‌ఫోన్ సింగిల్ వేరియంట్ అయిన 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ ఆప్షన్ లో లభిస్తుంది. దీని అసలు ధర రూ.12,999 కాగా, కంపెనీ ప్రత్యేక లాంచ్ ఆఫర్ కింద రూ.1,000 తగ్గింపును అందిస్తోంది. దీంతో వినియోగదారులు ఈ ఫోన్‌ను రూ.11,999లకే సొంతం చేసుకోవచ్చు. ఈ మొబై బిలియనీర్ బ్లూ, రీగల్ గోల్డ్ అనే రెండు ఆకర్షణీయమైన రంగులలో అందుబాటులో ఉంటుంది. జూన్ 9, 2026 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్ ఇండియా ద్వారా దీని అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

డోర్‌స్టెప్ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ అష్యూరెన్స్
ఈ సరికొత్త 5G ఫోన్ కొనుగోలు చేసిన కస్టమర్ల కోసం లావా ఒక అదిరిపోయే సర్వీస్‌ను ప్రకటించింది. ఈ ఫోన్‌కు సంబంధించి ఎలాంటి సాంకేతిక సమస్యలు వచ్చినా కస్టమర్లు సర్వీస్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. లావా కంపెనీ ప్రతినిధులే నేరుగా కస్టమర్ ఇంటి వద్దకే వచ్చి మొబైల్ సర్వీసింగ్ అందిస్తారని కంపెనీ హామీ ఇచ్చింది. కాగా, ఇదే సిరీస్‌లో ఫిబ్రవరిలో వచ్చిన 4G వేరియంట్ ధర రూ.7,499గా ఉంది. ఇప్పుడు వచ్చిన 5G మోడల్‌లో ఫీచర్లు మరింత అప్‌గ్రేడ్ అయ్యాయి.

WhatsApp : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. స్కామర్ల ఆట కట్టించేందుకు వస్తున్న సరికొత్త ఫీచర్


అద్భుతమైన డిస్ ప్లే, లేటెస్ట్ సాఫ్ట్‌వేర్
ఫీచర్ల విషయానికి వస్తే, లావా బోల్డ్ N2 5G లో 6.75-ఇంచుల HD+ డిస్‌ప్లేను అమర్చారు. ఇది స్మూత్ పర్ఫార్మెన్స్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్ పైభాగంలో సెల్ఫీ కెమెరా కోసం వాటర్ డ్రాప్-స్టైల్ నాచ్ డిజైన్‌ను అందించారు. సాఫ్ట్‌వేర్ పరంగా ఈ ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో బాక్స్ నుండే వస్తుంది. బడ్జెట్ ధరలో లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఓఎస్ అందించడం విశేషం. సెక్యూరిటీ కోసం ఫోన్ పక్కభాగంలో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు.

ప్రాసెసర్ సామర్థ్యం, కెమెరా సెటప్
ఈ 5G స్మార్ట్‌ఫోన్ 6nm ఆర్కిటెక్చర్‌పై తయారైన పవర్‌ఫుల్ ఆక్టా-కోర్ యూనిసోక్ టి8200 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. దీనికి 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ జత చేశారు. ఇక కెమెరాల విషయానికి వస్తే.. వెనుక వైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 5-మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. అంతేకాకుండా, దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం ఈ ఫోన్‌కు ఐపీ64 (IP64) రేటింగ్ లభించింది.

భారీ బ్యాటరీ, ఛార్జింగ్ ఫీచర్లు
ఈ స్మార్ట్‌ఫోన్ మరో ప్రధాన హైలైట్ దీని బ్యాటరీ లైఫ్. ఇందులో ఏకంగా 6,000mAh భారీ బ్యాటరీని అమర్చారు. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి పూర్తి ఛార్జింగ్ చేస్తే ఏకంగా 815 నిమిషాల పాటు నిరంతరాయంగా యూట్యూబ్ (YouTube) వీడియోలను ప్లే చేయవచ్చని, అలాగే 743 నిమిషాల స్క్రీన్-ఆన్ టైమ్ లభిస్తుందని కంపెనీ ప్రకటించింది. అయితే, ఈ ఫోన్ బాక్స్‌లో మాత్రం 10W ఛార్జర్‌ను మాత్రమే అందిస్తున్నారు.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »