Lava Shark 2 : లాంచైన Lava Shark 2 5G.. రెడ్‌మీ, శామ్‌సంగ్ ఫోన్లతో గట్టి పోటీ.. ఏది కొంటే బెస్ట్?

మొదటగా ధరల విషయానికి వస్తే, లావా షార్క్ 2 5G ఫోన్ అన్నింటికంటే తక్కువ ధరకే లభిస్తోంది. దీని 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ సింగిల్ వేరియంట్ ధర రూ. 11,999 గా ఉంది.

Lava Shark 2  : లాంచైన  Lava Shark 2 5G.. రెడ్‌మీ, శామ్‌సంగ్ ఫోన్లతో గట్టి పోటీ.. ఏది కొంటే బెస్ట్?

Lava Shark 2 5G features a 6.75-inch HD+ LCD panel

ముఖ్యాంశాలు
  • రూ. 12 వేలకే 6000mAh బ్యాటరీతో లావా షార్క్ 2 5G
  • బడ్జెట్ ధరలోనే చైనా ఫోన్ల గుండెల్లో వణుకు పుట్టిస్తున్న దేశీయ 5G ఫోన్
  • రెడ్‌మీ, శామ్‌సంగ్‌ల పని అయిపోయినట్లేనా
ప్రకటన

Lava Shark 2  : భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తక్కువ బడ్జెట్‌లో 5G ఫోన్లను సొంతం చేసుకోవాలనుకునే యూజర్ల కోసం సరికొత్త మొబైల్స్ సందడి చేస్తున్నాయి. దేశీయ మొబైల్ బ్రాండ్ లావా తాజాగా తన సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ లావా షార్క్ 2 5Gని భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. భారీ బ్యాటరీ, యూనిసోక్ ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్‌కు మార్కెట్లో గట్టి పోటీ ఎదురుకానుంది. ముఖ్యంగా ఇదే ప్రైస్ రేంజ్‌లో ఉన్న రెడ్‌మీ 15A 5G, శామ్‌సంగ్ గెలాక్సీ F70e 5G ఫోన్లతో లావా కొత్త ఫోన్ తలపడనుంది. ఈ మూడు బడ్జెట్ 5G ఫోన్ల ధరలు, డిస్ప్లే, ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీ ఫీచర్ల మధ్య ఉన్న తేడాలను పోల్చి చూద్దాం.

ధరల విషయానికొస్తే ఏది తక్కువ?  
మొదటగా ధరల విషయానికి వస్తే, లావా షార్క్ 2 5G ఫోన్ అన్నింటికంటే తక్కువ ధరకే లభిస్తోంది. దీని 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ సింగిల్ వేరియంట్ ధర రూ. 11,999 గా ఉంది. ఇక రెడ్‌మీ 15A 5G బేస్ వేరియంట్ (4GB + 64GB) ధర రూ. 12,999 కాగా, టాప్ మోడల్ (6GB + 128GB) ధర రూ. 16,499 వరకు ఉంది. మరోవైపు, శామ్‌సంగ్ గెలాక్సీ F70e 5G ఫోన్ 4GB + 128GB వేరియంట్ ధర రూ. 12,999 గాను, 6GB + 128GB మోడల్ ధర రూ. 14,499 గాను నిర్ణయించారు. బడ్జెట్ పరంగా చూస్తే లావా ఫోన్ కాస్త చౌకైన ఆప్షన్ అని చెప్పవచ్చు.

డిస్ప్లే, ఆపరేటింగ్ సిస్టమ్ 
స్క్రీన్ విషయానికి వస్తే రెడ్‌మీ 15A 5G పెద్ద డిస్ప్లేతో వస్తోంది. ఇందులో 6.9-ఇంచుల HD+ LCD ప్యానెల్ ఉండగా, లావా ఫోన్ లో 6.75-ఇంచుల స్క్రీన్, శామ్‌సంగ్ ఫోన్ లో 6.7-ఇంచుల HD+ LCD స్క్రీన్ అమర్చారు. ఈ మూడు ఫోన్లు కూడా 120Hz రీఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తాయి. సాఫ్ట్‌వేర్ పరంగా మూడూ ఆండ్రాయిడ్ 16 తోనే రన్ అవుతాయి. అయితే లావా ఫోన్‌కు 1 సంవత్సరం ఓఎస్ అప్‌డేట్ లభిస్తే, రెడ్‌మీ ఫోన్‌కు 4 ఏళ్లు, శామ్‌సంగ్ ఫోన్‌కు ఏకంగా 6 ఏళ్ల పాటు భారీగా ఓఎస్ అప్‌డేట్స్ లభిస్తాయి.

ఫోన్ల బిల్డ్ క్వాలిటీ, వాటర్ రెసిస్టెన్స్ 
ధూళి, నీటి చుక్కల నుండి రక్షణ కోసం ఈ ఫోన్లకు ప్రత్యేక ఐపీ రేటింగ్స్ ఇచ్చారు. శామ్‌సంగ్ గెలాక్సీ F70e 5G ఫోన్ మెరుగైన IP54 రేటింగ్‌తో వస్తుండగా, లావా ఫోన్ IP64 రేటింగ్‌ను, రెడ్‌మీ ఫోన్ IP52 రేటింగ్‌ను కలిగి ఉన్నాయి. బరువు విషయానికి వస్తే శామ్‌సంగ్ ఫోన్ 199 గ్రాములతో తేలికగా ఉంటుంది, లావా ఫోన్ 200 గ్రాములు, రెడ్‌మీ ఫోన్ 210 గ్రాముల బరువును కలిగి ఉంటాయి.

Itel Aqua : రూ.1,800 లోపే ఇటెల్ ఆక్వా వాటర్‌ప్రూఫ్ ఫోన్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే


ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతోంది?  
పర్ఫార్మెన్స్ పరంగా శామ్‌సంగ్, రెడ్‌మీ ఫోన్లు కాస్త ముందంజలో ఉన్నాయి. శామ్‌సంగ్ గెలాక్సీ F70e 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ వాడగా, రెడ్‌మీ ఫోన్ లో సరికొత్త యూనిసోక్ T8300 5G ప్రాసెసర్ ఉపయోగించారు. మరోవైపు లావా షార్క్ 2 5G మోడల్ లో యూనిసోక్ T8200 చిప్‌సెట్ అమర్చారు. లావా ఫోన్ లో 4GB ర్యామ్‌ను వర్చువల్‌గా 8GB వరకు పెంచుకునే వెసులుబాటు ఉంది. రెడ్‌మీ, శామ్‌సంగ్ ఫోన్లు గరిష్టంగా 6GB ఫిజికల్ ర్యామ్ ఆప్షన్లతో లభిస్తాయి.

రచ్చ లేపుతున్న భారీ బ్యాటరీలు 
బ్యాటరీ విభాగంలో రెడ్‌మీ 15A 5G అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో ఏకంగా 6,300mAh భారీ బ్యాటరీతో పాటు 15W చార్జింగ్, 7.5W రివర్స్ చార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. కాగా లావా ఫోన్ లో 6,000mAh బ్యాటరీతో పాటు 18W చార్జింగ్ ఉంటుంది, ఇది ఒక్కసారి చార్జ్ చేస్తే 13 గంటలకు పైగా యూట్యూబ్ ప్లేబ్యాక్ టైమ్ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. ఇక శామ్‌సంగ్ ఫోన్ లో 6,000mAh బ్యాటరీ ఉన్నప్పటికీ, ఇది అన్నింటికంటే వేగంగా చార్జ్ అయ్యేలా 25W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

కెమెరా రేసులో ఏది టాప్? 
ఫోటోగ్రఫీ పరంగా శామ్‌సంగ్ క్లియర్ విన్నర్‌గా నిలిచింది. శామ్‌సంగ్ గెలాక్సీ F70e 5G లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్న అడ్వాన్స్‌డ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. అదే రెడ్‌మీ ఫోన్ లో 32 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో కూడిన డ్యూయల్ సెటప్ ఇవ్వగా, లావా షార్క్ 2 5G లో కేవలం సింగిల్ 13 మెగాపిక్సెల్ ఏఐ రేర్ కెమెరా మాత్రమే ఉంది. సెల్ఫీల కోసం శామ్‌సంగ్, రెడ్‌మీలలో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండగా, లావాలో 5 మెగాపిక్సెల్ కెమెరా అమర్చారు.

చివరిగా.. ఏ ఫోన్ కొనుగోలు చేయడం బెస్ట్?  
మీ బడ్జెట్ చాలా తక్కువగా ఉండి, రూ. 12 వేల లోపు మంచి బ్యాటరీ, ఐపీ రేటింగ్ ఉన్న 5G ఫోన్ కావాలనుకుంటే లావా షార్క్ 2 5G బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఒకవేళ మీకు అతిపెద్ద డిస్ప్లే, భారీ 6,300mAh బ్యాటరీ, లేటెస్ట్ ప్రాసెసర్ కావాలనుకుంటే రెడ్‌మీ 15A 5G వైపు వెళ్లొచ్చు. అలా కాకుండా అద్భుతమైన 50MP కెమెరా, వేగవంతమైన 25W చార్జింగ్, ఆరు సంవత్సరాల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఇచ్చే ఆల్ రౌండర్ ఫోన్ కావాలనుకుంటే శామ్‌సంగ్ గెలాక్సీ F70e 5G కొనుగోలు చేయడం అన్ని విధాలా ఉత్తమం.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »